Sun Transit | వేద జ్యోతిషశాస్త్రంలో సూర్యుడి మార్పునకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సూర్యుడు ప్రతి నెలా తన రాశిని మార్చుకుంటాడు. దీన్నే సూర్య సంక్రాంతిగా పిలుస్తారు. ఆగస్టు 17న సూర్యుడు అర్ధరాత్రి 1.41 గంటలకు సింహరాశిలోకి ప్రవేశించాడు. జ్యోతిషశాస్త్రంలో సూర్యుడిని అన్ని గ్రహాలకు రాజుగా పరిగణిస్తారు. ఆత్మకు కారణభూతమైన గ్రహం. నాయకత్వ సామర్థ్యం, ఉత్సాహం, శక్తిని సూచిస్తుంది. జాతకంలో సూర్యుడు బలంగా ఉన్నప్పుడు.. ఒక వ్యక్తి జీవితంలో గౌరవ మర్యాదలు అందుకుంటాడు. సూర్యుడి మార్పు కారణంగా ఈ రాశులవారి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం..!
మేష రాశి ఐదో ఇంట సూర్యుడి సంచారం జరుగనున్నది. సూర్యుడు విజయానికి ప్రతీకగా పేర్కొంటారు. పని, వ్యాపారంలో పురోగతి ఉంటుంది. మీరు విద్యకు సంబంధించిన అంశాల్లో విజయాలను అందుకుంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా విజయం లభిస్తుంది. ప్రేమ సంబంధిత విషయాల్లో ఉదాసీనంగా ఉంటారు. దాంతో పనిపై మరింత ఆలోచనాత్మకంగా ఉండడం మంచిది. కొత్త వ్యక్తులతో సంబంధాలు పెరుగుతాయి. ఫలితంగా ఆహ్లాదకరమైన ఫలితాలుంటాయి. పిల్లల విషయంలో బాధ్యతలు నెరవేరుస్తారు.
వృషభరాశి నాలుగో ఇంట సూర్యుడి సంచారం జరుగనున్నది. ఈ రాశివారిపై ప్రభావం చాలా మిశ్రమంగా ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లోని వారి పనులు పూర్తవుతాయి. కొత్తగా టెండర్ దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి ఈ సమయం బాగుంటుంది. ఆరోగ్యం ప్రభావితమవుతుంది. స్నేహితులు, బంధువుల నుంచి చేదువార్తలు అందుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. మీ వస్తువులను దొంగలబారిన పడకుండా చూసుకోండి. ఆస్తికి సంబంధిన సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మిథున రాశి మూడో ఇంట సూర్య భగవానుడు సంచరించనున్నాడు. ఆయన ప్రభావం చాలా ఉత్సాహంగా ఉంటుంది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా విజయం సాధిస్తారు. మీ శక్తితో ప్రతికూల పరిస్థితులను కూడా సులభంగా నియంత్రించగలుగుతారు. కుటుంబంలోని వ్యక్తులతో వివాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆధ్యాత్మికత వైపు దృష్టి సారిస్తారు. పేదలకు సహాయం చేసేందుకు ముందుకు వస్తారు. ప్రభుత్వం నుంచి మీకు పూర్తిగా మద్దతు లభిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు.
ఈ రాశి రెండో ఇంట సూర్యుడు సంచరించనున్నాడు. ఆయన ప్రభావంతో చాలా చేసిన పనులన్నీ విజయవంతమవుతాయి. ఆకస్మిక ధన లాభాలు పొందే అవకాశం ఉంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు కూడా తిరిగి పొందే అవకాశం ఉంది. ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆస్తి సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనం కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఇదే మంచి సమయం. పని, వ్యాపారం విషజ్ఞంలో గోప్యత పాటించాలి. ఏ పని పూర్తి చేసే వరకు బయటకు చెప్పకపోవడం మంచిది.
సూర్య భగవానుడి అనుగ్రహం ఈ రాశివారికి లభించనున్నది. ఆరోగ్యం పరంగా కొంత శారీరక ఇబ్బందులుపడే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారరంగంలోని వారికి పురోగతి ఉంటుంది. ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. సృజనాత్మక పనుల్లో విజయం సాధిస్తారు. ఎన్నికలు మొదలైన వాటికి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే.. ఆ కోణం నుంచి కూడా గ్రహ సంచారం అనుకూలంగా ఉంటుంది.
