Pawan Kalyan | పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు మరో సినిమా.. వకీల్ సాబ్ కాంబో రిపీట్ అవుతుందా?
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు నిర్మాత దిల్ రాజు ఓ ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. పవన్‌తో మరో సినిమా చేయాలనే తన కోరికను తాజాగా బయటపెట్టారు. వీరిద్దరి కాంబినేషన్లో మరో ప్రాజెక్ట్ రాబోతుందంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి.
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు నిర్మాత దిల్ రాజు ఓ ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. పవన్‌తో మరో సినిమా చేయాలనే తన కోరికను తాజాగా బయటపెట్టారు. వీరిద్దరి కాంబినేషన్లో మరో ప్రాజెక్ట్ రాబోతుందంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. పవన్‌ను తాను కలిసిన మాట వాస్తవమేనని, మరో సినిమా చేసే అవకాశం ఇవ్వాలని అడిగానని ఆయన వెల్లడించారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. SVC డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా విడుదలైన ‘రామాయణ’, ‘సీన్’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో దిల్ రాజు తాజాగా మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌తో భేటీ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనిపై స్పందించిన ఆయన.. పవన్‌ను కలిసిన మాట నిజమేనని స్పష్టం చేశారు. ఒక నిర్మాతగా, గతంలో ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని నిర్మించిన వ్యక్తిగా.. అవకాశం ఉంటే మరో సినిమా చేద్దామని అడగడానికే పవన్‌ను కలిసినట్లు తెలిపారు.మా ఇద్దరి ఫోటో మీరు చూసే ఉంటారు. మా ముఖాలు హ్యాపీగా ఉన్నాయి కదా.. అక్కడే మీకు ఆన్సర్ ఉంది. ‘వకీల్ సాబ్’ చేసిన తర్వాత కూడా, డెఫినెట్‌గా అవకాశం వచ్చినప్పుడు కళ్యాణ్ గారితో మరో అద్భుతమైన సినిమా చేయాలనేది నా ఇంటెన్షన్. దాని కోసం అడుగులు ముందుకు వేస్తాను. అది ఎలా షేప్ అవుతుందనేది నేను ఇప్పుడే మాట్లాడను. ప్రాపర్‌గా అంతా రెడీ అయినప్పుడు అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తాను” అని దిల్ రాజు పేర్కొన్నారు.
జనసేన పార్టీ స్థాపించిన తర్వాత పవన్ కళ్యాణ్ కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండి రాజకీయాలపై దృష్టి పెట్టారు. 2019 ఎన్నికల తర్వాత తిరిగి సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకుని ‘వకీల్ సాబ్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. 2021లో కరోనా పరిస్థితుల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో బ్రేక్ ఈవెన్ సాధించకపోయినా, మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా తర్వాత కూడా పవన్‌తో మరో ప్రాజెక్ట్ చేయాలనే ఆసక్తి దిల్ రాజులో కొనసాగుతోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇప్పటికే దర్శకుడు సుజీత్‌తో ‘ఓజీ 2’ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందనుందని, సంగీత దర్శకుడు తమన్‌తో కలిసి పవన్ ఓ వీడియోను కూడా విడుదల చేశారు. దీంతో ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్తుందని అభిమానులు ఆశించారు. అయితే దర్శకుడు సుజీత్ ప్రస్తుతం ‘బ్లడీ రోమియో’ సినిమాతో బిజీగా ఉండటంతో ‘ఓజీ 2’ షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపై స్పష్టత లేదు. మరోవైపు దిల్ రాజు కాంబినేషన్లో సినిమా చేయడానికి పవన్ నెలకు 10 నుంచి 15 రోజుల చొప్పున డేట్స్ ఇచ్చి, నాలుగు నెలల్లో చిత్రాన్ని పూర్తి చేయడానికి అంగీకరించారనే ప్రచారం కూడా వినిపిస్తోంది. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన వెలువడలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pawan Kalyan | పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు మరో సినిమా.. వకీల్ సాబ్ కాంబో రిపీట్ అవుతుందా?
మద్యం మత్తులో పోలీసుల కారు బీభత్సం.. ట్రాలీని ఢీకొట్టి బాధితులకు బెదిరింపులు!
Ramayana | తమిళనాడులోనూ ‘రామాయణ’ ప్రభంజనం.. సూర్య ‘సీన్’ను మించిన రణ్‌బీర్ సినిమా!
Mission Bhageeratha | కరువు కాలంలో ప్రమోషన్ల వివాదం.. మిషన్ భగీరథలో సీనియర్ల ఇంజినీర్లు గరంగరం!
RTC Season Pass | ఆర్టీసీ సీజన్ పాస్‌పై సండే ఫ్రీ.. 9 అదనపు సౌకర్యాలు, ప్రత్యేక రాయితీలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

