గురువు: మే 14వ తేదీ వరకు వృషభరాశిలో ఉంటున్నాడు. మే 14 నుంచి అక్టోబర్ 19 వరకు మిథున రాశిలో, తర్వాత డిసెంబర్ 5వ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తర్వాత 2025 పూర్తయ్యే వరకు మళ్లీ మిథునంలో ఉంటాడు.
శని: ఈ ఏడాది మార్చి 29 వరకు శని కుంభంలో ఉంటున్నాడు. తర్వాత సంవత్సరాంతం వరకు మీనంలో సంచరిస్తాడు.
రాహువు: ఈ ఏడాది మే 18 వరకు రాహువు మీనంలో ఉంటాడు. తర్వాత ఏడాదంతా కుంభంలో సంచరిస్తాడు.
కేతువు: ఈ ఏడాది మే 18 వరకు కేతువు కన్యలో ఉంటాడు. తర్వాత ఏడాదంతా సింహంలో సంచరిస్తాడు.
ఈ ఏడాది మిశ్రమంగా ఉంటుంది. ప్రథమార్ధంలో గురువు, శని, కేతువు అనుకూల ఫలితాలు ఇస్తారు. ద్వితీయార్ధంలో రాహువు శుభ ఫలితాలు ఇస్తాడు. ఆర్థికంగా పూర్తిస్థాయి విజయాలు ఉండకపోవచ్చు. కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తగవు. మార్చి 29 నుంచి ఏల్నాటి శని ప్రభావం మొదలవుతున్నది. శారీరక శ్రమ పెరుగుతుంది. మానసికంగా ఆందోళనలు ఉంటాయి. గురు బలం కారణంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు.
బంధువులతో వైరం పెట్టుకోవద్దు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. రుణ బాధలు తీరుతాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. సంవత్సరం చివరిలో భూ లాభం సూచితం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇతరులకు ష్యూరిటీలు ఇవ్వకండి. ఆర్థిక లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. నిర్లిప్త ధోరణి విడనాడితే అనుకున్నది సాధించగలుగుతారు. ప్రారంభించిన పనులు నిదానంగా సాగుతాయి. ఆరోగ్యం ఓ మోస్తరుగా ఉంటుంది. ఆహార నియమాలు పాటించడం అవసరం.
ఏల్నాటి శని ప్రభావం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వాటిని అధిగమించడానికి రోజూ హనుమాన్ చాలీసా పఠించడం అవసరం.
ఈ ఏడాది అనుకూల ఫలితాలు పొందుతారు. గురు సంచారం ఓ మోస్తరుగా ఉంది. ఉద్యోగంలో మార్పులకు అవకాశం. మార్చి నుంచి ఉన్నతమైన మార్పు ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. రాబడి పెరుగుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. శని విశేషంగా యోగిస్తాడు. ఆరోగ్యం మెరుగవుతుంది. ప్రారంభించిన పనులు లాభదాయకంగా పూర్తవుతాయి. శుభవార్తలు వింటారు. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి.
స్థిరమైన ఆలోచనలు చేస్తారు. విలువైన వస్తువులు, భూములు కొనుగోలు చేస్తారు. వాహన యోగం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. విదేశీ యాన ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగులు, వ్యాపారులు దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందుతారు. ఖర్చులకు తగ్గ రాబడి ఉంటుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
గురువు, కేతువు మిశ్రమ పలితాలు ఇస్తారు. దత్తాత్రేయస్వామి, సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభప్రదం.
గ్రహ సంచారం మిశ్రమంగా ఉంది. గురువు కారణంగా ఉద్యోగంలో మార్పులు చోటుచేసుకుంటాయి. బదిలీలు జరగవచ్చు. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. చాలా విషయాల్లో సందిగ్ధ పరిస్థితులు నెలకొంటాయి. ద్వితీయార్ధంలో పరిస్థితుల్లో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయం క్రమేణా పెరుగుతుంది. అయితే, అందుకు తగ్గ ఖర్చులూ ఉంటాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు.
