Navapanchama Yogam | జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవగ్రహాల్లో గురు గ్రహానికి ఎంతో ప్రాముఖ్యం ఉన్నది. దేవతలకు గురువైన గురుగ్రహం ఎవరి జాతకంలో బలమైన స్థానంలో ఉంటే వారి జీవితంలో అద్భుతమైన ప్రయోజనాలుంటాయని విశ్వసిస్తుంటారు. అలాగే, నవగ్రహాల్లో రాహువుకు సైతం ప్రత్యేక స్థానం ఉంటుంది. రాహువు మంచి స్థానంలో ఉంటేనే చాలా లాభాలుంటాయని పండితులు పేర్కొంటున్నారు. మే 14న బృహస్పతి మిథునరాశిలోకి వెళ్లనుండగా.. మే 18న కుంభరాశిలోకి సంచరించనున్నాడు. ఈ మార్పుతో రాహువు బృహస్పతితో నవపంచమ యోగం ఏర్పడనున్నది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఐదు గ్రహాలు ఒకదానితో ఒకటి తొమ్మిది, ఐదోస్థానంలో ఉంటే.. ఈ పరిస్థితిలో నవపంచమ యోగం ఏర్పడుతుందని పండితులు పేర్కొంటున్నారు. ఈ యోగంతో పలు రాశులవారికి ఎంతో శుభసూచకమని చెబుతున్నారు. గురు-రాహువు నవపంచమ యోగం కారణంగా ఓ వ్యక్తి జీవితంలో పురోగతి, విజయాన్ని ప్రోత్సహిస్తుందని పండితులు పేర్కొంటున్నారు. క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ విజయం సాధిస్తారని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు. మే 18 నుంచి ఏర్పడే ఈ గురు-రాహు యోగం ముఖ్యంగా మూడు రాశులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు.
నవపంచమ యోగం కారణంగా వృషభ రాశి వారికి కెరీర్లో కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్‌తో పాటు జీతం పెరిగే అవకాశాలున్నాయి. ఈ సమయంలో వ్యాపారవేత్తలకు కలిసివచ్చే అవకాశం ఉంది. కొత్త ఒప్పందాలు జరిగే ఛాన్స్ఉంటుంది. కొత్త కస్టమర్ల నుంచి లాభం జరిగే అవకాశాలుంటాయి. నిలిచిపోయిన పాత వ్యాపార ఆలోచనలు మళ్లీ విజయవంతం కానున్నాయి. ఈ సమయంలోనే రాకుండా బకాయిలు చేతికందే అవకాశాలున్నాయి. పెట్టుబడులపై మంచి రాబడి ఉంటుంది. ఆస్తి ఒప్పందాలతో లాభం జరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితం మెరుగుపడే వకాశం ఉంది. సంబంధాలు మెరుగుపడుతాయి.
సింహరాశి వారికి ప్రేమ సంబంధాలు మెరుగవుతాయి. పెళ్లయిన జంటలకు సంతాన ప్రాప్తి ఉన్నది. ప్రేమ సంబంధాలు మధురంగా మారుతాయి. ప్రేమ బంధాలు మెరుగవుతాయి. సృజనాత్మక రంగంలో పని చేసేవారికి గుర్తింపు పొందుతారు. పోటీ పరీక్షలకు ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారు విజయాలు సాధించే అవకాశాలున్నాయి. వ్యాపారంలోకి వారికి కొత్త అవకాశాలు దక్కే అవకాశం ఉంది. సమాజంలో హోదా పెరుగనున్నది. నవపంచమ యోగం సింహరాశి వారికి సమాజంలో గౌరవం, పేరు ప్రతిష్టలు వస్తాయి. నవపంచమ యోగంతో కుటుంబంతో మరింత సమయం గడుపుతారు. వైవాహిక జీవితంలో ఆనందం, సంతోషం కలిగిస్తుంది.
వృశ్చిక రాశి వారికి కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. గతంలో జరిగిన కుటుంబ వివాదాలు ఇప్పుడు పరిష్కారమవుతాయి. బంధాలు బలపడుతాయి. తోబుట్టువులు, తల్లిదండ్రులతో ఉన్న ఉద్రిక్తతలు తొలగిపోతాయి. ఉద్యోగం, వ్యాపారంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు ఊహించని లాభాలను పొందే అవకాశం ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో భాగస్వామ్యం సైతం ప్రయోజనకరంగా ఉంటుంది. శత్రువలతో జాగ్రత్తగా ఉండాలి. ఈ యోగంతో కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది. కష్టపడిన ప్రతి పనికి మంచి ఫలితం వస్తుంది. జీవిత భాగస్వామితో సంబంధం బలపడుతుంది. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు.
కుంభరాశికి నవపంచమ యోగం శుభప్రదంగా ఉంటుంది. ఈ యోగంతో కుంభ రాశి వారికి ఆర్థిక లాభాలు, కొత్త పెట్టుబడులు, ప్రేమ బంధం పెళ్లి దిశగా సాగుతుంది. రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా సాంకేతికత, సామాజిక రంగంలో పెండింగ్ఉన్న ప్రాజెక్టులన్నీ, ఒప్పందాలు చాలాకాలంగా నిలిచిపోయిన పని పూర్తవుతుంది. నవపంచమ యోగం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ యోగంతో వ్యాపారం బాగా నడుస్తుంది, ఆర్థికంగా లాభాలు పొందుతారు. సామాజిక సేవ, నెట్వర్కింగ్ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త స్నేహితులు ఏర్పడతారు. ఆర్థిక విషయాల్లో స్థిరత్వం ఉంటుంది. కుటుంబంతో సమయం గడుపుతారు. జీవిత భాగస్వామితో సంబంధంలో మాధుర్యం ఉంటుంది.
మీన రాశివారు ఉద్యోగాలు, పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కార్యాలయంలో సహోద్యోగులు, బాస్నుంచి మద్దతు లభిస్తుంది. రుణాలు, ఆస్తికి సంబంధించి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు చేసే వారు వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉంది. లాభాలను పొందవచ్చు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఖర్చులపై శ్రద్ధ వహించాలి. ఎందుకంటే అనవసరమైన ఖర్చులు వచ్చే అవకాశాలున్నాయి.