Megaverse | మెగాస్టార్ చిరంజీవి ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్.. ‘మెగావర్స్’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Megaverse | టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దాలుగా తనదైన నటన, డ్యాన్స్, కామెడీ, యాక్షన్‌తో కోట్లాది మంది అభిమానులను అలరిస్తున్న ఆయన.. వెండితెరపై తిరుగులేని స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నారు. అయితే ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో చిరంజీవి ఓటీటీ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు.
Megaverse | టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దాలుగా తనదైన నటన, డ్యాన్స్, కామెడీ, యాక్షన్‌తో కోట్లాది మంది అభిమానులను అలరిస్తున్న ఆయన.. వెండితెరపై తిరుగులేని స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నారు. అయితే ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో చిరంజీవి ఓటీటీ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ నిరీక్షణకు తెరపడనుంది. మెగాస్టార్ త్వరలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ద్వారా డిజిటల్ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. చిరంజీవి ఓటీటీ ఎంట్రీ కోసం నెట్‌ఫ్లిక్స్ ఓ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘మెగావర్స్’ పేరుతో ఈ టాక్ షోను రూపొందిస్తున్నారు. సాధారణ టాక్ షోలకు భిన్నంగా మెగాస్టార్ స్టైల్, ఆయన మాటతీరు, సినీ అనుభవాలు, ఆసక్తికరమైన సంభాషణలతో ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఈ షోకు సంబంధించి పలు ఎపిసోడ్ల షూటింగ్ కూడా పూర్తయినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక ఈ కార్యక్రమంలో చిరంజీవి ఎలాంటి విషయాలను పంచుకోబోతున్నారు? ఆయనతో పాటు ఎవరెవరు అతిథులుగా పాల్గొనబోతున్నారు? సినీ పరిశ్రమకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తాయా? అనే అంశాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా మెగాస్టార్‌ను ఒక టాక్ షో హోస్ట్‌గా చూడటం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుందని చెప్పొచ్చు. వాస్తవానికి ‘మెగావర్స్’ తొలి ఎపిసోడ్‌ను దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని తొలుత భావించినట్లు వార్తలు వచ్చాయి. అయితే కొన్ని కారణాలతో ఈ కార్యక్రమం స్ట్రీమింగ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. డిసెంబర్ రెండో వారాంతంలో ‘మెగావర్స్’ తొలి ఎపిసోడ్‌ను స్ట్రీమింగ్కు తీసుకురావాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట.
అయితే ఈ స్ట్రీమింగ్ తేదీపై ఇప్పటివరకు నెట్‌ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో డిసెంబర్ రెండో వారంలోనే ఈ షో ప్రారంభమవుతుందా? లేక మరోసారి విడుదల తేదీలో మార్పులు ఉంటాయా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు వెండితెరపై తనదైన ముద్ర వేసిన చిరంజీవి.. ఇప్పుడు డిజిటల్ వేదికపై ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారనేది చూడాలి. ముఖ్యంగా ఆయన అభిమానులతో పాటు ఇతర సినీ ప్రేక్షకులు కూడా ఈ టాక్ షో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబర్ రెండో వారాంతంలో మెగాస్టార్ ఓటీటీ ప్రయాణం ప్రారంభం కానుంది. దీనిపై నెట్‌ఫ్లిక్స్ అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Megaverse | మెగాస్టార్ చిరంజీవి ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్.. ‘మెగావర్స్’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
US Flight Shutdown | సైబర్ దాడి భయమా?.. మైక్రోసాఫ్ట్ అంతరాయంతో సంబంధమా? అమెరికాలో విమానాల నిలిపివేతకు అసలు కారణమేంటి?
Suicide: వీడియోకాల్‌లో గర్ల్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతూ బాయ్‌ఫ్రెండ్ సూసైడ్.. ఆ తర్వాత ఆమె కూడా
US Flight Shutdown | అమెరికాలో విమానాలన్నీ బంద్.. 15 లక్షల మంది ప్రయాణికులకు కష్టాలు! అసలేం జరిగింది?
Pawan Kalyan | పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు మరో సినిమా.. వకీల్ సాబ్ కాంబో రిపీట్ అవుతుందా?
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

