మేషం : ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధన లాభం. సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. నూతన వస్తు, ఆభరణాలు పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణ బాధలు తొలగిపోతాయి. ధైర్య సాహసాలతో ముందుకెళ్తారు.
వృషభం : మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. ప్రయత్న కార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం.
మిథునం : కోరుకునేది ఒకటైతే జరిగేది మరికొటి అవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా ఉన్నాయి. వేళ ప్రకారం తినడానికి ప్రాధాన్యమిస్తారు. చంచలం వ్లల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లల పట్ల ఏమాత్రు అశ్రద్ధ పనకిరాదు.
కర్కాటకం : కోపాన్ని అదుపులో ఉంచుకోవటం మంచింది. మానసిక ఆందోళనను తొలగించుటకు దైవధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు. వృథా ప్రయాణలెక్కువ. ధనవ్యయం తప్పదు.
సింహం : ఆకస్మిక ధన లాభం. నూతన వస్తు, ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. రుణ విముక్తి లబిస్తుంది. మానసిక ఆనందం పొందుతారు.
కన్య : రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించు పనులు చేపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు.
తుల : ఆరోగ్యం గురించి జాగ్రత్త పడడం మంచింది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడతారు.
వృశ్చికం : వ్యాపరంలో విశేష లాభాన్ని ఆర్జిస్తారు. మంచివారితో స్నేహం చేస్తారు. అంతటా సుఖమే లభిస్తుంది. ఆసక్మిక ధన లాంభం ఉంటుంది. బంధు, మిత్రుల సహాయ, సహకారాలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
ధనుస్సు : పిల్లల వల్ల ఇబబందులు ఎదుర్కొంటారు. అధికారులతో గౌరవం పొందుతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు.
మకరం : అకాల భోజనాదుల వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండడం అంత మంచిది కాదు. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. మనోద్వేగానికి గురి అవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. కొత్త పనులు ప్రారంభించరాదు.
కుంభం : అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. ప్రయాణాల్లో. వ్యయ, ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండడానికి ప్రయతన్నించాలి. దూర ప్యక్తుల పరిచయం ఏర్పడుతుంది.
మీనం : ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. అజీర్ణ బాధలు అధికం అవుతాయి. కీళ్ల నొప్పుల బాధ నుండి రక్షించుకోవడం అవసరం. మనోవిచారాన్ని కలిగి ఉంటారు.
పంచాంగకర్త..
గౌరీభట్ల రామకృష్ణశర్మ సిద్దాంతి
మేడిపల్లి, ఉప్పల్, హైదరాబాద్
9440350868