మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1పాదం)..రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థాన చలన సూచనలుంటాయి. శుభకార్యాల మూలకంగా ధన వ్యయం అధికమవుతుంది. ప్రయాణాలెక్కువ చేస్తారు. అనారోగ్యమేర్పకుండా జాగ్రత్త అవసరం.
వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2పా) శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. దూర బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలుంటాయి. విదేవీయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగముంటుంది. అన్ని విషయాల్లోనూ విజయం తథ్యం
మిథునం (మృగశిర 3,4పా, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పా) కొత్త కార్యాలు ప్రారంభం. మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రతి విషయంలో వ్యయ, ప్రయాసలు తప్పవు. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశాలు. వృత్తిరీత్యా కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. బంధు, మిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్తపడటం మంచిది.
కర్కాటకం (పునర్వసు 4పాద, పుష్యమి, ఆశ్లేష) మానసిక ఆనందం లభిస్తుంది. గతంలో వాయిదాపడిన పనులు పూర్తవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధి సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయి. జటిల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా) విదేశీయాన ప్రయత్నాలు సఫలిస్తాయి. ప్రయాణాలెక్కువ చేస్తారు. మెలకువగా ఉండటం మంచిది. స్థానచలనం ఏర్పడే ఛాన్స్. రుణలాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా వుండాలి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు.
కన్య (ఉత్తర 2,3,4పా. హస్త, చిత్త, 1,2పా) మిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం. శత్రుబాధలు పోతాయి. దీర్ఘకాలిక సమస్యలు పోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
తుల (చిత్త3,4పా. స్వాతి, విశాఖ, 1,2,3పా) బంధు, మిత్రాదులతో జాగ్ర్తత్త అవసరం. చేసే పనుల్లో ఇబ్బందులు. కొత్త పనులు ప్రారంభానికి సమయం కాదు. గృహంలో జరిగే మార్పులు ఆందోళనకరంగా వుంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
వృశ్చికం (విశాక4పా, అనురాధ, జ్యేష్ఠ) ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం. విందులు, వినోదాలు. పిల్లలకు సంతోషాన్ని కలిగిస్తారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. బంధు, మిత్రులను కలుస్తారు. కొత్త కార్యాలకు రూపకల్పన.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ) ప్రయత్న కార్యాలు సఫలం. ఆకస్మిక ధనలాభం. నూతన వస్తువులు, ఆభరణాలు కొంటారు. ముఖ్య వ్యక్తులతో కలుస్తారు. అన్నిరంగాల్లో విజయం. నూతన కార్యాలు ప్రారంభిస్తారు. రుణ విముక్తి. మానసిక ఆనందం
మకరం (ఉత్తరాషాఢ2,3,4పా, శ్రవణం, ధనిష్ఠ1,2పా) బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. ఆర్థిక ఇబ్బందులు. స్వల్ప అనారోగ్యం. వృత్తి, ఉద్యోగాల్లో అభివృద్ది. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్న లోపం లేకుండా పనులు పూర్తి చేసుకుంటారు.
కుంభం (ధనిష్ఠ 3,4పా.శతభిషం, పూర్వాభాద్ర, 1,2,3పా) స్థిరాస్తుల విషయంలో జాగ్రత్త మంచిది. అద్భుత అవకాశాన్ని చేజార్చుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం. ప్రయాణ లాభం. కార్యాలకు ఆటంకాలు. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు
మీనం (పుర్వాభాద్ర 4పా. ఉత్తరాభాద్ర, రేవతి) బంధు మిత్రుల సహకారాలు. మానసిక ఆందోళనలు. ఆకస్మిక ధన నష్టం. స్థిర నిర్ణయాలు తీసుకోలేరు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహారాలు చేయండి. అనవసర భయం ఏర్పడుతుంది.
పంచాంగకర్త..
గౌరీభట్ల రామకృష్ణశర్మ సిద్ధాంతి
మేడిపల్లి, ఉప్పల్, హైదరాబాద్
9440 350 868