బంధువర్గం, స్నేహితుల సూచనలను పాటించి, సత్ఫలితాలను పొందుతారు. భూములు, వాహనాల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా.. పనులు నెరవేరుతాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. మొత్తంగా ఈ ఏడాది శుభప్రదంగా ఉంటుంది.
తరచూ నవగ్రహ ఆలయానికి వెళ్లి ప్రదక్షిణలు చేసుకుంటే మంచిది. నరసింహస్వామి ఆరాధన చేసుకోండి.
ఈ ఏడాది సింహభాగం శుభఫలితాలు పొందుతారు. గురువు అనుకూల ఫలితాలు ఇస్తాడు. సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కలుసుకుంటారు. ఉద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఏడాది ద్వితీయార్ధంలో గురువు వల్ల స్వల్ప సమస్యలు రావొచ్చు. అయితే ఫలితం మాత్రం మీకు అనుకూలంగానే ఉంటుంది.
శనైశ్చరుడు మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధగా వ్యవహరించొద్దు. సమయపాలన పాటించడం అవసరం. అన్నదమ్ములతో సఖ్యత పెరుగుతుంది. రుణ బాధలు తీరుతాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వివాహాది శుభకార్యాలు ముందుకు సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. సంయమనంతో నిర్ణయాలు తీసుకోవడం అవసరం.
శని, రాహువు అనుగ్రహం అవసరం. తరచూ ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులు ఏకాగ్రతతో పూర్తిచేస్తారు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఖర్చుల నియంత్రణ అవసరం. కుటుంబ పెద్దల సూచనలు పాటించాలి. వివాదాలకు దూరంగా ఉండండి. తలపెట్టిన పనులు పూర్తిచేయడంలో మనసు పెట్టండి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. అయితే, ఖర్చులు కూడా పెరగవచ్చు.
భూములు, వాహనాల మూలంగా ఖర్చులు ఉంటాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. కొత్త పరిచయాలతో కార్యసిద్ధి ఉంది. ఆత్మీయులతో సత్సంబంధాలు ఉంటాయి. ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. భూములు, వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. పాత బాకీలు వసూలు అవుతాయి. కుటుంబంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. అనవసరమైన చర్చల కారణంగా మనశ్శాంతి కరువవుతుంది. రాబడి పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు.
శని, రాహువు, కేతువు మిశ్రమ ఫలితాలు ఇస్తారు. దుర్గాదేవి ఆలయాన్ని తరచూ సందర్శిస్తే మేలు జరుగుతుంది.
సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. పలుకుబడితో పనులు పూర్తవుతాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. పెద్దల సలహాలను పాటిస్తారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. నలుగురికి సాయం చేస్తారు. వ్యాపారులకు మంచి సమయం. ఆర్థిక పరమైన సమస్యలు తీరుతాయి. కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం అవసరం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం.
చదువులో రాణిస్తారు. బంధువులతో పనులు నెరవేరుతాయి. కుటుంబ పెద్దల సలహాలను పాటిస్తారు. ఉద్యోగులకు తోటివారితో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఖర్చుల నియంత్రణ అవసరం. ధికారుల అండదండలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఏడాది చివరిలో గృహయోగం ఉన్నది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
శని మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. ఆంజనేయస్వామి ఆలయాన్ని, శివాలయాన్ని సందర్శించండి.
గురువు సంచారం మే వరకు ప్రతికూల ఫలితాలు ఇస్తుంది. తర్వాత సత్ఫలితాలు పొందుతారు. ప్రతి పనిలోనూ ఆశించిన ఫలితాలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. రుణ బాధలు తీరుతాయి. కొత్త ఇల్లు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. మార్చి నుంచి శని యోగిస్తాడు. రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. వృత్తిలో పురోభివృద్ధి సాధిస్తారు. వ్యాపారులకు మంచి సమయం. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి.
కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. భూ లావాదేవీల్లో ఆశించిన లాభాలు పొందగలుగుతారు. ఏడాది చివరిలో కేతువు పూర్తి అనుకూల ఫలితాలు ఇస్తాడు. సంతృప్తికరమైన జీవనం గడుపుతారు. సామాజిక సేవలో భాగమవుతారు. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది. ఏడాది చివరిలో దీర్ఘకాలిక ప్రయోజనం పొందుతారు.
గురువు, రాహువు కొంత ప్రతికూల ఫలితాలు ఇస్తారు. దత్తాత్రేయస్వామి, దుర్గాదేవి ఆలయాలను తరచూ సందర్శిస్తూ ఉండండి.
ఈ సంవత్సరం మే వరకు గురువు బలంగా ఉంటున్నాడు. ఈ కాలంలో శుభకార్య ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొని ఉంటుంది. వృత్తివ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. తర్వాత అష్టమ గురువు కారణంగా కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. సంవత్సరాంతంలో మళ్లీ శుభ ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది. అన్నిటా విజయాలు వరిస్తాయి. మార్చి చివరి వరకు అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది.
ఫలితంగా జీవనశైలిలో ఒడుదొడుకులు ఉంటాయి. ఆర్థికాంశాల్లో చికాకులు తలెత్తుతాయి. మే తర్వాత శని కొంత మెరుగైన ఫలితాలు ఇస్తాడు. ఆర్థిక సమస్యలు తీరుతాయి. పలుకుబడితో పనులు జరుగుతాయి. ఈ ఏడాది రాహువు వల్ల సమస్యలు ఉత్పన్నం అవుతాయి. శ్రమ పెరుగుతుంది. చేసిన పనికి తగిన గుర్తింపు రాకపోవచ్చు. కేతువు అనుకూలంగా ఉన్నాడు. స్థిరమైన నిర్ణయాల వల్ల లబ్ధి చేకూరుతుంది. ఆరోగ్యం ఉన్నతంగా ఉంటుంది.
శని, రాహువు కొంత ప్రతికూలంగా ఉన్నారు. ఈ రెండు గ్రహాల అనుకూలత కోసం పరమేశ్వరుడు, అమ్మవారి ఆరాధన చేసుకోగలరు.
ఏడాది మొదటి ఐదు నెలలు గురు బలం తక్కువగా ఉంది. అయినవారితో వైరం ఏర్పడవచ్చు. అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కార్యభారం వల్ల అలసటకు గురవుతుంటారు. మే తర్వాత పరిస్థితులు పూర్తిగా అనుకూలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వివాహం, సంతానం, ఉద్యోగం తదితర దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందుతారు. మార్చి వరకు శనైశ్చరుడు పూర్తిస్థాయిలో శుభ ఫలితాలు ఇస్తాడు. ఏడాది ప్రారంభంలో శని అనుగ్రహం కారణంగా ఊహించని ఉన్నతమైన మార్పు చోటుచేసుకుంటుంది. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం.
అనుకూల స్థానచలన సూచన. మార్చి తర్వాత అర్ధాష్టమ శని ప్రభావం మొదలవుతున్నది. శ్రమ ఎక్కువ అవుతుంది. ఆరోగ్యపరంగా స్వల్ప చికాకులు తలెత్తుతాయి. దూర ప్రయాణాల సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఏడాది ద్వితీయార్ధం నుంచి రాహువు, కేతువు అనుకూల ఫలితాలు ఇస్తారు. ఆరోగ్యం మెరుగవుతుంది.
