Trigrahi Yoga | జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. మూడు గ్రహాలు ఒకే రాశిలో కలిసిన సమయంలో దాన్ని త్రిగ్రహి యోగమని అంటారు. ఈ యోగం చాలా ప్రభావవంతమైంది. ఇది ఆయా రాశులవారి జీవితంపై ప్రభావాన్ని చూపుతుంది. మీన రాశిలో బుధుడు ప్రవేశించడంతో త్రిగ్రహి యోగం ప్రారంభమైంది. మీనరాశిలో శని, బుధ, శుక్ర గ్రహాలతో ఈ శక్తివంతమైన యోగం ఏర్పడిందని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు. ఇది అత్యంత శక్తివంతమైన యోగాల్లో ఒకటని.. వృషభ, మిథున, కుంభరాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం ఉంటుందని.. శుభప్రదంగా ఉంటుందని.. జీవితంలో సానుకూల ప్రభావం పడుతుందని పేర్కొంటున్నారు. ఈ యోగం చాలా సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఏర్పడుతుంది. ఈ త్రిగ్రహి యోగం ముఖ్యంగా జాతకంలో గ్రహాల స్థానం అనుకూలంగా ఉన్న వారికి అదృష్టాన్ని తెస్తుంది. ఈ యోగ ప్రభావంతో ఆర్థిక పురోగతి, వృత్తిలో విజయం, కుటుంబంలో ఆనందంతో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందనున్నది. ఈ త్రిగ్రహి సంయోగం ఏ రాశుల జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుందో తెలుసుకుందాం రండి..!
వృషభరాశిపై ఈ త్రిగ్రహి యోగం ప్రభావం ఉంటుంది. వృషభ రాశి అధిపతి అయిన శుక్రుడు, శనితో పాటు చాలా శుభ ఫలితాలను ఇవ్వనున్నాడు. బుధుడు నాలుగో స్థానంలో ఉండడంతో కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఉద్యోగం, వ్యాపారాలు చేస్తున్న వృషభరాశి వ్యక్తులకు బుధుడి అనుగ్రహంతో అనేక లాభాల జరుగనున్నాయి. జీవితంలో అద్భుతమైన పురోగతి ఉంటుంది. విద్యారంగంలోని వారికి సువర్ణ అవకాశంగా చెప్పొచ్చు. పోటీ పరీక్షలు రాస్తే మాత్రం అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఉద్యోగులు చేసేవారికి పదోన్నతులు, ఉన్నతాధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. వ్యాపారులకు సైతం కలిసి రాబోతున్నది. పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలుంటాయి. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. కొత్తగా ఆదాయం వనరులు చేకూరుతాయి. అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి సైతం బాగుంటుంది. దీంతో పాటు వ్యాపారంలో వస్తున్న ఆర్థిక సమస్యలు పూర్తిగ తొలగిపోయి.. పురోగతి కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభసమయం. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగవుతుంది. ఇక అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి.
త్రిగ్రహి యోగం కారణంగా మిథున రాశి వారికి కూడా కలిసి రానున్నది. ఈ రాశిగల వ్యక్తులకు కెరీర్లో అద్భుతాలు జరిగే అవకాశాలున్నాయి. సమాజంలో గౌరవంతో పాటు కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబంలో తల్లిదండ్రుల అండదండలతో లభిస్తాయి. జీవితం అద్భుతంగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టేవారికి కలిసి వస్తుంది. మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. కెరియర్లో అద్భుతమైన ఫలితాలు సాధించే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. బుధుడి ప్రభావంతో శుభప్రదంగా ఉంటుంది. తెలివితేటలు పెరుగుతాయని.. తార్కిక శక్తి పెరుగుతుందని.. దాంతో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సహాయపడుతుందని పేర్కొంటున్నారు. ఉద్యోగాలు చేసే వారికి ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగవుతాయని.. ఉద్యోగోన్నతి లభించే అవకాశాలుంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి మంచి ఫలితాలుంటాయి.
ఈ త్రిగ్రహి యోగం కుంభరాశి జాతకులకు కలిసి వస్తుందని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు. ఈ యోగం ఈ జాతకం పన్నెండో ఇంట ఏర్పడుతున్నది. విదేశాలకు వెళ్లాలని ఆశిస్తున్న వారి కోరికలు నెరవేరే అవకాశం ఉంది. విదేశీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. అలాగే, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు సైతం అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలున్నాయి. ఈ గ్రహ జాతకులకు ఆధ్యాతిక చింతన, ధాన్యంపై ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే, శని పన్నెండో ఇంట ఉండడంతో కొంత మానసిక అలసట ఉండే అవకాశం ఉంది. కానీ, బుధుడు, శుక్రుడి ప్రభావంతో సమతుల్యం అవుతుంది. ఈ యోగం సమయలో ఏ పనులు చేసిన దీర్ఘకాలిక ప్రభావం ఉండే అవకాశం ఉందని.. ఆలోచనాత్మకంగా అడుగులు వేయాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. శత్రవులపై విజయ సాధించే అవకాశాలున్నాయని.. చట్టపరమైన అంశాల్లోనూ విజయాలు లభిస్తాయని పేర్కొంటున్నారు.