రోజువారీ వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. పనితనానికి గుర్తింపు లభిస్తుంది. శుభకార్యాలతో ఖర్చులు పెరగవచ్చు. కొత్త ఉద్యోగంలో చేరతారు. కొత్త వ్యాపార ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. అలంకార వస్తువులు కొనుగోలు చేస్తారు. కోర్టు తీర్పులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబసభ్యులతో విందులకు హాజరవుతారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. భూ వ్యవహారాలు కలిసివస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. దత్తాత్రేయస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
వ్యాపారులకు అనుకూల సమయం. కొత్త వ్యాపారంపై మనసు నిలుపుతారు. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. పై చదువులకు అడ్డంకులు తొలగుతాయి. చాలాకాలంగా ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కొత్తగా పరిచయం అయినవారితో అప్రమత్తంగా ఉండాలి. దుస్తులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంట్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. భూ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. శుభకార్యాలకు కాలం అనుకూలం. శివాలయాన్ని సందర్శించండి.
అనుకున్న పనులు నెరవేరుతాయి. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఉల్లాసంగా ఉంటారు. అదృష్టం కలిసివస్తుంది. వాహనం కొనుగోలు చేస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబపెద్దల సహకారం లభిస్తుంది. విందులకు హాజరవుతారు. ప్రశాంతంగా ఉంటారు. పలుకుబడి పెరుగుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. సూర్యారాధన శుభప్రదం.
అదృష్టం కలిసివస్తుంది. నిలిచిపోయిన పనులు ముందుకు కొనసాగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త మార్గాలు అన్వేషిస్తారు. సహోద్యోగులతో సఖ్యత నెలకొంటుంది. కుటుంబసభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. సంతోషంగా ఉంటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభకార్యాల్లో బంధువుల సహకారం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఇష్టదైవాన్ని స్మరించండి.
ఉల్లాసంగా ఉంటారు. శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించకుండా, చేతిలో ఉన్న వాటిపై దృష్టి సారించండి. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారంలో భాగస్వాములతో మనస్పర్థలు రావచ్చు. పదోన్నతి, స్థానచలన సూచన. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.
వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. వృత్తిపరంగా సంతృప్తిగా ఉంటారు. ఊహించని ఖర్చుల మూలంగా పనుల్లో జాప్యం జరగవచ్చు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. సహోద్యోగుల సహకారం, అధికారుల ఆదరణ లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. తీర్థయాత్రలు, విహారయాత్రలపై మనసు నిలుపుతారు. భూ వివాదాలు ఏర్పడవచ్చు. కాలయాపన చేయకుండా పనులపై మనసు నిలపడం మంచిది. ముఖ్యమైన పనుల్లో పెద్దల సహకారం లభిస్తుంది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. హనుమత్ ఆరాధన మేలు చేస్తుంది.
బంధుమిత్రులతో కొన్ని పనులు నెరవేరుతాయి. ఆర్థికంగా హెచ్చుతగ్గులు ఉంటాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఓపికతో పనులు పూర్తిచేయడం మంచిది. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యంపై మనసు నిలపాలి. రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. విద్యార్థులు చదువుపై మనసు నిలపాలి. దత్తాత్రేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
సమాజంలో గౌరవం పెరుగుతుంది. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. సత్ఫలితాలు పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. భూ వ్యవహారాలు లాభదాయకంగా సాగుతాయి. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. రాబడిని దృష్టిలో పెట్టుకొని ఖర్చులు చేయడం అవసరం. కొత్త పరిచయాలతో కార్యసిద్ధి ఉంది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. నలుగురికి సాయపడతారు. శివారాధన శుభప్రదం.
కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో సంతోషంగా ఉంటారు. రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. రాజకీయ, ప్రభుత్వ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆస్తుల మూలంగా రాబడి పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. దైవ దర్శనానికి ప్రాధాన్యం ఇస్తారు. భూ లావాదేవీలు లాభదాయకంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించండి.
ఉత్సాహంతో పనులు చేస్తారు. కొత్త వస్తువులు, దుస్తులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దాయాదులతో మాటపట్టింపులు ఏర్పడవచ్చు. సంయమనంతో వ్యవహరించండి. ప్రయాణాలు వాయిదా పడతాయి. పనిభారంతో కొంత అలసటకు గురవుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. అధికారుల ఆదరణ పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో కష్టానికి తగిన ఫలితాలు సాధిస్తారు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభప్రదం.
ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. భూ వివాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. అనవసరమైన కాలయాపన, ఖర్చులు ఉండవచ్చు. ఇంటి వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. అధికారులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. దృఢ సంకల్పంతో ముందడుగు వేయాలి. నలుగురిలో గుర్తింపు పొందుతారు. ఆదాయ మార్గాలపై మనసు నిలుపుతారు. కొత్త పరిచయాలతో జాగ్రత్త! రామాలయాన్ని సందర్శించండి.
శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడులకు ప్రతిఫలాలు అందుతాయి. రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. ఆత్మీయులు అనుభవజ్ఞుల సహకారంతో పనులు పూర్తవుతాయి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. కుటుంబసభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
– గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల్ పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్. సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in