తన కోపమే.. తనకు బరువు!
‘తన కోపమే తన శత్రువు..’ అని హెచ్చరించాడు సుమతీ శతకకారుడు. అనవసరమైన కోపంతో అవకాశాలు చేజారుతాయి. అయినవారు దూరమయ్యే ప్రమాదం ఉంది.
‘తన కోపమే తన శత్రువు..’ అని హెచ్చరించాడు సుమతీ శతకకారుడు. అనవసరమైన కోపంతో అవకాశాలు చేజారుతాయి. అయినవారు దూరమయ్యే ప్రమాదం ఉంది. వీటి సంగతి ఎలా ఉన్నా.. అలవికాని కోపం ప్రదర్శిస్తే… బరువు పెరుగుతారట. కోపానికి శరీర బరువుకు లంకె ఏంటని అనుకోవచ్చు! కానీ, ఇది ముమ్మాటికీ నిజమని ఓ అధ్యయనంలో తేటతెల్లమైంది.
అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏజింగ్ సంస్థ సుమారు రెండువేల మందిని పరిశీలించి తన పరిశోధన సారాంశాన్ని తెలియపరిచింది. ఆవేశం, భావోద్వేగాలు ఎక్కువగా ఉండేవాళ్లు, ఆవేశపరులు శారీరకంగా శ్రమ చేయడానికి ఇష్టపడరని పరిశోధకులు చెప్తున్నారు.
వీళ్లు తిండికి మాత్రం అధిక ప్రాధాన్యం ఇస్తారట. కోపంలో తిండి మీద నియంత్రణ కోల్పోతారు. ఇదే బరువు పెరగడానికి కారణమవుతున్నదనీ తీర్మానించారు పరిశోధకులు. కోపం వచ్చినప్పుడు వేగంగా నడవడమో, మరేదైనా శారీరక శ్రమ చేస్తే ఆవేశం చల్లారుతుందని సూచిస్తున్నారు. యోగా వల్ల కూడా లాభం ఉంటుందని సూచించారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

