మేషం
ప్రయత్నకార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభమేర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు, ఆభరణాలు పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణబాధలు తొలగిపోతాయి. ధైర్యసాహసాలతో ముందుకెళ్తారు.
వృషభం
ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త అవసరం. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్య సాహసాలతో నూతన కార్యాలు ప్రారంభిస్తారు.
మిథునం
విదేశయాన ప్రయత్నం సులభమువుతుంది. కుటుంబ కలహాలకు తావీయరాదు. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశం ఉంటుంది. పిల్లలతో జాగ్రత్త వహించుట మంచిది. వృత్తి, ఉద్యోగరంగంలోని వారికి ఆటంకాలెదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
కర్కాటకం
ఇంత వరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేణ తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభముంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు.
సింహం
ఆకస్మిక ధనలాభముంటుంది. నూతన వస్తు, ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్నిరంగాల్లో అద్భుత విజయాలను సాధిస్తారు. నూతన కార్యాలు ప్రారంభిస్తారు. రుణ విముక్తి లభిస్తుంది. మానసిక ఆనందం పొందుతారు.
కన్య
రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించు మంచి పనులు చేపడుతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు.
తుల
ఆరోగ్యం గురించి జాగ్రత్తపడుట మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడుతారు.
వృశ్చికం
వ్యాపారంలో విశేషలాభాన్ని ఆర్జిస్తారు. మంచివారితో స్నేహం చేస్తారు. అంతటా సుఖమే లభిస్తుంది. ఆకస్మిక ధనలాభముంటుంది. బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
ధనస్సు
పిల్లలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడుతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. నూతన వ్యక్తులు పరిచయమవుతారు.
మకరం
అకాల భోజనాలతో అనారోగ్యం మేర్పడుతుంది. పిల్లల పట్ల ఎక్కువగా పట్టుదలతో ఉండడం అంత మంచిదికాదు. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. మనోద్వేగానికి గురవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. కొత్త పనులు ప్రారంభించరాదు.
కుంభం
బంధు, మిత్ర విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. మానసిక ఆందోళన అధికమవుతుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు.
మీనం
గౌరవ మర్యాదలకు లోపం ఉండదు. అనవసర వ్యయ ప్రయాసలుంటాయి. వృథా ప్రయాణాలెక్కువ చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడుపాల్సి వస్తుంది. బంధుమిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్త వహించాలి. శారీరంగా బలహీనులవుతారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు.