US Flight Shutdown | సైబర్ దాడి భయమా?.. మైక్రోసాఫ్ట్ అంతరాయంతో సంబంధమా? అమెరికాలో విమానాల నిలిపివేతకు అసలు కారణమేంటి?
US Flight Shutdown | అగ్రరాజ్యం అమెరికా విమానయాన రంగంలో ఈ సంక్షోభం ఎందుకు తలెత్తింది? దీని వెనుక సైబర్ దాడి ఉందా? 9/11 తరహా ఉగ్రదాడి ముప్పు ఏమైనా ఉందా? లేక ఇటీవల మైక్రోసాఫ్ట్ సేవల్లో తలెత్తిన అంతరాయంతో సంబంధముందా? అనే సందేహాలు జనాల్లో మొదలయ్యాయి.
US Flight Shutdown | అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నట్టుండి విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా కలకలం రేగింది. అసలు విమానయాన రంగంలో ఈ సంక్షోభం ఎందుకు తలెత్తింది? దీని వెనుక సైబర్ దాడి ఉందా? 9/11 తరహా ఉగ్రదాడి ముప్పు ఏమైనా ఉందా? లేక ఇటీవల మైక్రోసాఫ్ట్ సేవల్లో తలెత్తిన అంతరాయంతో సంబంధముందా? అనే సందేహాలు జనాల్లో మొదలయ్యాయి. ఈ అనుమానాలపై అమెరికా అధికారులు స్పష్టతనిచ్చారు. ఇప్పటివరకు సైబర్ దాడికి సంబంధించిన ఆధారాలేవీ లేవని, పాత టెలికమ్యూనికేషన్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపమే విమానాల నిలిపివేతకు ప్రాథమిక కారణమని వెల్లడించారు.
విమానాల రాకపోకలను నియంత్రించే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో ఉపయోగిస్తున్న పాత టెలికమ్యూనికేషన్ పరికరాలపై ఒక్కసారిగా అధిక డేటా భారం పడిందని అమెరికా రవాణా శాఖ మంత్రి సీన్ డఫీ వివరించారు. దీంతో స్విచ్‌లు, రౌటర్లు సరిగా పనిచేయక సమాచార ప్రసారంలో అసమానతలు ఏర్పడ్డాయని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో కమ్యూనికేషన్, రాడార్ వ్యవస్థల పనితీరుపైనా ప్రభావం పడిందన్నారు. విమానాల భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు అధికారులు దేశవ్యాప్తంగా విమానాల బయలుదేరడాన్ని తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చిందని చెప్పారు.
ఈ వ్యవస్థను పూర్తిస్థాయిలో ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని డఫీ అభిప్రాయపడ్డారు. ఇందుకు అవసరమైన నిధులను కేటాయించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాంగ్రెస్‌ను కోరినట్లు తెలిపారు. కీలకమైన విమానయాన వ్యవస్థకు తాత్కాలిక మరమ్మతులు సరిపోవని, పాత పరికరాల స్థానంలో ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశం కాదని, అమెరికా ప్రజల భద్రతకు సంబంధించిన విషయమని స్పష్టం చేశారు.
సైబర్ దాడి కాదు.. మరో 9/11 అంతకంటే కాదు!
విమానాల నిలిపివేత వెనుక సైబర్ దాడి ఉందనే అనుమానాలపై హోంల్యాండ్ సెక్యూరిటీ చీఫ్ మార్క్వేన్ ముల్లిన్ స్పందించారు. ఇప్పటివరకు అమెరికాపై దురుద్దేశపూర్వక దాడి జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. ప్రస్తుతానికి ఇది టెలికమ్యూనికేషన్ వ్యవస్థలో ఏర్పడిన అంతరాయంగానే కనిపిస్తోందన్నారు. అయితే దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే పూర్తి స్పష్టత వస్తుందని తెలిపారు.
