
మేషం
రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. అనుకోకుండా కొన్ని ఖర్చులు ముందుకు రావచ్చు. బరువు, బాధ్యతలు పెరిగినా కార్య నిర్వహణపై మనసు నిలుపుతారు. పై అధికారుల ఆదరణ లభిస్తుంది. పనులు నెరవేరుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. మంచి పేరు సంపాదిస్తారు. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు అనుకూలమైన వారం. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఏర్పవచ్చు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి.ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించడం అవసరం.
వృషభం
పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. బంధువులు, స్నేహితుల సహకారం లభిస్తుంది. సహోద్యోగుల సహకారం, అధికారుల ఆదరణ లభిస్తాయి. ఆరోగ్యం సంతృప్తిగా ఉంటుంది. రాజకీయ పనులలో అనుకూలత ఉంటుంది. కోర్టు కేసులలో విజయం చేకూరుతుంది. ఉద్యోగులకు బరువు, బాధ్యతలు పెరిగినా సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం. పారిశ్రామిక వేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. రోజువారీ కార్యకలాపాలు సంతృప్తికరంగా సాగుతాయి.
మిథునం
వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి. ఒప్పందాలలో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు పనిభారం తప్పదు. ప్రారంభించిన పనులలో జాప్యం ఉంటుంది. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యంతో ఉంటారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. రాజకీయ పనులలో ఖర్చులు పెరుగుతాయి. కోర్టు వ్యవహారాల్లో సమయం వృథా అవుతుంది. ప్రతి విషయంలోనూ ఈ వారం శ్రద్ధ, పట్టుదల అవసరం. ఆదాయంలో అస్థిరత ఉంటుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. యాత్రలపై మనసు నిలుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు శ్రమించాలి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది.
కర్కాటకం
వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. విద్యార్థులకు అనుకూల వారం. మంచి సంస్థలలో అవకాశం దొరుకుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు తోటివారితో మనస్పర్ధలు రావచ్చు. పై అధికారులతో స్నేహంగా ఉంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు పెరగవచ్చును. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. భూముల కొనుగోలు కొన్ని రోజులు వాయిదా వేయడం మంచిది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి.
సింహం
పనులు నెరవేరుతాయి. స్నేహితులు, బంధువుల సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మీయుల రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ పనులలో కార్య సాఫల్యం ఉంది. ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి. సంగీత, సాహిత్య కళాకారులకు ఆదాయం సంతృప్తిగా ఉంటుంది. కొత్త వస్తువులను కొంటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. పనులలో బరువు, బాధ్యతలతో శ్రమ పెరుగుతుంది. అందుకు తగ్గ ఫలితం పొందుతారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త! వ్యాపారంలో భాగస్వాముల మధ్య స్నేహ సంబంధాలు పెరుగుతాయి.
కన్య
శుభకార్య యత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు సంతృప్తికర ఫలితాలు సాధిస్తారు. సమాజంలో పేరు సంపాదిస్తారు. మంచివారి సాహచర్యంతో పనులు పూర్తవుతాయి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు ఇరుగుపొరుగు సహకారం లభిస్తుంది. ఉత్పత్తి సంతృప్తికరంగా ఉంటుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు తోటివారితో స్పర్ధలు రావచ్చు. స్థానచలన అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పు ఉండవచ్చు. పెద్దల సలహాలు పాటించండి. వ్యాపార ఉత్పాదన సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. శ్రద్ధతో, ఉత్సాహంతో పనులు చేస్తారు.
తుల
ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువుల సహకారం లభిస్తుంది. కళాకారులకు ఆదాయం స్థిరంగా ఉంటుంది. అయితే పాతబాకీలు ఆలస్యంగా వసూలు అవుతాయి. తలపెట్టిన పనులలో జాప్యం జరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. కొత్త వస్తువులు కొంటారు. ఆర్థిక ఇబ్బందులతో ప్రయాణాలు వాయిదా పడవచ్చు. రాజకీయ పనులలో కదలిక వస్తుంది. వివాదాలకు దూరంగా ఉంటూ, పనులు పూర్తి చేయడంపై మనసు నిలపండి. ఖర్చుల నియంత్రణ అవసరం. వ్యాపారులు భాగస్వాములతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది. కోర్టు ఫలితాలు అనుకూలం.
వృశ్చికం
పాత బాకీలు వసూలు అవుతాయి. పనులలో బరువు, బాధ్యతలు పెరుగుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. సమాజంలో మంచిస్థాయిలో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువర్గం రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగులు తోటివారితో స్నేహంగా మెలగడానికి ప్రయత్నిస్తారు. కోర్టు కేసులలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యాపారులకు భాగస్వాములతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్నేహితులు, బంధువులకు సాయపడతారు. వ్యవసాయదారులకు వాతావరణం కలిసి వస్తుంది.
ధనుస్సు
తలపెట్టిన కార్యాలు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పెండింగ్ పనులు పూర్తవుతాయి. నలుగురిలో మంచి పేరును పొందుతారు. స్నేహితుల పరిచయాలతో పనులు నెరవేరుతాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. స్థానచలనం ఉండవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. వ్యాపారం అనుకూలంగా కొనసాగుతుంది. కోర్టు కేసులలో ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వాహనాల వల్ల పనులు కలిసి వస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య స్నేహ సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటికి కావలసిన వస్తువులను కొంటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.
మకరం
పదోన్నతి, స్థాన చలనం ఉండవచ్చు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. బంధువులు, స్నేహితుల రాకతో సందడి పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. కోర్టు కేసులలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కళాకారులకు కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. ఆస్తి తగాదాలు పాక్షికంగా పరిష్కారం అవుతాయి. రావలసిన డబ్బు సమయానికి అందకపోవడంతో పనులలో జాప్యం జరుగుతుంది. విద్యార్థులకు శ్రమ ఎక్కువ అవుతుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. నలుగురికి సాయపడతారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఖర్చులపై నియంత్రణ అవసరం. భూలావాదేవీలు కలిసి వస్తాయి.
కుంభం
ఆదాయం స్థిరంగా ఉంటుంది. శుభకార్య యత్నాలు కొనసాగుతాయి. డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. దూర ప్రయాణాలపై మనసు నిలుపుతారు. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, స్నేహితులతో కార్యాలు నెరవేరుతాయి. ఇరుగు పొరుగుతో స్నేహ సంబంధాలు పెరుగుతాయి. కోర్టు కేసులలో అనుకూలంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. నలుగురిలో పేరు పొందుతారు.
సమాజంలో మంచి స్థాయిలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తుల మూలంగా ఆదాయం పొందుతారు. పట్టుదలతో పనులు చేసి సత్ఫలితాలు సాధిస్తారు. ఈ వారం ఖర్చుల నియంత్రణ అవసరం.
మీనం
ఆస్తుల తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. దేవతా, గురుభక్తితో ప్రశాంతతను పొందుతారు. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. అన్నదమ్ములు, బంధువుల సహకారం లభిస్తుంది. కొత్త వ్యక్తులతో జాగ్రత్త అవసరం. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. విహార యాత్రలు, తీర్థయాత్రలపై మనసు నిలుపుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రారంభించిన పనులను శ్రద్ధతో పూర్తిచేస్తారు.
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in