అనుకూల సమయం మొదలవుతున్నది. ఒత్తిడిని అధిగమిస్తారు. పట్టుదలతో పనులు చేస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. అధికారుల ఆదరణ పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతి, అనుకూల స్థానచలనానికి అవకాశం ఉంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆదాయం బాగున్నప్పటికీ, అందుకు తగ్గ ఖర్చులూ ఉంటాయి. పెద్దల సూచనలు పాటించడం వల్ల లబ్ధి పొందుతారు.
పనులు ముందుకు సాగుతాయి. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. బంధువర్గంతో ప్రతికూల పరిస్థితులు ఏర్పడొచ్చు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. రాబడి మార్గాలపై దృష్టిసారిస్తారు. పాత బాకీలు ఆలస్యంగా వసూలు అవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. విద్యార్థులు రాణిస్తారు. విదేశీ ప్రయాణాలు కొంతకాలం వాయిదా వేసుకుంటే మంచిది. ఇంటి మరమ్మతులు చేపడతారు. అవసరానికి సరిపడా ఆదాయం ఉంటుంది.
తాత్కాలిక ప్రయోజనాలు పొందుతారు. పలుకుబడి పెరుగుతుంది. రోజువారీ వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. కొత్త వస్తువులు, దుస్తులు కొనుగోలు చేస్తారు. విహారయాత్రలు చేపడతారు. వ్యాపార భాగస్వాములతో మనస్పర్ధలు తలెత్తవచ్చు. నూతన ఒప్పందాల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. రియల్ ఎస్టేట్, గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారికి ఆర్థికంగా చికాకులు తలెత్తవచ్చు. వారాంతంలో ఒక శుభవార్త వింటారు. ఆరోగ్యంగా ఉంటారు.
వారం ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా.. క్రమంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. నూతన ఉద్యోగ అవకాశం ఉంది. పదోన్నతికి అవకాశం. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. రాబడి, ఖర్చులను బేరీజు వేసుకోవడం మంచిది. శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. ఉపాధ్యాయ, వైద్య వృత్తిలో ఉన్నవారికి అనుకూల సమయం. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు. అదృష్టం కలిసివస్తుంది.
కొన్ని ముఖ్యమైన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. స్నేహితుల సహకారం లభిస్తుంది. రాజకీయ, కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నిర్మాణ రంగంలో ఉన్న వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. ప్రణాళికా బద్ధంగా పనులు చేపడతారు. అందరినీ సమన్వయం చేస్తూ ముందుకు సాగుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉత్సాహంగా పనులు చేస్తారు. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉంటారు. పెద్దల సూచనలు పాటించడం వల్ల లబ్ధి పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.
స్నేహితులు, బంధువులతో సఖ్యత పెరుగుతుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. భూ లావాదేవీలు కలిసివస్తాయి. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. నిర్మాణ రంగంలో రాబడి పెరుగుతుంది. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. ఉద్యోగులు ఓపికతో పనులు చేసి అధికారుల మన్ననలు అందుకుంటారు. శత్రువుల మనసు గెలుచుకుంటారు. సహోద్యోగులతో సఖ్యతతో మెలుగుతారు. ఆరోగ్యంగా ఉంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఖర్చుల నియంత్రణ అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. వ్యవసాయదారులు మంచి దిగుబడి సాధిస్తారు.
వారం మొదట్లో కొన్ని చికాకులు తలెత్తుతాయి. వారాంతానికి సమసిపోతాయి. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కుటుంబసభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. రాబడి ఉన్నప్పటికీ, అందుకు తగ్గ ఖర్చులూ పలకరిస్తాయి. అధికారుల ఆదరణ కోసం ఉద్యోగులు కష్టపడాల్సి రావచ్చు. సహోద్యోగులతో స్నేహం చెడకుండా చూసుకోవడం మంచిది. వివాదాలకు దూరంగా ఉండండి. అన్న దమ్ములతో సఖ్యత నెలకొంటుంది. ఆరోగ్యంపై దృష్టి సారించడం అవసరం.
సహనం అవసరం. మాట జారకుండా జాగ్రత్త వహించండి. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కళాకారులకు మంచి సమయం. అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగులు కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందుతారు. వ్యాపారులు చేతిలో ఉన్న పనులు పూర్తి చేయడంపై దృష్టిసారించాలి. నూతన ఒప్పందాలు కొన్నాళ్లు వాయిదా వేసుకోవడం మంచిది. వ్యవసాయదారులకు ఇరుగుపొరుగు వారితో ఇబ్బందులు ఏర్పడవచ్చు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
కుటుంబసభ్యులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ఉద్యోగులకు మంచి సమయం. రాజకీయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. భూ లావాదేవీల్లో అప్రమత్తత అవసరం. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. పనుల్లో జాప్యం జరుగుతుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు భాగస్వాములతో మాటపట్టింపులు తలెత్తవచ్చు. గురువు ప్రభావం మూలంగా సమస్యలను అధిగమిస్తారు. సహోద్యోగుల సహకారం పొందుతారు.
శుభకార్యాలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖర్చులు పెరగవచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, తలపెట్టిన పనులు పూర్తవుతాయి. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. పెద్దల సలహా పాటిస్తారు. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. ఇంటికి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. నలుగురిలో గుర్తింపు పొందుతారు.
ఆరోగ్యంగా ఉంటారు. ఉల్లాసంతో పనులు చేస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. ఉద్యోగులకు సాటివారి సహకారం లభిస్తుంది. అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. వ్యాపారులకు అనుకూల సమయం. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొనసాగుతాయి. రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆధ్యాత్మిక ప్రవచనాలకు హాజరవుతారు. కొత్త పరిచయాలు బాగా కలిసివస్తాయి.
రోజువారీ వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలలో పెద్దల సహకారం లభిస్తుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతి, స్థానచలన సూచన. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి.