గుండె జబ్బులు ఉన్నవారు ఏరియల్ యోగా చేయకూడదా?
Aerial Yoga | యోగా ఒంటికి ఎంత మంచిదో ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. శారీరక రుగ్మతలతోపాటు, మానసిక సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తుందని అనేక అధ్యయనాలు నిరూపించాయి. ఆధునిక వైద్యానికి అనుబంధంగా యోగాను సిఫారసు చేస్తున్న నిపుణులూ ఎంతోమంది. ‘యోగా థెరపీ’ పేరుతో.. ప్రత్యామ్నాయ వైద్య విధానంగా కూడా గుర్తింపును తెచ్చుకుంటున్నది. యోగాకు అనుబంధంగా కొన్ని కొత్త ప్రక్రియలూ ప్రచారంలోకి వస్తున్నాయి. అందులో ఒకటి.. ఏరియల్ యోగా.
ఇందులో ఊయలలాంటి దానిలో వేలాడుతూ రకరకాల భంగిమల్లో యోగా చేస్తారు. ఏరియల్ యోగా ప్రత్యేకించి వెన్నునొప్పి, నడుమునొప్పి లాంటి వాటితో బాధపడేవారికి బాగా పనికొస్తుంది.
ఊయల సాయంతో చేస్తారు కాబట్టి.. కీళ్లు, వెన్ను మీద ఒత్తిడి పడదు. ఎముకలు, కండరాలు దృఢంగా తయారవుతాయి.
శ్వాసక్రియను మెరుగుపరిచి శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
బరువు తగ్గేందుకు కూడా ఏరియల్ యోగా పనికొస్తుంది. 45 నిమిషాల సమయంలో దాదాపు 400 కిలో కేలరీలు ఖర్చవుతాయి.
ఇందులోని కొన్ని ఆసనాలు గుండెకు బలాన్ని చేకూర్చడంతో పాటు రక్త ప్రసరణ మెరుగుపడేందుకు ఉపయోగపడతాయి.

కాకపోతే ఓ షరతు. గుండె జబ్బులు, అధిక రక్తపోటు, లో బీపీ, గ్లకోమా, ఆర్థరైటిస్లాంటి సమస్యలు ఉన్నవాళ్లు అసలు చేయకూడదు. పెద్ద ఆపరేషన్లు అయిన వాళ్లు, గర్భిణులు దూరంగా ఉండాలి. ఒక్కోసారి వీపు, భుజాలకు సంబంధించిన కండరాలు పట్టేస్తుంటాయి. కాబట్టి, తొలి దశలో నిపుణుల పర్యవేక్షణలోనే చేయాలి. వైద్యుల సలహా తప్పనిసరి. ఏ కొంత అసౌకర్యంగా అనిపించినా ఆపేయడం ఉత్తమం.
Read More :
పీరియడ్స్‌లో సమస్యలా? ఈ యోగాసనాలు వేస్తే మంచిదట!!”
ఈ ఐదింటిని రెగ్యులర్‌గా పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమే”
శివరాత్రికి యోగాకు ఉన్న సంబంధమేంటి?”
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Health
- Health news
- Yoga
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay | తమిళ సినీ పరిశ్రమకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్.. రోజుకు ఆరు షోలకు అనుమతి,కాని దానికి మాత్రం నో!
Kiran Abbavaram | బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసే ‘సమ్మర్ హాలిడేస్’.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి పిలుపు ప్రత్యేకం.. ఒక్కో ఆహ్వాన పత్రిక ఖర్చు రూ.20 వేల వరకు!
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
EAPCET Office | గెస్ట్‌హౌస్‌గా ఎప్‌సెట్ ఆఫీస్.. అడ్మిషన్ల వేళ జేఎన్టీయూ సంచలన నిర్ణయం!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

