Gajalakshmi Raja Yogam | శ్రావణ మాసం శివారాధనకు అత్యంత పవిత్రమైన సమయం. ఈ నెలలంతా శివ భక్తులు ఉపవాసం, పూజలు, రుద్రాభిషేకంలో పాల్గొంటు శివుడి ఆశీస్సులు చేస్తుంటారు. శ్రావణ మాసం జులై 25న మొదలై ఆగస్టు 23 వరకు కొనసాగనున్నది. ఈ సమయంలో అనేక శుభ యోగాలు ఏర్పడనున్నాయి. పలు రాశుల అదృష్టానికి ద్వారాలు తెరువనున్నాయి. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. సంపద, వైభవం, అందానికి చిహ్నమైన మిథునరాశిలో గురువు, శుక్రుడి సయోగం కారణంగా గజలక్ష్మీ రాజయోగం ఏర్పడనున్నది. దాంతో పాటు సూర్యుడు, గురువులు సైతం స్థానం మార్చుకోబోతున్నారు. దాంతో ద్విద్వాదశ యోగం సైతం ఏర్పడబోతున్నది. దాంతో అదృష్టం వరించడంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగనున్నది. అంతే కాదు సూర్యుడు కర్కాటకంలో ఉండి బుధుడితో కలిసిన సమయంలో బుధాదిత్య యోగం ఏర్పడనున్నది. తెలివితేటలు, నాయకత్వం సామర్థ్యం పెరుగుతుంది. ఈ శుభ యోగాల కారణంగా పలురాశులవారికి అదృష్టం వరించనున్నది. ఆ అదృష్ట రాశులవారెవరో తెలుసుకుందాం రండి..!
శ్రావణ మాసంలో ఏర్పడనున్న ద్విద్వాదశ యోగంతో వృశ్చిక రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ యోగంతో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తికానున్నాయి. ఇప్పటి వరకు పదే పదే నిలిచిన పనులన్నీ ఒక్కొక్కటిగా పూర్తిచేస్తారు. అలాగే, కొత్త ఆదాయానికి మార్గాలు తెరుచుకుంటాయి. ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. శివుడి ఆశీస్సులతో ఈ సమయంలో మీ కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. కుటుంబ జీవితంలో ఆనందం వెల్లివిరియడంతో పాటు శాంతి నెలకొంటుంది. ఇంట్లో జరుగుతున్న పరస్పర విభేదాలు, సమస్యలు తొలగిపోతాయి. తోబుట్టువులతో సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది. పరస్పర సహకారం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఆయా రంగాల్లో గౌరవం ఉంటుంది. కెరియర్లో పురోగతి ఉంటుంది. మరోవైపు, ఈ సమయంలో చేసిన ప్రణాళికలు విజయవంతమవుతాయి. లాభదాయకంగా ఉంటాయి. వ్యాపారులు తమ వ్యూహాలకు పదునుపెడుతారు.
శ్రావణమాసంలో కన్యారాశి వారికి చాలా శుభాలు కలుగనున్నాయి. గురు, సూర్యుల ద్విద్వాదశ యోగం ఏర్పడడంతో మంచి ఫలితాలుంటాయి. ఈ సమయంలో మీరు ప్రతి రంగంలోనూ విజయం సాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా చాలా కాలంగా అసంపూర్ణంగా ఉన్న పనులు ఇప్పుడు పూర్తవుతాయి. కుటుంబ సంబంధాలు కూడా బలపడతాయి. విదేశాలకు వెళ్లాలని ఎవరైనా ప్రణాళిక వేస్తుంటే వారికి ఆ దిశగా శుభవార్త వినే అవకాశాలున్నాయి. విదేశీ పర్యటనకు సైతం అవకాశం ఉంటుంది. ఈ సమయం ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే కష్టపడి పని చేసేతత్వంతో ప్రశంసలు పొందుతారు. నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి. దాంతో మీరు కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంటుంది. ఉన్నత స్థానానికి చేరుకుంటారు. జీతం పెరుగుతుంది. పదోన్నతికి అవకాశం ఉంది. ఈ సమయంలో మీకు మీ తండ్రి, గురువులాంటి వ్యక్తి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఇది మీరు మీ లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడుతుంది.
శ్రావణ మాసం తులరాశి వారికి శివుడి ప్రత్యేక ఆశీర్వాదాలు తీసుకురానున్నాయి. ఈ సమయంలో మీ జీవితంలో కొత్త ఆనందంగా ఉంటారు. చాలాకాలంగా ఏ పని చేస్తున్న వారు విజయం సాధిస్తారు. చట్టపరమైన విషయాల్లో చిక్కుకున్న వ్యక్తులు ఉపశమనంతో ఊపిరి పీల్చుకోవచ్చు. ఎందుకంటే కోర్టు సంబంధిత విషయాల్లో నిర్ణయం మీకు అనుకూలంగా రావొచ్చు. హోదా, ప్రతిష్ట పెరిగే సంకేతాలు ఉన్నాయి. ఇది సమాజం, కార్యాలయంలో గుర్తింపు, గౌరవాన్ని పెంచుతుంది. కుటుంబ సంబంధాల గురించి మాట్లాడుకుంటే.. తండ్రికి దూరంగా ఉంటే.. మళ్లీ కలుసుకునే అవకాశం ఉంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావొచ్చు. వైవాహిక జీవితంలో ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. జీవిత భాగస్వాముల మధ్య బంధాలు నెరవేరుతాయి. కలిసి సమయం గడపడానికి అవకాశాలు ఉంటాయి. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారి ప్రయత్నాలు నెరవేరుతాయి. ఈ సమయంలో సానుకూల శక్తితో నిండి ఉంటుంది.