Dry Fruits | మనల్ని అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచడం కోసం అనేక రకాల పోషకాహారాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో డ్రై ఫ్రూట్స్ కూడా ఒకటి. కిస్మిస్లు, అంజీర్, ఆలుబుఖర వంటివి డ్రై ఫ్రూట్స్ జాబితాకు చెందుతాయి. అంజీర్, ఆలుబుఖరతోపాటు యాప్రికాట్స్ కూడా మనకు డ్రై ఫ్రూట్స్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా అనేక డ్రై ఫ్రూట్స్‌ను చాలా మంది తింటుంటారు. డ్రై ఫ్రూట్స్‌ను తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. వీటిల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. పలు వ్యాధులను నయం చేయడంలోనూ డ్రై ఫ్రూట్స్ మనకు సహాయం చేస్తాయి. అయితే డ్రై ఫ్రూట్స్ ను రోజులో అసలు ఏ సమయంలో తినాలి..? ఎప్పుడు వీటిని తింటే మనకు అధిక శాతం లాభాలు కలుగుతాయి..? అని చాలా మందికి ప్రశ్నలు తలెత్తుతుంటాయి. ఇక ఇందుకు పోషకాహార నిపుణులు సమాధానాలు చెబుతున్నారు.
డ్రై ఫ్రూట్స్ లలో మన శరీరానికి కావల్సిన పోషకాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్లు ఎ, బి కాంప్లెక్స్, సితోపాటు పొటాషియం, మెగ్నిషియం, జింక్ వంటి మినరల్స్‌ను మనం డ్రై ఫ్రూట్స్ ద్వారా పొందవచ్చు. ఈ క్రమంలో ఈ పోషకాలు మనకు ఎంతో మేలు చేస్తాయి. పలు వ్యాధులను నయం చేసేందుకు సహాయం చేస్తాయి. అయితే డ్రై ఫ్రూట్స్ ను ఉదయం తింటేనే అధిక మొత్తంలో లాభాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఉదయం వీటిని బ్రేక్ ఫాస్ట్ తోపాటు కలిపి తీసుకోవాలని సూచిస్తున్నారు. దీని వల్ల అధిక మొత్తంలో పోషకాలు, ఆరోగ్యకర ప్రయోజనాలను పొందవచ్చని వారు అంటున్నారు.
రాత్రంతా మన శరీరానికి ఎలాంటి ఆహారం లభించదు. సుమారుగా 10 నుంచి 14 గంటల పాటు శరీరం ఉపవాస దశలో ఉంటుంది. కనుక ఉదయం పూట శరీరానికి పెద్ద ఎత్తున శక్తి అవసరం అవుతుంది. ఈ క్రమంలో డ్రై ఫ్రూట్స్ ను తినడం వల్ల ఆ శక్తిని చాలా వరకు భర్తీ చేయవచ్చు. పైగా ఉదయం నుంచి మనం పనుల్లో యాక్టివ్‌గా ఉంటాం. కొందరు శారీరక శ్రమ కూడా చేస్తుంటారు. కనుక ఉదయం మన శరీరానికి శక్తి అధికంగా అవసరం అవుతుంది. ఇలాంటి సమయంలో డ్రై ఫ్రూట్స్ ను తింటే కావల్సినంత శక్తి లభిస్తుంది. దీంతో రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. నీరసం, అలసట ఉండవు. బద్దకం పోతుంది. కనుక డ్రై ఫ్రూట్స్ ను ఉదయం పూట తింటేనే మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
అయితే ఉదయం పూట డ్రై ఫ్రూట్స్ ను తినేంత సమయం లేదని భావిస్తే వాటిని మీరు బాక్స్ లో పెట్టుకుని ఆఫీస్‌కు తీసుకెళ్లి తరువాత తినవచ్చు. ఇక అలా కూడా వీలు కావడం లేదని అనుకుంటే సాయంత్రం సమయంలో స్నాక్స్ రూపంలో తినాలి. కానీ ఆ సమయంలో మనకు పెద్దగా శక్తి అవసరం ఉండదు. కనుక డ్రై ఫ్రూట్స్ ను మోతాదుకు కాస్త తక్కువగా తినాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ ను తింటే మన శరీరంలో శక్తి స్థాయిలు ఎల్లప్పుడూ అధికంగానే ఉంటాయి. దీంతో నీరసం, అలసట అసలు రావు. ఉత్సాహంగా ఉండి చురుగ్గా పనిచేస్తారు. డ్రై ఫ్రూట్స్ ను ఇలా తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.