Health Problems | 40 ఏళ్ల తరువాత మహిళలు ఈ జాగ్రత్తలు పాటిస్తే.. ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు..
40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత మహిళల శరీరంలో అనేక శారీరక, హార్మోన్ల, మానసిక మార్పులు చోటుచేసుకుంటాయి. అయితే కుటుంబ బాధ్యతలు, ఉద్యోగం, సంరక్షణ పనుల్లో నిమగ్నమై ఉండే చాలా మంది మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఫలితంగా అలసట, నిద్రలేమి, మూడ్ మార్పులు, బరువు పెరగడం వంటి లక్షణాలను వయస్సు ప్రభావంగానే భావించి వైద్య సలహా తీసుకోవడం ఆలస్యం చేస్తారు.
Health Problems | 40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత మహిళల శరీరంలో అనేక శారీరక, హార్మోన్ల, మానసిక మార్పులు చోటుచేసుకుంటాయి. అయితే కుటుంబ బాధ్యతలు, ఉద్యోగం, సంరక్షణ పనుల్లో నిమగ్నమై ఉండే చాలా మంది మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఫలితంగా అలసట, నిద్రలేమి, మూడ్ మార్పులు, బరువు పెరగడం వంటి లక్షణాలను వయస్సు ప్రభావంగానే భావించి వైద్య సలహా తీసుకోవడం ఆలస్యం చేస్తారు. అయితే ఈ దశలో అవగాహన పెంచుకోవడం, ముందస్తు పరీక్షలు చేయించుకోవడం ద్వారా భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మధ్య వయస్సులో మహిళల్లో సాధారణంగా పెరిమెనోపాజ్, మెనోపాజ్ దశలు ప్రారంభమవుతాయి. ఈ సమయంలో హార్మోన్లలో వచ్చే మార్పులు శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. నెలసరి క్రమం తప్పడం, నిద్ర సరిగా లేకపోవడం, మానసిక స్థితిలో హెచ్చుతగ్గులు, కారణం లేకుండా బరువు పెరగడం, శక్తి తగ్గిపోవడం, జీవక్రియ మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఎముకల సాంద్రత తగ్గుతుంది..
ఈ వయస్సు నుంచి ఎముకల సాంద్రత క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. దీంతో బోలు ఎముకల వ్యాధి (ఆస్టియోపోరోసిస్) ప్రమాదం పెరుగుతుంది. అదే సమయంలో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా అధికమవుతాయి. అయినప్పటికీ చాలామంది మహిళలు ఇవన్నీ వయస్సుతో వచ్చే సహజ మార్పులేనని భావించి వైద్యులను సంప్రదించరు. అయితే లక్షణాలు ఎక్కువకాలం కొనసాగినా లేదా తీవ్రంగా ఉన్నా వాటిని నిర్లక్ష్యం చేయరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 40 ఏళ్ల తర్వాత మహిళల ఆరోగ్యంపై సరైన అవగాహన లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా మెనోపాజ్, హార్మోన్ల మార్పులు, మానసిక ఆరోగ్యం వంటి అంశాలపై ఇప్పటికీ బహిరంగ చర్చలు తక్కువగా జరుగుతున్నాయి. దీంతో చాలామంది మహిళలు అసౌకర్యాలను సహజమని భావించి చికిత్స ఆలస్యం చేస్తున్నారు. ఆందోళన, చిరాకు, నిద్రలో అంతరాయం, ఏకాగ్రత తగ్గడం, భావోద్వేగ అలసట, ఎప్పుడూ నీరసంగా అనిపించడం వంటి లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. హార్మోన్ల మార్పులు మానసిక స్థితి, నిద్ర, శక్తి స్థాయిలు, ఏకాగ్రతపై ప్రభావం చూపుతాయి. అందువల్ల సమస్యలు తీవ్రమయ్యే వరకు వేచి ఉండకుండా ముందుగానే గుర్తించి తగిన చర్యలు తీసుకోవడం అవసరం.
రెగ్యులర్గా పరీక్షలు చేయించాలి..
40 ఏళ్ల తర్వాత ఆరోగ్య సంరక్షణ అంటే కేవలం వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం మాత్రమే కాకుండా, వ్యాధులు రాకముందే నివారించడంపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించే అవకాశం ఉంటుంది. ప్రతి ఏడాది మధుమేహం, గుండె జబ్బులు, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం మంచిది. అలాగే ఎముకల సాంద్రత పరీక్షలు, జీవక్రియ పరీక్షలు, రొమ్ము ఆరోగ్య పరీక్షలు కూడా క్రమం తప్పకుండా చేయించుకోవాలని సూచిస్తున్నారు. హార్మోన్ల ఆరోగ్యం, లైంగిక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యంపై కూడా వైద్యులను సంప్రదించడం అవసరం. మహిళల్లో గుండె సంబంధిత వ్యాధులు ప్రధాన ఆరోగ్య ప్రమాదాల్లో ఒకటిగా ఉన్నప్పటికీ, వాటి హెచ్చరిక సంకేతాలను చాలాసార్లు గుర్తించలేకపోతున్నారు. ముందస్తు పరీక్షలు, ప్రమాద స్థాయిని అంచనా వేయడం ద్వారా భవిష్యత్తులో వచ్చే తీవ్రమైన సమస్యలను తగ్గించుకోవచ్చు.
ఆరోగ్యకరమైన జీవనశైలి ముఖ్యం..
ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా ఈ దశలో కీలక పాత్ర పోషిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ముఖ్యంగా శక్తి పెంచే వ్యాయామాలు (స్ట్రెంగ్త్ ట్రైనింగ్) చేయడం, తగినంత ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కండరాల బలం, ఎముకల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మంచి నిద్ర, ఒత్తిడి నియంత్రణ, సమతుల్య ఆహారం కూడా అంతే ముఖ్యం. దీర్ఘకాలిక ఒత్తిడి, నిద్రలేమి హార్మోన్ల సమస్యలను మరింత తీవ్రం చేస్తాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో మంచి అనుబంధాలు కొనసాగించడం మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆరోగ్యాన్ని పర్యవేక్షించే సాంకేతిక పరికరాలు, హెల్త్ ట్రాకింగ్ యాప్లను ఉపయోగించడం ద్వారా శరీరంలో వచ్చే మార్పులను గమనించి అవసరమైన సమయంలో వైద్య సలహా తీసుకోవచ్చు. 40 ఏళ్ల తర్వాత మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడం, క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్య సమస్యల గురించి బహిరంగంగా మాట్లాడడం ద్వారా దీర్ఘకాలం ఆరోగ్యంగా, స్వతంత్రంగా జీవించే అవకాశాలు మెరుగుపడతాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

