Reverse Diet | ప్రస్తుతం చాలా మంది అనేక రకాల డైట్లను పాటిస్తున్నారు. ఏ డైట్‌ను పాటించినా ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటున్నారు. అందులో భాగంగానే అందుబాటులో ఉన్న రకరకాల డైట్లను చాలా మంది అనుసరిస్తున్నారు. ఒక్కో డైట్లో భాగంగా భిన్న రకాల ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కీటో డైట్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ డైట్, మెడిటరేనియన్ డైట్, డాష్ డైట్.. ఇలా రకరకాల డైట్లను చాలా మంది పాటిస్తున్నారు. అయితే ప్రస్తుతం రివర్స్ డైట్ అనే పదం కూడా ఎక్కువగా వినిపిస్తోంది. ఇంతకీ అసలు రివర్స్ డైట్ అంటే ఏమిటి..? దీన్ని ఎలా పాటించాలి..? దీంతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.. అని చాలా మంది ఆలోచిస్తుంటారు. ఇందుకు పోషకాహార నిపుణులు సమాధానాలు చెబుతున్నారు.
రివర్స్ డైట్ అంటే ఏమీ లేదు.. ఒక డైట్‌ను పాటించిన తరువాత మరో డైట్‌ను పాటించడం. అంటే చాలా మంది ఒకే డైట్‌ను చాలా కాలం పాటు పాటిస్తారు. కానీ రివర్స్ డైట్ అలా కాదు. ఒక డైట్‌ను కొన్ని రోజుల పాటు పాటిస్తారు. ఆ సమయం ముగియగానే వెంటనే ఇంకో డైట్‌ను మొదలుపెడతారు. ఇలా అన్ని రకాల డైట్లను కొన్ని రోజుల పాటు పాటిస్తూ వెంట వెంటనే ఇంకో డైట్‌ను పాటించడం మొదలు పెడతారు. దీన్నే రివర్స్ డైట్ అంటారు. రివర్స్ డైట్ అంటే ప్రత్యేకంగా ఆహారాలను తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ అన్ని రకాల డైట్లను వెంట వెంటనే కొన్ని రోజుల పాటు పాటిస్తారన్నమాట. దీన్నే రివర్స్ డైట్ అంటారు. ప్రస్తుతం రివర్స్ డైట్‌కు ప్రజల నుంచి ఆదరణ బాగానే లభిస్తోంది. ఒక డైట్‌ను పాటిస్తే కొన్ని లాభాలే కలుగుతాయి. కానీ రివర్స్ డైట్లో అన్ని రకాల డైట్లను తరచూ పాటిస్తుంటారు. కనుక అన్ని రకాలుగా లాభాలను పొందవచ్చు. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.
రివర్స్ డైట్‌ను ప్రస్తుతం రోజూ వ్యాయామం చేసేవారు, జిమ్ చేసేవారు, బాడీ బిల్డర్లు, బాక్సర్లు పాటిస్తున్నారు. చాలా మంది సెలబ్రిటీలు కూడా రివర్స్ డైట్‌ను అనుసరిస్తున్నారు. దీని వల్ల అనేక ఫలితాలు కలుగుతున్నాయని కూడా వారు చెబుతున్నారు. రివర్స్ డైట్‌పై కొందరు సైంటిస్టులు గతంలో అధ్యయనం కూడా చేపట్టారు. దీని ప్రకారం రివర్స్ డైట్‌ను పాటిస్తుంటే ఇతర డైట్ల కన్నా ఫలితాలు చాలా త్వరగా వస్తాయని అంటున్నారు. అంటే అధిక బరువు తగ్గడం, షుగర్ లెవల్స్, బీపీ, కొలెస్ట్రాల్ స్థాయిలు కంట్రోల్ అవడం వంటి ఫలితాలను చాలా త్వరగా రాబట్టవచ్చని చెబుతున్నారు. కనుక రివర్స్ డైట్‌ను అందరూ పాటిస్తే మంచిదని వారు సూచిస్తున్నారు.
రివర్స్ డైట్‌ను పాటించడం వల్ల అనుకున్న ఫలితాలను త్వరగా రాబట్టవచ్చు. అలాగే శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. యాక్టివ్‌గా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. నీరసం, అలసట తగ్గుతాయి. బద్దకం పోతుంది. శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు త్వరగా తగ్గుతారు. రివర్స్ డైట్‌ను పాటిస్తే ఆకలిపై నియంత్రణ ఏర్పడుతుంది. జంక్ ఫుడ్ తినకుండా సురక్షితంగా ఉంటారు. ఆహారాలను తినడంపై నియంత్రణ వస్తుంది. కేవలం ఆరోగ్యకరమైన ఆహారాలను మాత్రమే తింటారు. ఈ డైట్ వల్ల ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు తగ్గుతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది. నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి తగ్గుతుంది. ఇలా రివర్స్ డైట్‌ను తరచూ పాటించడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.