Horoscope 2026 | ఈ సంవత్సరం చివరి నాటికి గ్రహాల కదలికలో ప్రధాన మార్పులు కనిపించనున్నాయి. ఇవి ద్వాదశ రాశులపై తీవ్ర ప్రభావాన్నే చూపనున్నాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం డిసెంబర్లో కీలక గ్రహాలు స్థానాలను మారనున్నాయి. మొదట శని మీనరాశిలో ప్రత్యక్షంగా ఉంటాడు. ఆ తర్వాత దేవ గురువు బృహస్పతి డిసెంబర్ 5న మధ్యాహ్నం 3.38 గంటలకు తన రాశిని మార్చుకుంటాడు. కర్కాటకం నుంచి మిథునరాశిలోకి వెళ్తాడు. వచ్చే ఏడాది జూన్ ఒకటి వరకు అదేరాశిలో బృహస్పతి ఉంటాడు. అదే సమయంలో కుజుడు డిసెంబర్ 28న ధనుస్సు రాశిలోకి వెళ్తాడు. ఇది జ్యోతిషశాస్త్రంలో గణనీయమైన మార్పుగా పండితులు పేర్కొంటున్నారు. శని, గురువు, కుజుడి సంచారంతో పలురాశుల వారికి ప్రయోజనం కలుగనున్నది. ఈ ప్రభావం రాబోయే నూతన సంవత్సరం ప్రారంభం వరకు కొనసాగే అవకాశం ఉంది. రాశుల మార్పులతో లాభపడనున్న గ్రహాలు ఏంటో తెలుసుకుందాం..!
ఈ సమయం మేషరాశికి ప్రయోజనకరంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు కోరుకున్న ఉద్యోగం మీకు దక్కుతుంది. సీనియర్లు, జూనియర్లు మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. మేష రాశివారు ప్రభుత్వంలో ఉన్నవారితో సన్నిహిత సంబంధాలు పెంచుకుంటారు. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. ఫీల్డ్ వర్కర్స్ క్షేత్రస్థాయిలో కొత్త ప్రాజెక్టుల్లో పాల్గొంటారు.
మిథున రాశి వివాహ బంధం బలపడుతుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుంచి, ఆచరణాత్మక మద్దతు పొందుతారు. దాంతో మీరు మానసికంగా మరింత మెరుగవుతారు. నెల ప్రారంభం నుంచి మీరు ఆశించినట్లుగానే వ్యాపారంలో లాభాలు చూస్తారు. ఈ సమయంలో మీకు విదేశీ పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ సంబంధాలతో ఆనందం కలుగుతుంది. అయితే, కెరీర్, వ్యాపారం సాధారణ స్థితికి చేరుకుంటుంది.
సింహ రాశి వారు కళా రంగంలో రాణించే అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాలపై చర్చిస్తూ వ్యాపారవేత్తలతో కనెక్ట్ అవుతారు. వ్యాపార ప్రణాళిక కార్యరూపం దాల్చుతాయి. అవివాహితులకు పెళ్లి ప్రతిపాదనలు వస్తాయి. ప్రస్తుతం కళాశాల అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్న వారు శుభవార్త వింటారు. విదేశీ వాణిజ్యం, మల్టినేషనల్ కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్న వారి జీతం పెరిగే అవకాశం ఉంది. మీకు కొత్త వ్యక్తులు స్నేహితులవుతారు. సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఉన్నతాధికారుల మద్దతు సైతం మీకు ఉంటుంది.
మకర రాశి విదేశీ పర్యటన చేసే అవకాశం ఉంది. ఈ ప్రయాణం మీకు ఆహ్లాదకరంగా, ప్రయోజనకరంగా మారే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. పిల్లలు సాధించే విజయంతో మీ ప్రతిష్ట పెరుగుతుంది. పెట్టుబడులతో ఆశించిన లాభాలు వస్తాయి. మీరు మార్కెట్లో గుర్తింపు సాధిస్తారు. వాహనం, ఇల్లు కొనాలన్న మీ కల నేరవేరే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని సానుకూల మార్పులుంటాయి. కొత్త బాధ్యతలను నెరవేర్చడంలో విజయవంతమవుతారు.
Read Also :