మేషం
తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. ఆవేశం వల్ల కొన్నిపనులు చెడిపోతాయి.
వృషభం
మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. ప్రయత్నకార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం.
మిథునం
ఆర్థిక ఇబ్బందులుండవు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్యసాహసాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. శుభవార్తలు వింటారు.
కర్కాటకం
కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మానసికాందోళనను తొలగించుటకు దైవధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడుతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు. వృధా ప్రయాణాలు ఎక్కువవుతాయి. ధనవ్యయం తప్పదు.
సింహం
కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్ర్దద్ధ అవసరం. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండటం మంచిది. ఆత్మీయుల సహాయసహకారాలకోసం సమయం వెచ్చించాల్సి వస్తుంది.
కన్య
ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తవహించడం మంచిది. రహస్య శతృబాధలు ఉండే అవకాశం ఉంది.
తుల
కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషి చేస్తారు. స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు.
వృశ్చికం
కుటుంబంలో సుఖ, సంతోషాలుంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధు మిత్రులను కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.
ధనుస్సు
మిక్కిలి ధైర్య, సాహసాలు కలిగియుంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శతృబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక లాభాలు ఉంటాయి.
మకరం
రుణప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. క్షణికావేశం పనికిరాదు. అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనారోగ్య బాధలు అధికమవుతాయి.
కుంభం
అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. ప్రయాణాల్లో వ్యయ, ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది.
మీనం
కుటుంబసౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు, ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నమవుతారు. స్త్రీల మూలకంగా లాభం ఉంది. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. రుణబాధలు తొలగిపోతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది.
పంచాంగకర్త..
గౌరీభట్ల రామకృష్ణశర్మ సిద్ధాంతి
మేడిపల్లి, ఉప్పల్, హైదరాబాద్
9440 350 868