Khappar Yogam | సింహరాశిలోకి కుజుడు ప్రవేశించడంతో ఖప్పర్ యోగం ఏర్పడింది. వేద జ్యోతిషశాస్త్రంలో ఓ ముఖ్యమైన ఘటనగా పేర్కొంటున్నారు పండితులు, ఆగస్టు 13 వరకు ఈ యోగం ఉండనున్నది. ఖప్పర్ యోగం అశుభ, ఉగ్రయోగం. ఇది మానసిక, ఆర్థిక, వైవాహిక జీవితంలో అసమతుల్యతకు కారణంగా భావిస్తారు. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. సూర్యుడు, కుజుడు వంటి శక్తివంతమైన గ్రహాలు కలిసిన ఈ సమయంలో పలురాశుల వారికి సవాల్‌తో కూడుకున్నదిగా ఉంటుంది. ఈ సమయంలో కోపం, అహంకారం, అధికార పోరాటం జరిగే అవకాశాలు పెరుగుతాయి. ఇది ప్రమాదాలు మరియు ఒత్తిడితో కూడిన పరిస్థితులకు దారితీస్తుంది. ఇది పూజ, విశ్వాసానికి మాత్రమే కాదు, గ్రహాల ప్రభావాన్ని అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉండే సమయం కూడా. సెప్టెంబర్‌లో బుధుడు కన్యారాశిలోకి ప్రవేశించనుండడంతో భద్రరాజయోగం ఏర్పడుతుంది. ఇది పలురాశుల వారికి ఆర్థికంగా లాభాలుంటాయి. ఈ ఖప్పర్ యోగం, భద్రరాజయోగం ఏ రాశుల వారిని ప్రభావితం చేస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం రండి..!
ఖప్పర్ యోగా అనేది వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత అశుభకరమైన. భయంకరమైన యోగం. ఇది కుజుడు, సూర్యుడు ప్రత్యేకమైన గ్రహస్థితిలో కలిసినప్పుడు ఏర్పడుతుంది. ఈ యోగం జీవనంలో ఒత్తిడి, వివాదాలు, నష్టం, విధ్వంసకరమైన ఘటనలకు సూచికగా ఉంటుంది. కుజుడు సూర్యుడి నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు (ఉదాహరణకు – ఉత్తర ఫాల్గుణి, కృత్తిక, ఉత్తరాషాఢ), కుజుడు సూర్యుడి రాశిలో అంటే సింహ రాశిలో సంచరించినప్పుడు ఖప్పర్ యోగం ఏర్పడుతుంది. ఈ యోగంలో సూర్యుడు, కుజుడు కలయిక, పరస్పర నక్షత్రాలపై ప్రభావం వల్ల తీవ్రమైన, ఘర్షణాత్మక శక్తి ఏర్పడుతుంది. ఈ శక్తి నియంత్రించకపోతే వ్యక్తిగత సంబంధాల్లో వివాదాలు, ప్రమాదాలు, ఆస్తి నష్టం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. జీవితంలో అస్థిరత ఏర్పడే అవకాశమూ ఉంది. జ్యోతిష్య నిపుణుల మాత్రం ఖప్పర్ యోగానికి భయపడాల్సిన అవసరం లేదని.. ధైర్యంగా ఉండాలని సూచిస్తున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించాలని.. దురాశ, కోపం, నెగెటివ్ భావోద్వేగాలను నియంత్రించుకోవాలని చెబుతున్నారు.
మిథున రాశి వారు ఈ సమయంలో మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. మాట్లాడే సమయంలో నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంటుంది. దీని కారణంగా వారు అనుకోకుండా వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంటుంది. మాటల్లో తొందరపాటు కారణంగా సంబంధాల్లో చీలికలకు దారి తీసే అవకాశం ఉంటుంది. పని చేసే చోట్ల అపార్థాలు పెరిగే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో సంయమనం, జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా మాట్లాడే సమయంలో, ప్రవర్తనలో మార్పులు లేకుండా చూసుకోవాలి.
కర్కాటక రాశి వారు ఖప్పర్ యోగా ప్రభావం కుటుంబ జీవితంలో అసంతృప్తి, అసమ్మతి రూపంలో కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు పెరగవచ్చు. ఇది మానసిక ప్రశాంతతను ప్రభావితం చేస్తుంది. ఆర్థిక ఒత్తిడి కారణంగా ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఈ సమయం రాశివారికి సవాలుగా మారే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలను వాయిదా వేయడం మంచిది, భావోద్వేగ సమయాల్లో మనసును స్థిరంగా ఉంచుకోవాలి.
కన్యా రాశి వారు కూడా ఈ కాలంలో కెరీర్, ఉద్యోగ సంబంధిత సమస్యలల్లో చిక్కుకుంటారు. బాస్, సీనియర్ అధికారులతో విభేదాలు ఉండొచ్చు. ఇది కార్యాలయంలో ఉద్రిక్తతలను పెంచుతాయి. పదోన్నతిలో అడ్డంకులు, కొత్త అవకాశాలను అడ్డుకునే అవకాశం ఉంటుంది. ప్రధాన నిర్ణయాల్లో ఆలస్యం, నిరాశలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో జాగ్రత్తగా పని చేయడం, ఎలాంటి వివాదాలకు దూరంగా ఉండడం ముఖ్యం.
వృశ్చిక రాశి వారు ఆస్తి లేదంటే చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటారు. ఈ కాలంలో కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు పెరగవచ్చు. ఇది మానసిక ఒత్తిడిని కూడా పెంచుతుంది. ఈ సమయంలో శారీరక బలహీనతలు, గాయాలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి. సమస్యలను పరిష్కరించడానికి ఓపిక, సంయమనం అవసరం.