Maha Shivaratri 2022 | శివరాత్రికి యోగాకు ఉన్న సంబంధమేంటి?
Maha Shivaratri 2022 | మహా శివరాత్రి భారతదేశ ఆధ్యాత్మికతలో ఎంతో ప్రముఖమైంది. భారతీయ సంస్కృతిలో ప్రతి రోజూ పండుగే! ఈ పర్వాలు వేర్వేరు కారణాల కోసం, జీవితంలోని వేర్వేరు ప్రయోజనాల కోసం నిర్దేశించినవి. చారిత్రక సంఘటనలు, విజయాలకు సూచనగా, విత్తనాలు నాటడం, పంటకోత వంటి సందర్భాలను వేడుకగా జరుపుకొనేవారు. మహాశివరాత్రికి మాత్రం ప్రత్యేక విశిష్టత ఉంది.
చాంద్రమానంలో ప్రతినెల అమావాస్యకు ముందురోజును శివరాత్రి అంటారు. ఇలా ఏడాదికి పన్నెండు శివరాత్రులు వస్తుంటాయి. మాఘ మాసంలో (ఫిబ్రవరి-మార్చి) వచ్చే శివరాత్రికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ రాత్రి, భూమి ఉత్తర అర్ధగోళం ఉండేస్థితి కారణంగా మనిషిలోని శక్తి సహజంగా ఉప్పొంగుతుంది. ఈ రోజున ప్రకృతి మనల్ని ఆధ్యాత్మిక శిఖరానికి నెట్టుతుంది. దీనిని ఉపయోగించుకోవడానికే, ఈ సంస్కృతిలో రాత్రంతా జరిపే ఈ పండుగను నెలకొల్పారు. మనం తెల్లవార్లూ జాగారం చేసి మన వెన్నెముకను నిటారుగా ఉంచడం ద్వారా.. శక్తులు సహజంగా పైకి ఎగసిపడటానికి సహకరించొచ్చు.
ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి మహాశివరాత్రి ఎంతో ప్రముఖమైనది. కుటుంబ జీవితంలో ఉన్నవారు, మహాశివరాత్రిని శివుడి పెళ్లిరోజుగా చూస్తారు. ప్రాపంచిక లక్ష్యాలతో ఉన్నవాళ్లు, శివుడు తన శత్రువులందరినీ జయించిన రోజుగా భావిస్తారు. కానీ, సన్యాసులకు మాత్రం శివరాత్రి శివుడు కైలాస పర్వతంతో ఏకమైన రోజు. ఆయన పరిపూర్ణ నిశ్చలత్వంతో, పర్వతంలా మారిపోయిన రోజు. కానీ, యోగ సంప్రదాయంలో శివుణ్ని దేవుడిగా భావించరు, యోగ శాస్ర్తానికి మూలకారకుడైన ఆదియోగిగా, ఆదిగురువుగా చూస్తారు. ధ్యానంలో ఎన్నో వేల సంవత్సరాలు ఉన్న ఆయన ఒకరోజు సంపూర్ణంగా నిశ్చలుడయ్యాడు. అదే మహాశివరాత్రి. అందుకే ఈ పర్వాన్ని సన్యాసులు నిశ్చలత్వానికి ప్రతీకమైన రాత్రిగా చూస్తారు.
ఇతిహాసాలను పక్కనపెడితే , శివరాత్రికి యోగ సంప్రదాయంలో ఇంత ప్రాముఖ్యం, ఆధ్యాత్మిక సాధకునికి ఇది కల్పించే అవకాశాల వల్ల వచ్చిందే. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఎన్నో దశల అధ్యయనం తర్వాత ఈ రోజును ‘మీకు జీవంగా తెలిసిన ప్రతిదీ, ప్రతీ పదార్థం, దాని ఉనికి, మీకు తెలిసిన జగత్తు ఇంకా పాలపుంతలు, ఇవన్నీ కూడా కేవలం ఒకే శక్తి వివిధ లక్షల రూపాల వ్యక్తీకరణ’ అని నిరూపిస్తున్నది. ఈ శాస్త్రీయ వాస్తవం ప్రతి యోగిలో ఒక అనుభవపూర్వక వాస్తవికత. యోగి అనే పదానికి అర్థం ఈ ఉనికి ఏకత్వాన్ని గ్రహించినవాడని. యోగ అంటే దాని అర్థం ఒక అభ్యాసమో లేక పద్ధతో అని కాదు. అవ్యవస్థలో ఉన్న ఏకత్వం గురించి తెలుసుకోవాలనే అన్ని కోరికలు, ఈ ఉనికిలో ఉన్న ఏకత్వాన్ని గురించి తెలుసుకోవాలనే వాంఛలు ఉంటే – అదే యోగ. దీనిని అనుభవపూర్వకంగా ఆస్వాదించడానికి మహాశివరాత్రి ఓ అవకాశాన్ని అందిస్తుంది.
ప్రేమాశీస్సులతో సద్గురు ఈశా ఫౌండేషన్
Read More :
Maha shivaratri 2022 | కాశీకి వెళ్తే 9 రాత్రులు నిద్ర చేయాలని అంటారు.. ఎందుకు
Maha Shivaratri 2022 | వేములవాడ రాజన్నకు కోడె మొక్కులు ఎందుకు చెల్లిస్తారు?
ఇంట్లో రెండు శివలింగాలు ఉంటే ఏమవుతుంది?
పారిజాత పుష్పాలు కిందపడినా దేవుడికి పెడతారు ఎందుకు?
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | గుండె పదిలంగా ఉండాలంటే వంటలో తరచూ ఈ మార్పులు చేయాల్సిందే..!
AP News | జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపే పోలింగ్.. సర్వం సిద్ధం చేశామన్న ఎన్నికల కమిషనర్..!
Supreme Court Bench | చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయండి.. ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ
Iran | భారత నౌకలకు హర్మూజ్‌లో ప్రత్యేక మినహాయింపు ఇచ్చిన ఇరాన్..!
Panchayat Secretaries | డోన్ట్ కేర్.. హాజరు వేసుకొని ఇంటికెళ్తున్న పంచాయతీ కార్యదర్శులు..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

