Black Seed Oil | ఆయుర్వేదంలో ఎన్నో రకాల పదార్థాలను ఔషధాలుగా ఉపయోగిస్తుంటారు. చాలా వరకు పదార్థాలు మనకు అందుబాటులో ఉంటాయి. కానీ వాటి గురించి పట్టించుకోం. ఇక అలాంటి పదార్థాలు మనకు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వాటిల్లో కలోంజి విత్తనాలు కూడా ఒకటి. వీటనే బ్లాక్ సీడ్స్ అంటారు. ఇవి అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ విత్తనాలనే నైజెల్లా సతివా సీడ్స్ అని కూడా పిలుస్తారు. ఈ విత్తనాల నుంచి తయారు చేసే నూనె మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. దీన్నే బ్లాక్ సీడ్ ఆయిల్ అంటారు. బ్లాక్ సీడ్ ఆయిల్లో అనేక పోషకాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. అందువల్ల ఈ నూనె మనకు కలిగే అనేక వ్యాధులను నయం చేస్తుంది. దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.
కలోంజి నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. శరీరం ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడేలా చేస్తాయి. దీంతో వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. కలోంజి నూనెను వాడితే అజీర్ణం తగ్గుతుంది. కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే మలబద్దకం నుంచి కూడా విముక్తి పొందవచ్చు. పొట్టలో కలిగే అసౌకర్యాన్ని సైతం ఈ నూనె తగ్గిస్తుంది. దీంతో జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. కలోంజి నూనెలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ నూనె మొటిమలు, మచ్చలు, దురద, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ నూనె చర్మాన్ని పునరుత్తేజం చేస్తుంది. దీంతో చర్మం కాంతివంతంగా మారి మృదువుగా ఉంటుంది.
జుట్టు రాలడం, చుండ్రు సమస్యలను తగ్గించడంలోనూ ఈ నూనె అద్భుతంగా పనిచేస్తుంది. ఇది జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కలోంజి నూనెను వాడుతుంటు కుదుళ్ల వాపులు తగ్గుతాయి. దీంతో శిరోజాలు కాంతివంతంగా మారి ఒత్తుగా, పొడవుగా పెరుగుతాయి. బ్లాక్ సీడ్ ఆయిల్ కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించడంలోనూ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఈ నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అలాగే ఈ నూనె మన శరీర మెటబాలిజంను సైతం పెంచుతుంది.
కలోంజి నూనెను వాడితే మన శరీర మెబాటిజం పెరుగుతుంది. దీంతో అధిక బరువును తగ్గించుకోవచ్చు. బరువు నియంత్రణలో ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఆకలి నియంత్రణలోకి వస్తుంది. దీని వల్ల బరువు తగ్గుతారు. ఆరోగ్యవంతమైన జీవనశైలి అలవడుతుంది. కలోంజి నూనెలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులను, దృఢత్వాన్ని తగ్గిస్తాయి. ఇది ఆర్థరైటిస్, తీవ్రమైన వాపులు ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తుంది. కలోంజి విత్తనాలకు చెందిన నూనె ఆస్తమా, అలర్జీలను సైతం తగ్గించగలదు. బ్రాంకైటిస్ నుంచి ఈ నూనె ఉపశమనాన్ని అందిస్తుంది. ఈ నూనెలో ఉండే సమ్మేళనాలు శ్వాస నాళాలను వెడల్పు చేస్తాయి. దీంతో శ్వాస సరిగ్గా ఆడుతుంది. అలాగే వాపులు తగ్గుతాయి. దీంతో ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగు పడుతుంది. కనుక బ్లాక్ సీడ్ ఆయిల్‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాల్సి ఉంటుంది.