గురువు అనుగ్రహం కోసం దత్తాత్రేయస్వామి ఆరాధన చేయండి. అర్ధాష్టమ శని దోష పరిహారం కోసం తరచూ ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
ఈ ఏడాది సింహభాగం గురువు మీకు అనుకూలిస్తాడు. అన్నిటినీ మించి ఏల్నాటి శని దోషం ఈ ఏడాది నివృత్తి అవుతున్నది. మీరు పట్టిందల్లా బంగారమనే చెప్పాలి. మార్చి నుంచి ఏడాది పూర్తయ్యే వరకు అన్ని రకాలుగా ఉన్నతమైన ఫలితాలు పొందుతారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఉద్యోగులకు మంచి సమయం. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. మార్చి తర్వాత ఏల్నాటి శని దోషం తొలిగిపోతున్నది. అనుకూల స్థాన చలన సూచన.
వ్యాపారులు విశేషమైన లాభాలను గడిస్తారు. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ప్రథమార్ధంలో రాహువు, ద్వితీయార్ధంలో కేతువు శుభ ఫలితాలు ఇస్తారు. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. హార్డ్వేర్ వ్యాపారులకు ఈ ఏడాది కలిసివస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. గతంలో నిలిచిపోయిన పనులు ఈ ఏడాది పూర్తవుతాయి. రాహువు,
కేతువు మిశ్రమంగా ఉన్నారు. రాహువు అనుగ్రహం కోసం దుర్గాదేవి సేవ, కేతువు అనుకూలత కోసం సుబ్రహ్మణ్యస్వామి సేవ చేసుకోండి.
ఈ ఏడాది గురువు సింహభాగం మీకు శుభ ఫలితాలు ఇస్తాడు. ప్రథమార్ధం కన్నా ద్వితీయార్ధంలో ఎక్కువగా రాణిస్తారు. ఆర్థికంగా విశేషమైన విజయాలు సాధిస్తారు. ఆస్తుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఏల్నాటి శని చివరి దశకు చేరుకున్నారు. మంచి మార్పులు మొదలవుతాయి. వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. అనవసరమైన విషయాలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వకండి. పెట్టుబడుల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించడం అవసరం. బంధుమిత్రులతో సఖ్యత నెలకొంటుంది. కుటుంబంలో సందడి వాతావరణం ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఏడాది ప్రథమార్ధంలో కిందిస్థాయి ఉద్యోగులతో చికాకులు తలెత్తవచ్చు. సంయమనం పాటించడం చాలా అవసరం. రాహువు, కేతువు అంతగా యోగించే స్థానాల్లో లేరు. భూ లావాదేవీల్లో మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
రాహువు అనుగ్రహం కోసం దుర్గాదేవి ఆరాధన, కేతువు అనుకూలత కోసం నరసింహస్వామి సేవ చేసుకోగలరు.
ఈ సంవత్సరం మంచి-చెడు మిశ్రమంగా ఉంటుంది. సంవత్సరం మధ్యలో గురువు అనుకూల ఫలితాలు ఇస్తాడు. మొదట్లో, చివర్లో కొన్ని చికాకులు కలిగిస్తాడు. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలం అత్యంత అనుకూలంగా చెప్పవచ్చు. ఈ సమయంలో గురువు మీకు పూర్తిస్థాయిలో యోగిస్తాడు. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో ఉన్నతమైన స్థాయికి చేరుకుంటారు. గృహ యోగం ఉంది. సంతానం విషయంలో శుభవార్త వింటారు.
చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఏల్నాటి శని ప్రభావం ఉంది. ఫలితంగా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సేవకుల వల్ల నష్టం జరగవచ్చు. బంధువర్గంతో ఆచితూచి వ్యవహరించడం అవసరం. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో ఆశించినంత పురోగతి ఉండకపోవచ్చు. మే వరకు రాహువు రాశిలో, కేతువు ఏడింట్లో ఉండటం వల్ల చికాకులు ఉంటాయి. తర్వాత కేతువు అనుకూలంగా మారుతున్నాడు. ఆర్థిక సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతాయి. నిత్యం హనుమాన్
చాలీసా పఠించండి. తరచూ ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
-గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల్ పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్. సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in