Sravana Purnima | ఆగస్టు 9 శ్రావణ పౌర్ణమి రోజున అరుదై యోగం ఏర్పడబోతున్నది. దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఈ యోగం ఏర్పడనుండడం ప్రాముఖ్యతను సంతరించుకున్నది. ఈ యోగం పలు రాశులపై ప్రత్యేక ప్రభావం కనిపించనున్నది. దాంతో డబ్బు, వృత్తితోపాటు కుటుంబ సంబంధాలు సహా జీవితంలో అనేక రంగాల్లో విజయాలు వరించనున్నాయి. భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలనుకునే వారికి ఈ సమయంలో చాలా శుభప్రదంగా ఉంటుందని పండితులు పేర్కొంటున్నారు. జీవితంలో కొత్త అవకాశాలు వారిని వరిస్తాయని పేర్కొంటున్నారు.
శ్రావణ పౌర్ణమి రోజున శక్తివంతమైన జ్యోతిష యోగం ఏర్పడుతుంది. ఈ రోజు మూడు ప్రధాన గ్రహాలైన చంద్రుడు, గురువు, శని వారి సొంత రాశుల్లో సంచరిస్తారు. ఆయా గ్రహాలు తమ సొంత రాశుల్లో ఉండడం వల్ల వాటి ప్రభావం గరిష్టంగా ఉంటుంది. దాంతో శుభఫలితాలుంటాయని పండితులు పేర్కొంటున్నారు. దాంతో జ్యోతిషశాస్త్రం పరంగా శ్రావణ పౌర్ణమి మరింత ప్రాముఖ్యతను సంతరించుకున్నది. మూడు గ్రహాలు ఉత్తమ స్థితిలో ఉండడం వల్ల సానుకూల ప్రభావం ఉండనుండగా.. మరిన్ని శుభయోగాలు ఏర్పడనున్నాయి. రక్షాబంధన్, శ్రావణ నక్షత్రం రోజున గురు పుష్య యోగం ఏర్పడనున్నది. ఈ యోగం కారణంగా మూడురాశుల వారికి అదృష్టం కలిసిరానున్నది.
శ్రావణ పౌర్ణమితో వృషభరాశి వారికి మంచి ఫలితాలు ఉండనున్నాయి. మూడు గ్రహాలు ఉచ్ఛత స్థితిలో ఉండడం వల్ల కెరీర్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులు కష్టపడి పని చేయడంవల్ల పదోన్నతి లేదంటే వేతనం పెరిగే అవకాశలున్నాయి. వ్యాపారాల్లో ఎన్నోరోజులుగా చిక్కుకుపోయిన డబ్బు చేతికి అందే అవకాశాలున్నాయి. దాంతో ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి, సామరస్యం నెలకొంటుంది. ఫలితంగా మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.
సింహరాశి జాతకులకు శని, కుజుడు కలయిక కారణంగా ఉద్యోగ, వ్యాపారరంగంలోని వారికి శుభ ఫలితాలుంటాయి. వ్యాపారరంగంలోని వారికి కొత్త అవకాశాలు లభించడంతో పాటు లాభాలను పొందుతారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారి ఆశలు నెరవేరుతాయి. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలున్నాయి. దాంతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఈ సమయంలో మీలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు.
ధనస్సు రాశి వారికి శ్రావణ పౌర్ణమి చాలా శుభప్రదంగా ఉంటుంది. బృహస్పతి సంచారంతో ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. గురువు ఆశీస్సులతో పని చేసేచోట మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పెట్టుబడులు పెట్టే వారికి ఆర్థికంగా లాభాలుంటాయి. సంపదను కూడబెడుతారు. కుటుంబ జీవితంలో ఆనందోత్సాహలు వెల్లివిరుస్తాయి. దాంతో మనో ధైర్యం పెరుగుతుంది. ఈ సమయంలో ప్రణాళికలను కార్యరూపంలోకి తీసుకువస్తే విజయం వరించే అవకాశాలున్నాయని పండితులు పేర్కొంటున్నారు.