కన్యారాశి 12వ ఇంట్లో సూర్యుడి సంచారించనున్నాడు. ఈ రాశివారికి కాస్త ఇబ్బందులుపడే అవకాశం ఉంది. ఖర్చులు ఎక్కువవుతాయి. మీరు చేసే ప్రయాణాలతో ప్రయోజనం ఉంటుంది. ఒక విదేశీ కంపెనీలో ఉద్యోగం కోసం.. మరొక దేశానికి వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటే ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. కోర్టు కేసులలో నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటుందని సూచనలు ఉన్నాయి. ఈ కాలంలో ఎవరికీ ఎక్కువ డబ్బు అప్పుగా ఇవ్వకండి. అలా చేస్తే.. మీకు ఆ డబ్బు సకాలంలో తిరిగి అందదు.
సూర్యుడు తుల రాశి నుంచి పదకొండవ ఇంట సంచరించనున్నాడు. వ్యూహాలన్నీ ప్రభావవంతంగా ఉంటాయి. పని, వ్యాపారంలో పురోగతి ఉంటుంది. కొత్త వ్యక్తులతో మీ సంబంధాలు పెరుగుతాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. ఉద్యోగం మారాలని ప్రయత్నించే వారికి.. ఈ సమయం కలిసి వస్తుంది. పిల్లలకు సంబంధించిన సమస్యలన్నీ ఇబ్బందులపడే అవకాశం ఉంది. చెడు సహవాసం వీడాలి.
వృశ్చిక రాశి పదవ ఇంట సూర్యుడు సంచరించనున్నాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో కొత్త టెండర్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి.. అనుకూలంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వస్తే.. ఆ సమయం కూడా ఉత్తమంగా ఉంటుంది. విజయం ఉన్నప్పటికీ, మీరు ఎక్కడో మానసిక సంఘర్షణను ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు వాహనం కొనాలని ఆలోచిస్తుంటే, ఆ సమయం మెరుగ్గా ఉంటుంది.
ఆ రాశి తొమ్మిదో ఇంట్లో సూర్యుడు సంచరించనున్నాడు. సూర్య భగవానుడి ప్రభావంతో అదృష్టం వరిస్తుంది. ధైర్యం పెరుగుతుంది. ఆధ్యాత్మిక పురోగతి ఉంటుంది. ట్రస్టులు, అనాథాశ్రమాలకు సంబంధిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. దానధర్మాలు చేస్తారు. పిల్లలకు సంబంధించిన చింతలు తగ్గుతాయి. కొత్తగా పెళ్లైన జంటకు సంతానం కలిగే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. వ్యాపారంలో నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేయొద్దు.
మకర రాశి ఎనిమిదో ఇంట సూర్యుడు సంచరించనున్నాడు. సూర్య భగవానుడి ప్రభావం మిమ్మల్ని అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఊహించని ఫలితాలు ఎదుర్కొంటారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. సొంత వ్యక్తులే మిమ్మల్ని అవమానించడానికి ప్రయత్నిస్తారు. కుట్రలకు బలవకుండా చూసుకోవాలి. ఇవన్నీ ఉన్నప్పటికీ.. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆకస్మికంగా ఆర్థిక లాభాల అవకాశాలు ఉన్నాయి. ఖరీదైన వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు.
కుంభరాశి ఏడో ఇంట సూర్య భగవానుడి సంచారం ఉంటుంది. వివాహ ప్రతిపాదనలు వస్తాయి. అయితే, విజయవంతమయ్యేందుకు సమయం పడుతుంది. వైవాహిక జీవితంలో ఉదాసీనత ఉంటుంది. అత్తమామలతో సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉమ్మడి వ్యాపారాలు మానుకోవడం ఉత్తమం. ప్రభుత్వ శాఖలలో కొత్త టెండర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చినప్పటికీ.. సమయం అనుకూలంగా ఉంటుంది. వీసా మొదలైన వాటికి దరఖాస్తు చేసుకుంటే.. ఈ సమయం అద్భుతంగా ఉంటుంది.
మీనరాశి నుంచి ఆరో ఇంట సూర్యడు సంచరించనున్నాడు. రెండు గ్రహాల కలయికతో శత్రుపీడ తొలగిపోతుంది. కోర్టు కేసుల్లో మీకు అనుకూలంగా నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ సేవకు దరఖాస్తు చేసుకోవలసి వస్తే.. ఆ కోణం నుంచి అద్భుత అవకాశాలుంటాయి. శక్తి సామర్థ్యాలను సరిగ్గా ఉపయోగించి పని చేస్తే.. ముందుకు సాగుతారు. ప్రయాణాలను జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే, ఎక్కువగా బ్యాంకు రుణాలు తీసుకోకపోవడం మంచిది.