e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, January 23, 2022
Home బతుకమ్మ రాశి ఫలాలు: 28.11.2021 నుంచి 4.12.2021 వరకు

రాశి ఫలాలు: 28.11.2021 నుంచి 4.12.2021 వరకు

మేషం
తలపెట్టిన కార్యాలు సకాలంలో పూర్తి చేస్తారు. మీ వృత్తి సంతృప్తికరంగా కొనసాగుతుంది. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. క్రమేపీ పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. నలుగురిలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. కళాకారులకు అనుకూలం. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆస్తుల మూలంగా ఆదాయం వస్తుంది.

వృషభం
ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగులకు ఆఫీసులో అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారులతో స్నేహం పెరుగుతుంది. పదోన్నతి ద్వారా బదిలీ అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వాయిదా పడిన పనులు పూర్తవుతాయి. కోర్టు కేసులలో అనుకూల తీర్పు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూల సమయం.

- Advertisement -

మిథునం
విద్యార్థులు చదువులో రాణిస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. తలచిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు ఆఫీసులో గౌరవం పెరుగుతుంది. నలుగురి సహకారం లభిస్తుంది. పనులు అనుకున్న సమయంలో పూర్తిచేస్తారు. వ్యాపారం లాభసాటిగా, అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు, కొత్త ఒప్పందాలు సంతృప్తికరంగా ఉంటాయి. అయితే జాగ్రత్త అవసరం. రాజకీయ పనులు అనుకూలిస్తాయి. కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త వ్యక్తుల ద్వారా పనులు నెరవేరుతాయి. వాహనం మూలంగా కార్యసాఫల్యం ఉంది. ఈ వారం పట్టుదలతో పనులు చేస్తారు.

కర్కాటకం
ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. వాహనాల మరమ్మతుల కారణంగా ఖర్చులు పెరగవచ్చు. కోర్టు కేసులలో కాలయాపన, వృథా ఖర్చులు ఉండవచ్చు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన ఏర్పడుతుంది. విద్యార్థులు రాణిస్తారు. ఉద్యోగులు అనవసరమైన వివాదాల జోలికి వెళ్లకుండా తమపని తాము చేసుకోవడం మంచిది. అధికారులతో స్నేహంగా ఉంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తి తగాదాలు సంయమనంతో పరిష్కరించుకోవడం అవసరం. డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది.

సింహం
కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. మంచివారితో స్నేహ సంబంధాలు పెరుగుతాయి. వాహనం కొనుగోలు చేస్తారు. భూముల వ్యవహారం కలిసివస్తుంది. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. భార్యా పిల్లలతో హాయిగా ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. ఉత్సాహంతో పనులు పూర్తిచేస్తారు. కార్మికులు, కర్షకులకు కలిసి వస్తుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది.

కన్య
వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. విద్యార్థులు రాణిస్తారు. స్నేహితులు, ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. వృథా ఖర్చుల కారణంగా అనుకున్న పనులు వాయిదా పడవచ్చు. వివాదాల జోలికి వెళ్లకుండా పనులపై మనసు నిలపండి. ప్రయాణాలు లాభదాయకంగా, ఉల్లాసంగా ఉంటాయి. తీర్థయాత్రల వల్ల సంతృప్తి కలుగుతుంది. సహోద్యోగులతో అనుబంధం పెరుగుతుంది. అధికారులతో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారంతో ఉత్పాదన సంతృప్తికరంగా ఉంటుంది. ఇంటా, బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. అనుభవజ్ఞుల సహకారం లభిస్తుంది.

తుల
కుటుంబంతో హాయిగా గడుపుతారు. కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపార ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం లభిస్తుంది. కొత్త పనులు చేపడతారు. విద్యార్థులకు అనుకూల వారం. కోర్టు కేసులలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు ఉత్పాదన సంతృప్తికరంగా ఉంటుంది. ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. అనవసరమైన ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. కోర్టు పనులు అనుకూలిస్తాయి.

వృశ్చికం
కుటుంబంతో చర్చించి, నిర్ణయాలు తీసుకుంటారు. విందులు, వినోదాలకు హాజరవుతారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. అయితే, కొన్ని పనుల్లో ఊహించని ఆటంకాలు ఎదురవ్వొచ్చు. ఆత్మీయులతో వివాదాలకు వెళ్లకుండా పనులు పూర్తి చేసుకోవడం మంచిది. భూముల విషయంలో జాగ్రత్త అవసరం. వాహన మరమ్మతు వల్ల ఖర్చులు పెరగవచ్చు. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. కళాకారులకు ఆదాయం సంతృప్తిగా ఉంటుంది. ఉద్యోగులకు ఒత్తిడి పెరగవచ్చు.

ధనుస్సు
వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. వాహనం కొనుగోలు చేస్తారు. పనులు నెరవేరుతాయి. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఉత్పాదన సంతృప్తిగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు కలిసి వస్తుంది. ఉత్సాహంతో ఉంటారు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. చేతిలో ఉన్న పనులలో ఆలస్యం జరగవచ్చు. వృథా ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులకు అనుకూల సమయం. పై చదువులకు అందరి సహకారం లభిస్తుంది. ఉద్యోగులపై అధికారుల ఒత్తిడి పెరగవచ్చు. సమయానుకూల నిర్ణయాలతో కొంత కలిసి వస్తుంది. ఖర్చుల నియంత్రణ, పనులలో పట్టుదల అవసరం.

మకరం
నిర్మాణాలు చేపడతారు. ఆఫీసులో అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారుల ఆదరణ పెరుగుతుంది. తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. పనులలో బరువు, బాధ్యతలు పెరిగినా ఉత్సాహంతో చేస్తారు. పదోన్నతి, స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. కోర్టు కేసులలో సానుకూలత ఉంటుంది. ప్రభుత్వ పనులు సకాలంలో పూర్తవుతాయి. రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. కళాకారులకు ఆదాయం సంతృప్తిగా ఉంటుంది. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. శ్రమకు తగిన ఫలితం పొందుతారు.

కుంభం
ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఇంటి వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. సంగీత, సాహిత్య, సినిమా కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. అయితే, అనవసరమైన ఖర్చులు ముందుకు రావచ్చు. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధువులు, మిత్రులతో సంబంధాలు పెరుగుతాయి. చేపట్టిన వ్యాపారం లాభసాటిగా ముందుకు సాగుతుంది. తలపెట్టిన పనులలో శ్రమ ఎక్కువైనా కొంత వరకు విజయం సాధిస్తారు. స్థిర, చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేయవచ్చు.

మీనం
శుభకార్యాల నిర్వహణతో ఖర్చులు పెరగవచ్చు. పాత మిత్రులను కలుసుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వాహనం, భూముల విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నలుగురికి సాయపడతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్వయంవృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సంయమనంతో పనులు చేస్తారు. నిత్యం చేసే వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్‌., సెల్‌: 9885096295
ఈ మెయిల్‌ : nirmalsiddhanthi@yahoo.co.in

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement