మేషం : వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. పొట్లాటలకు దూరంగా ఉండడం మంచిది. అనారోగ్య బాధలను అధిగమించుటకు ఔషధ సేవ తప్పదు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు పనికిరాదు.
వృషభం : మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. ప్రయత్నకార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి. చెడుపనులకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం.
మిథునం : విందులు, వినోదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. మానసికాందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలెదురుగును. ఆరోగ్యం గూరించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
కర్కాటకం : కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనం వహించుట అన్నివిధాలా మేలు, బంధుమిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్త పడుట మంచిది. అనవసర ధనవ్యయంతో రుణప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అనారోగ్య బాధలకు ఔషధసేవ అవసరం.
సింహం : రుణప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్యబాధలుండును. బంధు, మిత్రులతో వైరమేర్పకుండా జాగ్రత్తపడుట మంచిది. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి.
కన్య : ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య శత్రుబాధలుండే అవకాశం ఉంది.
తుల : కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొనుటకు కృషి చేస్తారు. స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు.
వృశ్చికం : బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశం ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అధికారులతో జాగ్రత్తగా మెలగుట మంచిది. అనవసర భయం ఆవహిస్తుంది.
ధనస్సు : మిక్కిలి ధైర్య, సాహసాలు కలిగియుంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శత్రుబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఆకస్మిక లాభాలుంటాయి.
మకరం : విదేశయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశం ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనవసర వ్యయ ప్రయాసలుంటాయి. ప్రయాణాలెక్కువ చేస్తారు.
కుంభం : అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. ప్రయాణాల్లో వ్యయ, ప్రయాసలు తప్పవు, కలహాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది.
మీనం : కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా ఉన్నాయి. వేళ ప్రకారం భుజించుటకు ప్రాధాన్యమిస్తారు. చంచలంవల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లలపట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు.