1. విపరీత కరణీయ ఆసనం
ఈ ఆసనంలో శరీరాన్ని గోడకు ఆనించి కాళ్లు పైకి ఎత్తాలి. ఈ భంగిమ థైరాయిడ్ గ్రంథికి రక్త సరఫరా సాఫీగా జరిగేలా చేస్తుంది. థైరాయిడ్ పనితీరును క్రమబద్ధీకరిస్తుంది.
2. సర్వాంగాసనం
భుజం నుంచి పాదాల వరకు శరీరాన్ని పైకెత్తాలి.
ఈ ఆసనం శరీరంలో ఎండోక్రైన్ వ్యవస్థ నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తుంది. థైరాయిడ్ గ్రంథి మీద ఒత్తిడి కలిగిస్తుంది. దీంతో రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరును ఎంతగానో మెరుగుపరుస్తుంది.
3. ఉష్ర్టాసనం
ఈ ఆసనం ఒంటె ఆకారాన్ని పోలి ఉంటుంది. మెడ వెనక్కి సాగదీయడంతో థైరాయిడ్ గ్రంథిలో రక్త సరఫరా సక్రమంగా సాగుతుంది. ఒక్క థైరాయిడ్ గ్రంథికి మాత్రమే కాకుండా.. వెన్ను సమస్యల నుంచి కూడా ఉష్ర్టాసనం ఉపశమనం ఇస్తుంది.
4. సేతుబంధాసనం
ఈ భంగిమ వంతెన ఆకారంలో ఉంటుంది. మెడను కొంత సాగదీస్తూ వేసే సేతుబంధాసనం థైరాయిడ్ గ్రంథిలో రక్త ప్రస
రణను మెరుగుపరుస్తుంది.
అయితే.. థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యం విషయంలో యోగాను మాత్రమే నమ్ముకోకూడదు. ఇతర చికిత్సలతోపాటు అనుసరించాలి. నిపుణుల సలహా తప్పనిసరి.
Yoga Thyroid