Suicide: వీడియోకాల్‌లో గర్ల్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతూ బాయ్‌ఫ్రెండ్ సూసైడ్.. ఆ తర్వాత ఆమె కూడా
Suicide: వాట్సాప్ వీడియోకాల్‌లో మాట్లాడుకున్నారు. సడెన్‌గా భాయ్‌ఫ్రెండ్ సీలింగ్‌కు ఉరేసుకున్నాడు. ఆ షాక్‌లో గర్ల్‌ఫ్రెండ్ కూడా ఉరేసుకున్నది. యువ జంట బలవన్మరణానికి పాల్పడిన ఘటన బెంగాల్లో జరిగింది.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ఓ యువ జంట బలవన్మరణాని(Suicide)కి పాల్పడింది. గర్ల్‌ఫ్రెండ్‌తో వాట్సాప్ వీడియోకాల్‌లో మాట్లాడుతూనే.. 18 ఏళ్ల యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లైవ్‌లో ఆ ఘటన చూసిన ఆ అమ్మాయి కూడా ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు చెందిన వివరాలు ఇలా ఉన్నాయి. జీత్ బిశ్వాస్, పూజా మోండల్.. ఇద్దరూ 18 ఏళ్లు ఉంటారు. నార్త్ 24 పరగనాస్‌లోని అశోక్‌నగర్‌లో ఉన్న సెందంగ చతుర్దాస్పల్లి హై స్కూల్లో 12వ తరగతి చదువుతున్నారు. ఆ ఇద్దరూ ఒకే దగ్గర ట్యూషన్ వెళ్లేవారు. పూజాకు జీత్ వీడియో కాల్ చేశాడని, అతను సీలింగ్‌కు ఉరి వేసుకోగానే, అది చూసిన పూజా కూడా ఉరి వేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.
పూజ ఇంట్లోవాళ్లు ఆమె కోసం తలుపును పగులగొట్టారు. అయితే ఉరి వేసుకున్న పూజాను చూసి కుటుంబసభ్యులు షాక్ అయ్యారు. ఇంకా అప్పటికి ఆమె వాట్సాప్ వీడియోకాల్ ఆన్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఆ స్క్రీన్‌లో ఓ అబ్బాయి ఉరి వేసుకుని ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆ వీడియో కాల్ ఆధారంగానే పూజ లవ్‌లో ఉన్నట్లు తెలుసుకున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.
జిల్లా పోలీసులు ఇద్దరి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. అయితే జీత్, పూజా చాన్నాళ్లుగా రిలేషన్లో ఉన్నట్లు క్లాస్మేట్స్ చెప్పారు. జీత్ ఇంట్లో పెళ్లికి వ్యతిరేకంగా ఉన్నట్లు తెలిసిందని ఓ విద్యార్థి తెలిపారు. కానీ పూజ ఇంట్లో ఆ అబ్బాయి గురించి ఏమీ తెలియదన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suicide: వీడియోకాల్‌లో గర్ల్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతూ బాయ్‌ఫ్రెండ్ సూసైడ్.. ఆ తర్వాత ఆమె కూడా
US Flight Shutdown | అమెరికాలో విమానాలన్నీ బంద్.. 15 లక్షల మంది ప్రయాణికులకు కష్టాలు! అసలేం జరిగింది?
Pawan Kalyan | పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు మరో సినిమా.. వకీల్ సాబ్ కాంబో రిపీట్ అవుతుందా?
మద్యం మత్తులో పోలీసుల కారు బీభత్సం.. ట్రాలీని ఢీకొట్టి బాధితులకు బెదిరింపులు!
Ramayana | తమిళనాడులోనూ ‘రామాయణ’ ప్రభంజనం.. సూర్య ‘సీన్’ను మించిన రణ్‌బీర్ సినిమా!
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

