16.5.2021 నుంచి 22.5.2021 వరకు
మేషం
వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. స్నేహితులు, బంధుమిత్రులతో పనులు అనుకూలిస్తాయి. వాహనం వల్ల పనులు జరుగుతాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు. అనుకోని ఖర్చులు ముందుకు రావచ్చు. ఆదాయం బాగానే ఉంటుంది. క్రమేపీ పెరుగుతుంది. అందరితో స్నేహంగా ఉంటూ పనులు నెరవేర్చుకుంటారు. కొత్త వస్తువులు కొనే అవకాశం ఉంది. దగ్గరి ప్రయాణాలు కలిసివస్తాయి. దీర్ఘ ప్రయాణాలు వాయిదా పడతాయి. గృహనిర్మాణ రంగం, భూముల వ్యవహారం కలిసివస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు.
వృషభం
ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలపై శ్రద్ధ నిలుపుతారు. ఆరోగ్యం నయమవుతుంది. స్నేహితులు, బంధువర్గంతో సంబంధాలు వృద్ధి పొందుతాయి. నిత్య వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలను జాగ్రత్తగా చేసుకోవాలి. ప్రారంభించిన పనులు సంతృప్తిగా పూర్తవుతాయి. రావలసిన సొమ్ము కొంత ఆలస్యంగా చేతికి అందవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు నలుగురి సహాయంతో కొనసాగుతాయి. ఉద్యోగస్తులు ఆఫీసులో అధికారులతో స్నేహంగా ఉంటూ మంచిపేరు పొందుతారు. అనవసర విషయాలలో తలదూర్చకుండా పనులు చేసుకోవడం, ఆహార నియమాలను పాటిస్తూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం అవసరం. చదువు కలిసివస్తుంది. పై చదువులకు వెళ్లే అవకాశం వుంది.
మిథునం
ఉద్యోగస్తులకు ఆఫీసులో అధికారుల సహాయం, ప్రోత్సాహం లభిస్తాయి. తలపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక సమస్యలవల్ల కొన్ని పనులలో ఆలస్యం ఉండవచ్చు. పిల్లల శుభకార్యాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసర ఖర్చులు ఉండవచ్చు. వ్యయాల నియంత్రణపై మనసు నిలిపి ఆదాయం పెంపొందించుకోవడానికి ప్రయత్నించండి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలలో సిబ్బంది సహాయం లభిస్తుంది. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉన్నా ఖర్చులు పెరుగవచ్చు. ఆదాయంలో హెచ్చుతగ్గుల వల్ల స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేక పోవడంతో పనులలో ఆలస్యం కావచ్చు. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
కర్కాటకం
ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటి ఉద్యోగులతో అనుకూలంగా ఉంటుంది. సంతృప్తిగా పనులు చేస్తారు. వృత్తి, వ్యాపారంలో తాత్కాలిక లాభాలు ఉంటాయి. ప్రయాణాలు కలిసివస్తాయి. ప్రారంభించిన పనులలో ఆలస్యం జరుగవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడుల నిర్ణయాన్ని కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మంచిది. తక్షణ ప్రయోజనాలను ఆశించి పనులు చేయడం మంచిది. ఆర్థిక సమస్యలవల్ల సర్దుబాట్లు అవసరం పడవచ్చు. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. పై అధికారులతో స్నేహంగా ఉంటూ పనులు నెరవేర్చుకుంటారు. ఉద్యోగస్తులకు అనుకూలమైన వారం.
సింహం
స్నేహితులు, ఆత్మీయులవల్ల సంతృప్తి, మంచి సహకారం లభిస్తాయి. ఆస్తుల విషయంలో పాత తగాదాలు పరిష్కారమవుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తారు. వ్యాపార లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. వ్యవసాయదారులకు, పారిశ్రామిక వేత్తలకు సిబ్బందితో అనుకూలంగా ఉంటుంది. చదువులో రాణిస్తారు. ఉన్నత విద్యా ప్రయత్నాలు కొనసాగుతాయి. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. రాజకీయ, కోర్టు, ప్రభుత్వ పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. కావలసిన వస్త్ర, వస్తువులను కొంటారు.
కన్య
ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలలో తాత్కాలిక సంతృప్తి ఉంటుంది. ఖర్చులు పెరుగవచ్చు. పిల్లల చదువు విషయంలో అనుకూలంగా ఉంటుంది. ఏకాగ్రతతో పనులు చేస్తారు. నలుగురి విశ్వాసాన్ని పొందుతారు. శుభకార్య ప్రయత్నాలలో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆలోచించి సమయానుకూలంగా పనులు చేస్తారు. వ్యాపారస్తులు ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించాలి. వ్యాపారం కొంత అనుకూలంగా ఉన్నా పెద్ద పెట్టుబడులను వాయిదా వేసుకోవడం మంచిది. ఇంట్లో భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది.
