Migraine | కాఫీని సేవిస్తే మైగ్రేన్ తగ్గుతుందా, పెరుగుతుందా.. నిపుణులు ఏమంటున్నారు..?
ఆధునిక జీవనశైలిలో మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు కాఫీ తాగితే ఉపశమనం లభిస్తుందని కొందరు చెబుతుంటే, మరికొందరు మాత్రం కాఫీనే మైగ్రేన్‌కు కారణమవుతుందని భావిస్తారు. దీంతో కాఫీ నిజంగా మైగ్రేన్‌కు మేలు చేస్తుందా? లేక హాని చేస్తుందా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది.
Migraine | ఆధునిక జీవనశైలిలో మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు కాఫీ తాగితే ఉపశమనం లభిస్తుందని కొందరు చెబుతుంటే, మరికొందరు మాత్రం కాఫీనే మైగ్రేన్‌కు కారణమవుతుందని భావిస్తారు. దీంతో కాఫీ నిజంగా మైగ్రేన్‌కు మేలు చేస్తుందా? లేక హాని చేస్తుందా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం దీనికి ఒకే సమాధానం ఉండదు. వ్యక్తి నుంచి వ్యక్తికి కాఫీ ప్రభావం మారుతుంది. కాఫీలో ఉండే కెఫీన్ మెదడులోని అడెనోసిన్ రిసెప్టర్లను నిరోధించి రక్తనాళాలు కుచించుకునేలా చేస్తుంది. మైగ్రేన్ సమయంలో మెదడులోని రక్తనాళాలు విస్తరించడం వల్ల నొప్పి పెరుగుతుంది. అలాంటి సమయంలో కెఫీన్ రక్తనాళాలను మళ్లీ కుచించడంలో సహాయపడటంతో కొందరిలో తలనొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే కొన్ని తలనొప్పి నివారణ మందుల్లో కూడా కెఫీన్‌ను ఉపయోగిస్తారు.
భిన్న రకాలుగా ప్రభావం..
అయితే ప్రతి మైగ్రేన్ బాధితుడికి కాఫీ ఒకే విధంగా పనిచేయదు. కొందరిలో కాఫీ తాగిన వెంటనే మైగ్రేన్ దాడి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి వారు కాఫీని దూరంగా ఉంచడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు ప్రతిరోజూ ఎక్కువగా కాఫీ తాగే వారు ఒక్కసారిగా కాఫీ తగ్గిస్తే లేదా పూర్తిగా మానేస్తే కూడా తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. దీనిని కెఫీన్ ఉపసంహరణ తలనొప్పి (Caffeine Withdrawal Headache) అంటారు. అంటే కాఫీ తాగడం వల్ల కాదు, ఒక్కసారిగా తాగడం ఆపేయడం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. నిపుణుల సూచనల ప్రకారం, కాఫీ తాగిన తర్వాత మైగ్రేన్ వస్తే దానిని నివారించడం ఉత్తమం. అయితే కాఫీ తాగని రోజుల్లో మాత్రమే తలనొప్పి వస్తే అది కెఫీన్ ఉపసంహరణ ప్రభావం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా కాఫీ మానేయకుండా క్రమంగా తగ్గించడం మంచిది.
ఒక్కసారిగా మానేయకూడదు..
రోజూ కాఫీ తాగే వారు పరిమిత మోతాదులోనే తీసుకోవాలి. రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల కాఫీని సమయానికి తాగడం సాధారణంగా సురక్షితంగా భావిస్తారు. అయితే రోజుకు మూడు నుంచి నాలుగు కప్పులకు మించి కాఫీ తాగే అలవాటు ఉంటే, తర్వాత దానిని తగ్గించినప్పుడు ఉపసంహరణ తలనొప్పులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మైగ్రేన్ విషయంలో కాఫీ కొందరికి ఉపశమనం ఇస్తుంది, మరికొందరికి సమస్యను పెంచుతుంది. కాబట్టి కాఫీ ప్రభావాన్ని గమనిస్తూ, మితంగా తీసుకోవడం, ఒక్కసారిగా మానేయకుండా అలవాట్లలో మార్పులు చేయడం ద్వారా మైగ్రేన్‌ను మెరుగ్గా నియంత్రించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

