Anti Inflammatory Foods | వయస్సు మీద పడిన వారిలో సహజంగానే కీళ్లలో కదలికలు తగ్గి కీళ్ల నొప్పులు, వాపులు వస్తుంటాయి. ఈ సమస్య వచ్చేందుకు పలు ఇతర కారణాలు కూడా ఉంటాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉండడం, పలు రకాల మందులను వాడడం, గాయాలు, దెబ్బలు తగలడం వంటివి కూడా కీళ్ల నొప్పులు, వాపులు వచ్చేందుకు కారణం అవుతాయి. శరీరంలో కొన్ని రకాల పోషకాలు లోపించడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. చలికాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే కీళ్ల నొప్పులు, వాపులు ఉన్నవారు నొప్పిని తగ్గించే మందులను వాడుతుంటారు. ఇవి అప్పటి వరకు తాత్కాలికంగా ఉపశమనం అందించినా దీర్ఘకాలంలో తరచూ నొప్పి నివారణ మందులను ఉపయోగం అంత మంచిది కాదు. వీటి వల్ల కిడ్నీలపై భారం పడుతుంది. ఇంకా అనేక సమస్యలు వస్తాయి. కనుక కీళ్ల నొప్పులు, వాపులను సహజసిద్ధంగా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అందుకు గాను యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉండే ఆహారాలను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. వీటి వల్ల ఎంతగానో ఉపయోగం ఉంటుంది.
కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించేందుకు గాను ఆకుకూరలు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిల్లో అనేక రకాల మినరల్స్ ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. పాలకూర, తోటకూర, బచ్చలికూరను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. వీటిల్లో విటమిన్ కె అధికంగా ఉంటుంది. ఇది వాపులను తగ్గించడంలో సహాయం చేస్తుంది. ఆకుకూరల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి, వాపులను తగ్గేలా చేస్తాయి. దీని వల్ల ఆర్థరైటిస్ లేదా కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. క్యాబేజీ, కీరదోస, కొత్తిమీర వంటి కూరగాయలు, ఆకుకూరలను తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. ఇవి సమస్య నుంచి బయట పడేలా చేస్తాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
పసుపులో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. కనుక దీన్ని రోజూ తీసుకుంటే నొప్పులు, వాపులకు చెక్ పెట్టవచ్చు. పసుపును మనం రోజూ వంటల్లో వేస్తుంటాం. కానీ ఇది మన శరీరానికి సరిపోదు. కనుక పసుపును విడిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో లేదా పాలలో పావు టీస్పూన్ పసుపును కలిపి రోజూ రాత్రి పూట తాగాల్సి ఉంటుంది. దీని వల్ల ఎంతో ఫలితం ఉంటుంది. నొప్పులను, వాపులను తగ్గిస్తుంది. అలాగే మనం తరచూ వంటల్లో వేసే అల్లం కూడా మేలు చేస్తుంది. దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. అల్లంలోనూ యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అల్లం రసంను రోజూ రెండు పూటలా పూటకు ఒక టీస్పూన్ చొప్పున భోజనానికి ముందు సేవిస్తుండాలి. దీని వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. నొప్పులు, వాపులు తగ్గి ఉపశమనం లభిస్తుంది.
బీట్రూట్ను చాలా మంది అంతగా ఇష్టపడరు. కానీ ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. బీట్ రూట్లో పొటాషియం, మెగ్నిషియం, నైట్రేట్స్ ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. కనుక రోజూ బీట్ రూట్‌ను ఒక కప్పు మోతాదులో తింటుంటే ఫలితం ఉంటుంది. కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించుకోవచ్చు. బీట్ రూట్‌ను నేరుగా తినలేకపోతే జ్యూస్ చేసి ఒక కప్పు మోతాదులో రోజూ తాగాలి. దీని వల్ల సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. అలాగే వారంలో కనీసం రెండు సార్లు చేపలను తింటున్నా ఉపయోగం ఉంటుంది. చేపలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ ఫ్లామేటరీ పోషకాలుగా పనిచేస్తాయి. అలాగే చేపల్లో విటమిన్లు బి6, బి12, విటమిన్ డి ఉంటాయి. ఇవి కూడా నొప్పులు, వాపులను తగ్గించడంలో సహాయం చేస్తాయి. కనుక తరచూ చేపలను తింటుంటే ఉపయోగం ఉంటుంది. ఇలా ఆయా ఆహారాలను తరచూ తింటుంటే కీళ్ల నొప్పులు, వాపులను సహజసిద్ధంగా తగ్గించుకోవచ్చు.