Mars Transit | కుజుడు జులై 28న కన్యారాశిలోకి ప్రవేశించాడు. జ్యోతిషశాస్త్రంలో కుజుడు (Mars) అగ్ని తత్వగ్రహమని.. ఆవేశం, తొందరపాటు, దూకుడు స్వభావాలకు కారకుడని అంటారు. ఆయనను అంగారకుడని కూడా పిలుస్తుంటారు. ధైర్యం, శక్తి, పోరాట పటిమను చూసిస్తుంది. ఈ గ్రహం జీవితంలో చురుకుదనం, శౌర్యాన్ని తెస్తుంది. కానీ, బలహీనమైన, అశుభస్థానం ఓ వ్యక్తి ఆరోగ్యం, సంబంధాలు, ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఓ వ్యక్తి జాతకంలో కుజుడి స్థానం చాలా ముఖ్యమైనది. అశుభ స్థితిలో ఉంటే ఒత్తిడి, కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక నష్టాలు వంటి అనేక రకాల సమస్యలు ఎదురయ్యే అవకాశాలుంటాయి.
కుజుడు తన రాశిచక్రం మార్చుకోనున్న నేపథ్యంలో జీవితాల్లో మార్పులు రానున్నాయి. కొన్నిసార్లు సానుకూలంగా, మరికొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. జులై 28న కన్యారాశిలో అంగారకుడి సమాచారం కారణంగా పలురాశుల వారు సవాల్ ఎదురుకోవాల్సి రానున్నది. ఎందుకంటే కన్యారాశి సహజ విధేయత, సామర్థ్యం కుజుడి అగ్ని శక్తితో సమానంగా ఉంటుంది. కొన్నిసార్లు ఉద్రిక్తతలు, సంఘర్షణలకు పరిస్థితులు దారి తీస్తాయి. ఈ పరిస్థితిలో కుజుడు సంచారంతో ఏ రాశులవారిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది.. ఈ ప్రభావాన్ని తగ్గించే పరిహారాలు ఏంటో తెలుసుకోవడం ముఖ్యం, ఆగస్టు ఒకటి నుంచి కేంద్ర రాజయోగం ఏర్పడనున్నది. ఈ రాశులవారికి శుభగడియలుగా పేర్కొంటున్నారు పండితులు.
కన్యరాశిలో కుజుడు సంచారం మిథున రాశి వారికి కష్టకాలం ఎదురయ్యే సూచనలున్నాయి. ఈ సమయంలో ఊహించని ఖర్చులు అకస్మాత్తుగా వచ్చిపడుతాయి. అలాగే, ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా తలెత్తవచ్చు. కుటుంబ జీవితంలో ఉద్రిక్తత పెరిగే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాలి. తొందరిపడి నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. భూమి, భవనం, వాహనానికి సంబంధించిన ఏదైనా వివాదం మిమ్మల్ని చుట్టుముట్టే సూచనలున్నాయి. కుజ గ్రహం అశుభ ప్రభావాలను నివారించేందుకు మంగళవారం రోజున పప్పుధాన్యాలను, రాగిపాత్రలను దానం చేయడం వల్ల శుభపద్రంగా ఉంటుంది.
కుంభ రాశి వారికి సైతం అంగారకుడి ప్రభావం కారణంగా అశుభ ఫలితాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. మానసిక ఒత్తిడి చాలా ఉంటుంది. విద్యార్థులకు చదువులపై ఆసక్తి తక్కువగా ఉంటుంది. ప్రేమ సంబంధాల్లో అపార్థాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది సంబంధాల్లో దూరాన్ని పెంచే అవకాశం ఉంది. ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఇది బడ్జెట్‌ను ప్రభావితం చేస్తుంది. పిల్లల విషయంలో ఆందోళనకు గురవుతారు. ఈ సమయంలో స్టాక్ మార్కెట్, బెట్టింగ్ వంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. కుజ గ్రహం ప్రతికూల ప్రభావాలను తగ్గించుకునేందుకు పరిహారంగా హనుమంతుడికి సింధూరం, జాస్మిన్ ఆయిల్‌ను సమర్పించడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది.
మీన రాశి వారికి కుజ సంచార ఒత్తిడి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నది. ఈ సమయంలో మీ నోటిని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అనుకోకుండా మీరు మాట్లాడే మాటలు మీకు దగ్గరి వ్యక్తులను బాధిస్తాయి. కుటుంబ వాతావరణంలో అసంతృప్తి, అపార్థాలు పెరుగుతాయి. ఆర్థిక ఖర్చులు కూడా పెరుగుతాయి. దాంతో మీ బడ్జెట్‌పై ప్రభావం పడుతుంది. కొన్ని పాత లావాదేవీలకు సంబంధించి వివాదాలు కూడా తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఓపిక, అవగాహనతో పనిచేయడం చాలా ముఖ్యం. కుజ గ్రహ ప్రతికూల ప్రభావాలను నివారించేందుకు హనుమంతుడికి ఎర్ర శెనగలను సమర్పించడం మంచిది.