వ్యాపారం సంతృప్తికరంగా కొనసాగుతుంది. ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఆదాయం స్థిరంగా ఉండటంతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. సమాజంలో మంచిపేరును పొందుతారు. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడి ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. విద్యార్థులకు అనుకూలమైన వారం. స్థిర, చరాస్తుల ద్వారా ఆదాయం కలిసివస్తుంది.
కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారం అనుకూలంగా కొనసాగుతుంది. పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. విదేశాల్లో ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశాలు ఉన్నాయి. అధికారులతో స్నేహంగా ఉంటారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆస్తుల విషయంలో వివాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ప్రయాణాల వల్ల పనులు కలిసివస్తాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది.
విద్యార్థులు పోటీ పరీక్షలలో నెగ్గుతారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. అదృష్టం కలిసి వస్తుంది. కొత్త ఉద్యోగం, పదోన్నతి, అనుకూల స్థానచలనం ఉండవచ్చు. సహోద్యోగుల సహకారంతో పనులు సంతృప్తికరంగా పూర్తిచేస్తారు. ఇబ్బందులు ఉన్నప్పటికీ, చేపట్టిన పనులు పూర్తవుతాయి. వ్యాపారులు కొత్త ఒప్పందాలపై దృష్టిపెడతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. ఆలస్యమైనా రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యంగా ఉంటారు.
ప్రయాణాలు అనుకూలిస్తాయి. పనిలో బాధ్యతలు పెరుగుతాయి. పట్టుదల అవసరం. కోర్టు వ్యవహారాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. రోజువారీ వ్యాపారం సంతృప్తికరంగా కొనసాగుతుంది. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు అధికారులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండటం మంచిది. కొత్తవారితో పరిచయాలు ఏర్పడతాయి. భూ లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది.
పలుకుబడి పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ పనులలో కొంత ఆలస్యమైనప్పటికీ ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. అందరి సహకారం లభిస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. నిలిచిపోయిన పనులను పూర్తిచేస్తారు. పారిశ్రామికవేత్తలకు సిబ్బందితో ఇబ్బందులు తలెత్తవచ్చు. ఇంట్లో పెద్దవారితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు.
వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. రావలసిన సొమ్ము సమయానికి అందుతుంది. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. భాగస్వాములతో సంబంధాలు మెరుగవుతాయి. నూతన ఒప్పందాలపై దృష్టిసారిస్తారు. కొత్త పరిచయాలతో పనులు పూర్తవుతాయి. విహార యాత్రలు, తీర్థయాత్రలకు వెళ్తారు. ఉద్యోగులకు మంచి సమయం. తోటివారి సహకారం లభిస్తుంది. పదోన్నతి అవకాశం ఉంది. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆరోగ్యంగా ఉంటారు. వ్యవసాయదారులకు మంచి సమయం.
వ్యాపారం లాభదాయకం. అనుకున్న సమయంలో పనులను పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, సమయానికి డబ్బు చేతికి అందుతుంది. సంతృప్తిగా ఉంటారు. విద్యార్థులకు అనుకూల సమయం. కష్టానికి తగ్గ ఫలితం పొందుతారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. మిత్రుల కలయికతో ఖర్చులు పెరుతాయి. ఉద్యోగులకు బరువు, బాధ్యతలు పెరుగుతాయి. వ్యవసాయదారులకు సమయం అనుకూలంగా ఉంది.
ఇంటా, బయటా సంతృప్తిగా ఉంటారు. కుటుంబసభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. విందులు, వినోదాలకు హాజరవుతారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. సకాలంలో నిర్ణయాలు తీసుకుంటారు. కార్యసాఫల్యం ఉంది. అదృష్టం కలిసివస్తుంది. ఆత్మీయులతో వాదోపవాదాలకు దూరంగా ఉండండి. రాబడి పెరుగుతుంది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. వ్యాపార విస్తరణ వాయిదా వేసుకోవడం మంచిది.
ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. అందరి సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. పారిశ్రామికవేత్తలకు యంత్రాల మూలంగా ఖర్చులు పెరగవచ్చు. విద్యార్థులు శ్రమించవలసిన సమయం. పైచదువులకు ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. ప్రారంభించిన పనులలో శ్రమ పెరుగుతుంది. కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు.
సహోద్యోగులతో స్నేహం పెరుగుతుంది. అధికారుల ఆదరణతో కార్యసాఫల్యం ఉంది. నూతన నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. ఉద్యోగంలో పదోన్నతి వల్ల స్థానచలనం ఉంటుంది. రాజకీయ పనులు కలిసివస్తాయి. ప్రభుత్వ పనులలో విజయం చేకూరుతుంది. పారిశ్రామికవేత్తలకు న్యాయ పరమైన సమస్యలు తీరుతాయి. స్నేహితులు, బంధువుల రాకతో సంతోషంగా ఉంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పలుకుబడితో పనులు కలిసివస్తాయి. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు.
ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వాహన మరమ్మతులు ముందుకురావచ్చు. వ్యాపారులకు చిక్కులు ఎదురవుతాయి. భూ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. కోర్టు కేసులలో విజయం చేకూరుతుంది. రాజకీయ పనులు నెరవేరుతాయి. సహోద్యోగులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉత్సాహంతో ఉంటారు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. ఉద్యోగంలో స్థానచలన సూచన. శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ఆస్తుల ద్వారా ఆదాయం సమకూరుతుంది.
నూతన నిర్మాణ పనులు చేపడతారు. రోజువారీ వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ప్రారంభించిన పనులలో శ్రమ పెరిగినప్పటికీ, సానుకూలంగా పూర్తవుతాయి. నలుగురికి సాయపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ పెద్దల సహకారంతో పనులు పూర్తిచేస్తారు. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేపడతారు.