Surya Gochar 2025 | జ్యోతిషశాస్త్రం సూర్య భగవానుడు ఆత్మకు కారకుడు. గ్రహరాశులకు రాజుగా పేర్కొన్నారు. సూర్యుడు ప్రతినెలా తన రాశిచక్రాన్ని మార్చుకుంటాడు. అందువల్ల రాశిచక్రం ఒక భ్రమణం పూర్తి చేసేందుకు సంవత్సరం పడుతుంది. సూర్యుడి రాశిచక్ర మార్పును సూర్య సంక్రాంతిగా పిలుస్తారు. సూర్యుడి రాశిచక్ర మార్పు ప్రభావం మిగతా రాశిచక్రాలపై పడుతుంది. ఆగస్టు నెలలో సూర్యుడు తన సొంత రాశి సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ క్రమంలో కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టబోతున్నదని జ్యోతిష పండితులు పేర్కొంటున్నారు. ఉద్యోగం, వ్యాపారాల్లో విజయాలు సాధిస్తారని, శుభాలు జరుగుతాయని చెబుతున్నారు.
సూర్యుడు తన సొంత రాశిలో సంచరించడం వల్ల రాబోయే కాలంలో సింహ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. సూర్యుడు సింహ రాశిలో సంచరించడం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సూర్యుడు తన సొంత రాశి నుంచి లగ్నంలో సంచరిస్తాడు. దాంతో మీరు ప్రముఖ వ్యక్తులను కలిసే అవకాశం లభిస్తుంది. కెరియర్లో మంచి స్థానానికి చేరుకుంటారు. వైవాహిక జీవితంలో మధురంగా ఉంటుంది. అవివాహితులకు వివాహాలు జరిగే సూచనలున్నాయి.
సూర్యుడి సంచారంతో ధనస్సురాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశివారి అదృష్ట స్థానంలో సూర్య భగవానుడు సంచరించనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి జాతకులు చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. ఆధ్యాత్మికత వైపు దృష్టి సారిస్తారు. రాబోయే కాలంలో భౌతిక సౌకర్యాలు పెరుగుతాయి. మీరు పని చేస్తున్న చోట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభించే ఛాన్స్ఉంది. ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడుతుంది.
సూర్యుడి రాశిచక్రం మార్పుతో వృశ్చిక రాశి వారికి శుభప్రదంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం జాతకంలో పదవ ఇంట సూర్యుడు సంచరిస్తాడు. జాతకంలో పదో స్థానం వృత్తి, వ్యాపారాల్లో వృద్ధిని సూచిస్తుంది. రాబోయే రోజుల్లో కొత్త పనులు చేపట్టే వారికి కలిసి వస్తుంది. గతంలో ఎవరికైనా డబ్బులు ఇచ్చి రాక ఇబ్బందులు పడుతుంటే.. తిరిగి చేతికందే పరిస్థితి ఉన్నది. అలాగే, ఆకస్మికంగా ధనలాభం జరిగే సూచనలున్నాయని పండితులు పేర్కొంటున్నారు.