ఇటీవల మైక్రోసాఫ్ట్ సేవల్లో ఏర్పడిన అంతరాయంతో ప్రస్తుత ఘటనకు సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇదే సమయంలో 2001 సెప్టెంబర్ 11 ఉగ్రదాడులతో ఈ ఘటనను పోల్చవద్దని ముల్లిన్ అన్నారు. ‘ఇది మరో 9/11 ఘటన కాదు’ అని స్పష్టం చేశారు. అప్పటి ఉగ్రదాడుల తర్వాత అమెరికాలో విమానయాన వ్యవస్థపై విధించిన ఆంక్షలతో ప్రస్తుత సాంకేతిక అంతరాయాన్ని ఒకేలా చూడకూడదని పేర్కొన్నారు.
The journalist didn’t put Secretary Duffy on the spot. DHS Secretary Markwayne Mullin was the one who gestured to Duffy and asked him to answer the question about a possible cyberattack. Watch Mullin’s hand gesture in the video you posted — it clearly shows that he was directing Duffy to respond.
— Ahmad A. Sharqawi (@SharqawiAhmad) November 14, 2026
9/11 తర్వాత రెండోసారి.. గాల్లోనే 4 వేలకుపైగా విమానాలు
2001 సెప్టెంబర్ 11 ఉగ్రదాడుల తర్వాత అమెరికాలో దేశవ్యాప్తంగా విమానాల బయలుదేరడాన్ని నిలిపివేయడం ఇది రెండోసారి. 2023 జనవరిలోనూ ఎఫ్ఏఏకు చెందిన పైలట్ల భద్రతా సమాచార వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తడంతో దేశీయ విమానాల టేకాఫ్‌లను తాత్కాలికంగా నిలిపివేశారు. అప్పట్లో దాదాపు రెండు గంటలలోపే ఆంక్షలు ఎత్తివేశారు. తాజాగా మరోసారి కమ్యూనికేషన్ వ్యవస్థలో సమస్య తలెత్తడంతో దేశవ్యాప్తంగా విమానయాన కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది.
ఈసారి పరిస్థితి మరింత తీవ్రంగా కనిపించింది. విమానాల బయలుదేరడంపై ఆంక్షలు విధించే సమయానికి 4 వేలకుపైగా విమానాలు గాల్లోనే ఉన్నాయి. ఇప్పటికే ప్రయాణంలో ఉన్న విమానాల రాకపోకలు కొనసాగినప్పటికీ, విమానాశ్రయాల నుంచి బయలుదేరాల్సిన సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు విమానాశ్రయాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అమెరికన్ ఎయిర్‌లైన్స్ కూడా విమాన సర్వీసులపై రోజంతా ప్రభావం ఉండవచ్చని హెచ్చరించింది.
ఎఫ్ఏఏ నిషేధాన్ని ఎత్తివేసి విమానాల టేకాఫ్‌లకు అనుమతించినప్పటికీ, నిలిచిపోయిన సర్వీసులన్నీ తిరిగి షెడ్యూల్ ప్రకారం నడవడానికి సమయం పట్టనుంది. ఇప్పటికే ఏర్పడిన ఆలస్యాలు, విమానాల మార్గాల్లో మార్పుల ప్రభావం మరికొన్ని రోజులపాటు కొనసాగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Flight Shutdown | సైబర్ దాడి భయమా?.. మైక్రోసాఫ్ట్ అంతరాయంతో సంబంధమా? అమెరికాలో విమానాల నిలిపివేతకు అసలు కారణమేంటి?
Suicide: వీడియోకాల్‌లో గర్ల్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతూ బాయ్‌ఫ్రెండ్ సూసైడ్.. ఆ తర్వాత ఆమె కూడా
US Flight Shutdown | అమెరికాలో విమానాలన్నీ బంద్.. 15 లక్షల మంది ప్రయాణికులకు కష్టాలు! అసలేం జరిగింది?
Pawan Kalyan | పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు మరో సినిమా.. వకీల్ సాబ్ కాంబో రిపీట్ అవుతుందా?
మద్యం మత్తులో పోలీసుల కారు బీభత్సం.. ట్రాలీని ఢీకొట్టి బాధితులకు బెదిరింపులు!
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

