వృత్తి, వ్యాపారాల్లో కొంతకాలంగా నెలకొని ఉన్న ఆటంకాలు క్రమంగా తొలగిపోతాయి. పనిలో ఒత్తిడి ఉన్నప్పటికీ.. దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. బంధుమిత్రులతో సరదాగా కాలం గడుపుతారు. కొంత ఆలస్యమైనా పరిపూర్ణ ఫలితం పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం. సహోద్యోగులతో సఖ్యత నెలకొంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. రాబడి ఉన్నప్పటికీ అందుకు తగ్గ ఖర్చులూ ఉంటాయి. పెద్దల సలహాలు పాటించండి. నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి.
పనులు సాఫీగా సాగుతాయి. అధికారులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. వస్త్ర వ్యాపారంలో ఉన్న వారికి కలిసివస్తుంది. వాహన మరమ్మతుల వల్ల ఖర్చులుపెరుగుతాయి. విద్యార్థులకు మంచి సమయం. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. శుభకార్య యత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వారాంతంలో ఒక శుభవార్త వింటారు. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.
ఆర్థిక విషయాల్లో తాత్కాలిక ఊరట లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు సాఫీగా సాగుతాయి. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. పోటీ పరీక్షల్లో సత్ఫలితాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. భాగస్వాములతో మనస్పర్ధలు రావొచ్చు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండాలి. బాకీలు ఆలస్యంగా వసూలు అవుతాయి. రుణదాతల నుంచి ఒత్తిళ్లు పెరగవచ్చు. ఆరోగ్యంపై దృష్టి సారించండి. గణపతి ఆరాధనతో మేలు కలుగుతుంది.
వారం మొదట్లో చికాకులు ఉన్నా.. క్రమేపీ అనుకూల వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగులకు పదోన్నతి, అనుకూల స్థాన చలన సూచన. మంచి కార్యాల్లో పాలుపంచుకుంటారు. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. రాబడి, ఖర్చులను బేరీజు వేసుకొని కొత్త పనులకు శ్రీకారం చుడతారు. మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారులకు కలిసివస్తుంది. ప్రయాణాల వల్ల లబ్ధి పొందుతారు. శివారాధన మేలు కలుగుతుంది.
ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. స్నేహితుల వల్ల ఆర్థిక చికాకులు తలెత్తవచ్చు. పూచీకత్తుల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. విద్యార్థులకు మంచి సమయం. విదేశీ విద్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. సహోద్యోగులతో సత్సంబంధాలు ఉంటాయి. పనిచేసే చోట వివాదాలకు దూరంగా ఉండండి. పెద్దల సలహాతో లబ్ధి పొందుతారు. సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించండి.
చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. బంధువులతో విభేదాలు సమసిపోతాయి. ప్రయాణాల వల్ల కార్యసిద్ధి ఉంది. కోర్టు వ్యవహారాల్లో ప్రతికూల ఫలితాలు వెలువడుతాయి. భూ లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. పాతబాకీలు వసూలు అవుతాయి. విద్యార్థులకు మంచి సమయం. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు పనిభారం పెరిగినా, బాధ్యతతో నిర్వర్తిస్తారు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. నరసింహస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
వారం ప్రారంభంలో కొన్ని చికాకులు ఉంటాయి. క్రమంగా పరిస్థితులు అనుకూలిస్తాయి. పెద్దల సలహాలు పాటించడం అవసరం. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా సాగుతాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆహార నియమాలు పాటించాలి. కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి. అన్నదమ్ములు, స్నేహితులతో అనవసరమైన వివాదాలు ఏర్పడవచ్చు. సంయమనంతో వ్యవహరించండి. విద్యార్థులకు మిశ్రమ కాలం. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
ఈ వారం ప్రతికూలంగా ఉంది. అన్ని విషయాల్లో సహనం, జాగ్రత్త అవసరం. ఇంట్లో చికాకులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి. ఏ పని తలపెట్టినా నలుగురి సలహాలు తీసుకోవడం అవసరం. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. సహోద్యోగులతో విభేదాలు తలెత్తవచ్చు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి. శని బలంతో వారాంతానికి పరిస్థితుల్లో అనుకూల మార్పు వస్తుంది. ఆహార
నిమయాలు పాటించడం అవసరం. దత్తాత్రేయస్వామి స్తోత్రాలు పఠించండి.
ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారులకు అనుకూల సమయం. ప్రారంభంలో ఆటంకాలు ఎదురైనా సకాలంలో పనులు పూర్తవుతాయి. కుటుంబసభ్యులతో విభేదాలు తలెత్తవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. భూ లావాదేవీల్లో అప్రమత్తత అవసరం. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారులకు భాగస్వాములతో విభేదాలు తలెత్తవచ్చు. బృహస్పతి బలంతో అన్ని సమస్యలనూ అధిగమిస్తారు. పెద్దల మాటను పాటించక
పోవడం వల్ల పనులు వాయిదా పడతాయి. శివాలయాన్ని దర్శించుకోండి.
అనాలోచిత పెట్టుబడుల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. ఖర్చులు పెరుగుతాయి. కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. వారం మధ్యలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతారు. ఇరుగుపొరుగు సహకారంతో కొన్ని పనులు నెరవేరుతాయి. శుభకార్య ప్రయత్నాల్లో విఘ్నాలు తలెత్తుతాయి. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి. విష్ణు సహస్రనామాలు వినండి.
కొన్ని పనులు వాయిదా పడతాయి. విద్యార్థుల శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఉద్యోగులకు తాత్కాలిక ఊరట లభిస్తుంది. పెద్దల సూచనలు చాలా ఉపకరిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఖర్చుల నియంత్రణ పాటించండి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. కొత్త పనులు ప్రారంభించకుండా, చేతిలో ఉన్నవాటిపై దృష్టి పెట్టండి. శివారాధన శుభప్రదం.
వారం ప్రారంభంలో కొన్ని చికాకులు తలెత్తుతాయి. క్రమేపీ అనుకూలమైన మార్పు ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రోజువారీ కార్యకలాపాలు లాభసాటిగా సాగుతాయి. స్థిరచరాస్తుల మూలంగా ఆదాయం సమకూరుతుంది. కుటుంబసభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. ప్రయాణాలు వాయిదా పడతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.