Dragon Fruit | సీజన్లవారిగా మనకు పలు రకాల పండ్లు లభిస్తుంటాయి. సీజన్లలో లభించే పండ్లను తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం. చలికాలం సీజన్లోనూ మనకు పలు రకాల పండ్లు అందుబాటులో ఉంటాయి. వాటిల్లో డ్రాగన్ ఫ్రూట్ కూడా ఒకటి. ఈ పండ్లు మనకు బయట మార్కెట్లో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. ఇవి చూసేందుకు పింక్ రంగులో ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. లోపల తెలుపు లేదా పింక్ రంగులో ఉండే డ్రాగన్ ఫ్రూట్ పండ్లు మనకు లభిస్తున్నాయి. అయితే వీటిల్లో తెలుపు రంగు డ్రాగన్ ఫ్రూట్స్ మనకు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. అయితే వీటిని పోషకాలకు గనిగా చెప్పవచ్చు. డ్రాగన్ ఫ్రూట్ చప్పగా ఉంటుంది. కానీ ఇది అందించే ఆరోగ్య ప్రయోజనాలు అద్భుతమనే చెప్పాలి. డ్రాగన్ ఫ్రూట్‌ను తినడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
డ్రాగన్ ఫ్రూట్‌ను ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. 100 గ్రాముల డ్రాగన్ ఫ్రూట్‌ను తింటే మనకు సుమారుగా 60 క్యాలరీలు లభిస్తాయి. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఈ ఫ్రూట్ చక్కని ఆహారం అని చెప్పవచ్చు. దీన్ని తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువ తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. అలాగే ఈ పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు మెగ్నిషియం, ఐరన్, ఫైబర్ కూడా సమృద్ధిగానే ఉంటాయి. ఇవి మనకు పోషణను అందిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరం తగ్గుతాయి.
డ్రాగన్ ఫ్రూట్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ పండ్లను తింటే జీర్ణక్రియ మెరుగు పడుతుంది. దీంతోపాటు మలబద్దకం తగ్గుతుంది. కనుక దీన్ని ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో భాగం చేసుకోవాలి. ఈ ఫ్రూట్‌ను తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. డ్రాగన్ ఫ్రూట్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దీన్ని తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలిగా అనిపించదు. దీంతో బరువు తగ్గడం తేలికవుతుంది. డ్రాగన్ ఫ్రూట్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఫ్లేవనాయిడ్స్, ఫీనోలిక్ యాసిడ్లు, బీటా సయనిన్స్ ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో వాపులు తగ్గుతాయి. అలాగే తీవ్రమైన వ్యాధులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.
డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో చర్మం సాగేగుణాన్ని పొందుతుంది. ఫలితంగా వయస్సు మీద పడే వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. అలాగే ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని సంరక్షిస్తాయి. పర్యావరణ కాలుష్యం వల్ల చర్మానికి జరిగే నష్టాన్ని నివారిస్తాయి. డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. అలాగే ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అయిన బీటా సయనిన్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అందువల్ల తరచూ ఈ పండ్లను తింటే రోగాలు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే రోజంతా శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు. యాక్టివ్‌గా పనిచేస్తారు. ఇలా డ్రాగన్ ఫ్రూట్‌ను తరచూ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.