Guptha Padmasana | గుప్త పద్మాసనం అంటే ఏమిటి.. ఎలా వేయాలి.. దీని వల్ల కలిగే లాభాలేమిటి..?
ఎక్కువసేపు కూర్చోవడం, తెరల ముందు ఎక్కువ సమయం గడపడం, రోజువారీ ఒత్తిడి కారణంగా శరీరం బిగుతుగా మారి, మనసు అలసిపోతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో యోగా శరీరానికి, మనసుకు ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది.
Guptha Padmasana | ఎక్కువసేపు కూర్చోవడం, తెరల ముందు ఎక్కువ సమయం గడపడం, రోజువారీ ఒత్తిడి కారణంగా శరీరం బిగుతుగా మారి, మనసు అలసిపోతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో యోగా శరీరానికి, మనసుకు ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది. యోగాసనాలు కేవలం శరీర సౌలభ్యాన్ని పెంచడమే కాకుండా, కీళ్ల కదలికలు, శరీరంపై అవగాహన, శరీర భంగిమను మెరుగుపరచడంలోనూ తోడ్పడతాయి. ఇటీవల గుప్త పద్మాసనం (హిడెన్ లోటస్ పోజ్) సాధనకు సంబంధించిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఆసనం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా చర్చనీయాంశమయ్యాయి.
ఐదు ముఖ్యమైన ప్రయోజనాలు..
గుప్త పద్మాసనం సాధనతో ఐదు ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది తుంటి, కటి భాగం, మోకాళ్లు, చీలమండల కదలికలు మెరుగుపడడం. ఈ ఆసనంలో ఆయా భాగాలకు సంబంధించిన కదలికలు, వశ్యత అవసరమవుతాయి. సరైన పద్ధతిలో సాధన చేస్తే ఈ భాగాల చలనశీలతను కాపాడుకోవచ్చు. రెండోది భుజాలు, మణికట్టులకు వ్యాయామం లభించడం. ఈ ఆసనంలో చేతులను ప్రత్యేకమైన భంగిమలో ఉంచాల్సి ఉంటుంది. దీనివల్ల భుజాలు, మణికట్టు కీళ్ల కదలికలు, వశ్యత మెరుగుపడేందుకు తోడ్పడుతుంది.
శరీరానికి లభించే సాగతీత..
మూడో ప్రయోజనం ఛాతీ, భుజాల కండరాలకు సాగతీత లభించడం. ఎక్కువసేపు కూర్చోవడం, తెరలను చూస్తూ ఉండడం వల్ల ఛాతీ, భుజాల భాగాల్లో బిగుతు ఏర్పడుతుంది. ఈ ఆసనంలోని చేతులు, పై శరీర భాగం ఉండే భంగిమ వల్ల ఆయా ప్రాంతాలకు సాగతీత లభిస్తుంది. నాలుగోది శరీర భంగిమ మెరుగుపడడానికి సహాయపడడం. ఛాతీ, భుజాలు విస్తరించేలా ఉండే ఈ ఆసనం వల్ల పై వీపు ముందుకు వంగిపోయే అలవాటును తగ్గించుకోవడానికి తోడ్పడుతుంది. అయితే మెరుగైన శరీర భంగిమ కోసం యోగాతోపాటు కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు, కీళ్ల కదలికలకు సంబంధించిన సాధనలు కూడా అవసరం.
శరీరంపై పెరిగే అవగాహన..
ఐదోది శరీరంపై అవగాహన పెరగడం. గుప్త పద్మాసనం క్లిష్టమైన ఆసనం కావడంతో శరీర కదలికలపై నియంత్రణ, ఏకాగ్రత, మన శరీర పరిమితులపై అవగాహన అవసరం. ఈ విధమైన శ్రద్ధతో యోగా సాధన చేయడం వల్ల శారీరక కదలికలకు, మానసిక ఏకాగ్రతకు మధ్య సమతుల్యత పెరుగుతుంది. అయితే ప్రారంభకులు నేరుగా ఈ క్లిష్టమైన ఆసనాన్ని ప్రయత్నించకూడదు. ముందుగా తుంటి, భుజాలు, చీలమండల కదలికలు మెరుగుపడేలా సాధనలు చేయాలి. శరీర సామర్థ్యాన్ని బట్టి క్రమంగా ముందుకు సాగాలని యోగా నిపుణులు తెలియజేస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Guptha Padmasana | గుప్త పద్మాసనం అంటే ఏమిటి.. ఎలా వేయాలి.. దీని వల్ల కలిగే లాభాలేమిటి..?
IND vs PAK | దాయాదుల సమరం.. అండర్-19 ఆసియాకప్ ఫైనల్లో టాస్ గెలిచిన పాక్!
Bilal Kazi: 70 మంది అమ్మాయిలకు వేధింపులు.. బ్రిటన్‌లో భారతీయుడికి 30 ఏళ్ల జైలుశిక్ష
Dhanush | ధనుష్ ‘ఓఎం’ ట్రైలర్లో ‘ధురంధర్’, ‘అవతార్’ ఛాయలు.. కథపై ఆసక్తికర చర్చ!
Megaverse | మెగాస్టార్ చిరంజీవి ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్.. ‘మెగావర్స్’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

