Dhanush | ధనుష్ ‘ఓఎం’ ట్రైలర్లో ‘ధురంధర్’, ‘అవతార్’ ఛాయలు.. కథపై ఆసక్తికర చర్చ!
Dhanush | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఓఎం’ (OM) ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో అంచనాల మధ్య తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్, ఎమోషన్స్, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో సాగిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ముఖ్యంగా ఈ చిత్రంలో మమ్ముట్టి, సాయి పల్లవి కీలక పాత్రల్లో నటిస్తుండటం విశేషం. ఇక శ్రీలీల కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది.
Dhanush | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఓఎం’ (OM) ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో అంచనాల మధ్య తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్, ఎమోషన్స్, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో సాగిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ముఖ్యంగా ఈ చిత్రంలో మమ్ముట్టి, సాయి పల్లవి కీలక పాత్రల్లో నటిస్తుండటం విశేషం. ఇక శ్రీలీల కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. ‘ఓఎం’ ట్రైలర్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఈ సినిమా కథలో ‘ధురంధర్’, హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘అవతార్’ చిత్రాల ఛాయలు కనిపిస్తున్నాయని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కథలో హీరోకు అప్పగించే రహస్య ఆపరేషన్, ఆ తర్వాత చోటుచేసుకునే పరిణామాలు ఈ పోలికలకు కారణమయ్యాయి.
ట్రైలర్‌ను గమనిస్తే.. ధనుష్ పోషిస్తున్న పాత్రకు శత్రువుల కదలికలను గమనించి, వారి గురించి రహస్య సమాచారాన్ని సేకరించే బాధ్యత అప్పగించినట్లు కనిపిస్తోంది. ఇందుకోసం ఆయనకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నట్లు సన్నివేశాలు చూపించారు. ఈ శిక్షణ సన్నివేశాలు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ధురంధర్’ సినిమాలో రణ్వీర్ సింగ్ పాత్రను గుర్తు చేస్తున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ట్రైలర్ చివరి భాగంలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు మరో ఆసక్తికరమైన చర్చకు కారణమయ్యాయి. మొదట రహస్య ఆపరేషన్ కోసం వెళ్లిన ధనుష్.. చివరకు తనకు అప్పగించిన బాధ్యతకు భిన్నంగా అదే పోలీసు బలగాలకు ఎదురుతిరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ పరిణామాలు హాలీవుడ్ చిత్రం ‘అవతార్’ కథను గుర్తు చేస్తున్నాయని కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
‘అవతార్’ సినిమాలో కథానాయకుడు మొదట ఒక రహస్య మిషన్‌లో భాగంగా నావీ ప్రజల వద్దకు వెళ్తాడు. అయితే అక్కడి ప్రజలపై జరుగుతున్న దాడులు, అన్యాయాలను ప్రత్యక్షంగా చూసిన తర్వాత వారి పట్ల సానుభూతి పెంచుకుంటాడు. చివరకు తన సొంత బలగాలకే ఎదురుతిరిగి నావీ ప్రజల పక్షాన నిలబడతాడు. ఇప్పుడు ‘ఓఎం’ ట్రైలర్లోనూ ఇలాంటి తరహా పరిణామాలు కనిపిస్తున్నాయని నెటిజన్లు పోల్చి చూస్తున్నారు. అయితే కేవలం కథలోని కొన్ని అంశాలు ఒకేలా కనిపించినంత మాత్రాన సినిమా ఫలితాన్ని ముందుగానే అంచనా వేయలేం. ఒక కథను తెరపై ఎలా ఆవిష్కరించారు? కథనం ఎంత ఆసక్తికరంగా సాగుతుంది? పాత్రల మధ్య సంఘర్షణను ఎంత బలంగా చూపించారు? అనేవే ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ విషయంలో దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. గతంలో శివకార్తికేయన్ హీరోగా ఆయన తెరకెక్కించిన ‘అమరన్’ మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఎమోషనల్ కథనాన్ని, యాక్షన్ అంశాలను సమతూకంతో చూపించడంలో రాజ్‌కుమార్ పెరియసామి తన ప్రతిభను నిరూపించుకున్నారు. దీంతో ‘ఓఎం’ సినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush | ధనుష్ ‘ఓఎం’ ట్రైలర్లో ‘ధురంధర్’, ‘అవతార్’ ఛాయలు.. కథపై ఆసక్తికర చర్చ!
Megaverse | మెగాస్టార్ చిరంజీవి ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్.. ‘మెగావర్స్’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
US Flight Shutdown | సైబర్ దాడి భయమా?.. మైక్రోసాఫ్ట్ అంతరాయంతో సంబంధమా? అమెరికాలో విమానాల నిలిపివేతకు అసలు కారణమేంటి?
Suicide: వీడియోకాల్‌లో గర్ల్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతూ బాయ్‌ఫ్రెండ్ సూసైడ్.. ఆ తర్వాత ఆమె కూడా
US Flight Shutdown | అమెరికాలో విమానాలన్నీ బంద్.. 15 లక్షల మంది ప్రయాణికులకు కష్టాలు! అసలేం జరిగింది?
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