తుల
చదువులో రాణిస్తారు. పై చదువుల ప్రయత్నాలు ఫలిస్తాయి. రావలసిన సొమ్ము చేతికి అందడంలో ఆలస్యం జరుగవచ్చు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సంతృప్తిగా ఉంటారు. వివాహాది శుభకార్య, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని సమస్యలను అధిగమిస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. పెద్దలను గౌరవించడం వల్ల పనులు కలిసివస్తాయి. మనసు నిలిపి పట్టుదలతో పనులు చేస్తారు. పారిశ్రామికవేత్తలకు, వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది. ఇంటా బయటా వాతావరణం ప్రోత్సాహకరంగా వుంటుంది. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటూ, ఇంటికి కావలసిన వస్త్ర, వస్తువులను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. వ్యాపారంలో శ్రమ అధికమైనా ఫలితం అనుకూలంగా ఉంటుంది.
వృశ్చికం
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆత్మీయులు, బంధువర్గంతో సంతృప్తిగా ఉంటారు. ప్రారంభించిన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు చక్కగా కొనసాగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు కొనసాగుతాయి. నలుగురి సహకారం లభిస్తుంది. పిల్లల చదువు, ఉద్యోగ ప్రయత్నాలలో కొంత ఆలస్యమైనా ఫలితాలు అనుకూలిస్తాయి. నిర్లక్ష్యం చేయకుండా పనులను పట్టుదలతో పూర్తి చేయడం అవసరం. కోర్టు, ప్రభుత్వ, రాజకీయ వ్యవహారాల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. రోజువారీ వ్యాపారం కలిసివస్తుంది. వృత్తి, వ్యాపారంలో సిబ్బంది అనుకూలత వల్ల ఫలితాలు సంతృప్తిగా ఉండవచ్చు.
ధనుస్సు
ప్రయాణాలవల్ల సంతృప్తి ఉంటుంది. పనులు నెరవేరుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. పాత సమస్యలను అధిగమిస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటి ఉద్యోగుల ప్రోత్సాహం ఉంటుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. మంచిపేరు సంపాదిస్తారు. ఆదాయం కూడా సంతృప్తికరంగా ఉంటుంది. భార్యాపిల్లలతో కొన్ని విషయాలలో చర్చలు జరుగవచ్చు. అనవసర కాలయాపన లేకుండా పనులు నిర్వర్తించడంపై మనసు నిలుపడం మంచిది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. రాజకీయ, కోర్టు, ప్రభుత్వ పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి.
మకరం
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఊహించని ఖర్చులు ముందుకు రావడంతో ముఖ్యమైన పనులలో జాప్యం ఉండవచ్చు. పిల్లల చదువు, వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. కొత్త పరిచయాలవల్ల పనులు నెరవేరుతాయి. వృథా ఖర్చులు కూడా ఒక పక్కన గోచరిస్తున్నాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. ఆర్థిక సమస్యలవల్ల కొత్త పనుల ప్రారంభంలో ఆలస్యం ఉండవచ్చు. సమస్యలను అధిగమిస్తారు. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలోని వారికి కొంతమేర ప్రోత్సాహకరంగా ఉంటుంది.
కుంభం
ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల చదువు, ఉద్యోగాల విషయంలో అనుకూలత ఉంటుంది. తాత్కాలిక ఉద్యోగం లభిస్తుంది. ఆఫీసులో తోటి ఉద్యోగులు, అధికారుల ప్రోత్సాహం, నలుగురిలో గౌరవ మర్యాదలను పొందుతారు. మంచి పనులవల్ల ఖర్చులు ఉండవచ్చు. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. సర్దుబాట్లు అవసరం పడవచ్చు. వృధా ఖర్చులను నియంత్రించడం అవసరం. ఉత్సాహంతో పనులు చేస్తారు. అనుకూల ఫలితాలను పొందుతారు. ఇంట్లో భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. కోర్టు పనులలో అనుకూల ఫలితాలు ఉన్నా రాజకీయ, ప్రభుత్వ పనులలో ఖర్చులు గోచరిస్తున్నాయి.
మీనం
స్థిరాస్తులవల్ల ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో సంతృప్తి ఉంటుంది. నలుగురికి సహాయ సహకారాలు అందిస్తారు. అనేక కారణాల వల్ల ఖర్చులు గోచరిస్తున్నాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొనసాగుతాయి. భాగస్వాముల మధ్య సదవగాహన ఉండటంతో వ్యాపారం అభివృద్ధి మార్గంలో వెళుతుంది. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. ఇంట్లో భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. ఇంటా, బయటా వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త పరిచయాలతో ఖర్చులు ఉండవచ్చు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సాహిత్యవేత్తలకు, కళాకారులకు అనుకూలమైన వారం.
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., ఫోన్: 040-27651530
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in