Rock Candy Sugar | పటిక బెల్లం.. దీని గురించి అందరికీ తెలుసు. దీన్ని ఎక్కువగా సోంపు గింజలతోపాటు తింటుంటారు. అయితే ఆయుర్వేద పరంగా పటిక బెల్లం ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. పలు ఔషధాల తయారీలో, పలు వ్యాధులను నయం చేసేందుకు పటికబెల్లం ఉపయోగిస్తారు. ఇది చక్కెర లాగా తియ్యగా ఉంటుంది. కానీ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. పటిక బెల్లాన్ని తినడం వల్ల మనం అనేక లాభాలను పొందవచ్చు. భోజనం చేసిన అనంతరం చిన్న పటిక బెల్లం ముక్కను తింటే జీర్ణక్రియ మెరుగు పడుతుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. కడుపు ఉబ్బరం సమస్య నుంచి బయట పడవచ్చు. గ్యాస్ ఏర్పడదు. తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అజీర్తి కూడా ఉండదు.
పటిక బెల్లాన్ని తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ఆయుర్వేద ప్రకారం పటిక బెల్లం మన శరీరానికి చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల పటిక బెల్లం కలిపిన నీళ్లను వేసవిలో తాగుతుంటే వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వేసవి తాపం తగ్గుతుంది. శరీరం కోల్పోయిన ద్రవాలు, ఎలక్ట్రోలైట్స్‌ను తిరిగి పొందవచ్చు. డీహైడ్రేషన్ సమస్య తగ్గుతుంది. పటిక బెల్లాన్ని తినడం వల్ల గొంతులో మంట, నొప్పి, గొంతు గరగరగా ఉండడం వంటి సమస్యలు తగ్గుతాయి. దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. శ్వాస నాళాలు క్లియర్ అవుతాయి. గాలి సరిగ్గా ఆడుతుంది. శ్వాస తీసుకోవడంలో ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి.
శ్వాస సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే పటిక బెల్లాన్ని గోరు వెచ్చని టీ లేదా పాలతో తీసుకోవాల్సి ఉంటుంది. ఇక పటిక బెల్లాన్ని తింటే ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో రక్తం తయారవుతుంది. రక్తహీనత తగ్గుతుంది. పటిక బెల్లం నోట్లో ఉండే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. కనుక భోజనం చేసిన తరువాత దీన్ని తింటే నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. పటిక బెల్లాన్ని ఉదయం గోరు వెచ్చని నీటిలో కలిపి తాగితే శరీరానికి శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా మారుతారు. బద్దకం పోతుంది. రోజంతా చురుగ్గా ఉంటారు. యాక్టివ్‌గా పనిచేస్తారు. శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి.
పటిక బెల్లాన్ని తినడం వల్ల శరీరం తాజాదనపు అనుభూతి చెందుతుంది. ఉత్సాహంగా మారుతారు. చురుగ్గా ఉంటారు. ఈ విధంగా పటిక బెల్లం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు పటిక బెల్లాన్ని తీసుకోకూడదు. పటిక బెల్లం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ దీన్ని అతిగా తినరాదు. పటిక బెల్లాన్ని మోతాదుకు మించి తింటే దుష్పరిణామాలు కలుగుతాయి. పటిక బెల్లాన్ని పలు తీపి వంటకాల్లోనూ ఉపయోగిస్తారు. చక్కెర వాడడం ఇష్టం లేని వారు దీన్ని ప్రత్యామ్నాయంగా వాడవచ్చు. కానీ మోతాదులో తింటేనే ప్రయోజనాలు కలుగుతాయి.