Bilal Kazi: 70 మంది అమ్మాయిలకు వేధింపులు.. బ్రిటన్‌లో భారతీయుడికి 30 ఏళ్ల జైలుశిక్ష
Bilal Kazi: బిలాల్ ఖాజీ అనే భారతీయ వ్యక్తికి .. బ్రిటన్‌లో 30 ఏళ్ల జైలుశిక్ష పడింది. సుమారు 70 మంది అమ్మాయిలను అతను వేధించాడు. అమ్మాయిలకు చెందిన శృంగారభరిత వీడియోలు, ఇమేజ్‌లు అతని వద్ద ఉన్నాయి.
లండన్: ముంబైకి చెందిన 27 ఏళ్ల బిలాల్ ఖాజీ(Bilal Kazi) అనే వ్యక్తికి .. బ్రిటన్‌లో 30 ఏళ్ల జైలుశిక్ష పడింది. సుమారు 70 మంది అమ్మాయిలను అతను వేధించాడు. అమ్మాయిలకు చెందిన శృంగారభరిత వీడియోలు, ఇమేజ్‌లు అతని వద్ద ఉన్నాయి. 10 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న గర్ల్స్ను బిలాల్ టార్గెట్ చేశారు. స్నాప్‌చాట్, వింక్, రాబ్లాక్స్ లాంటి సోషల్ మీడియా, గేమింగ్ ఫ్లాట్‌ఫామ్‌లను అతను వాడాడు. 2021 నుంచి 2025 మధ్య కాలంలో అతను అమ్మాయిలను వేధించినట్లు తెలుస్తోంది. కనీసం 20 ఏళ్లు అతను జైలు జీవితాన్ని అనుభవించాలి. ఆ తర్వాత అతను పెరోల్‌కు అర్హుడు అవుతాడు. కెమిస్ట్రీలో పీహెచ్డీ చేసేందుకు ఖాజీ బ్రిటన్ వెళ్లాడు. 37 అభియోగాలు నమోదు అయ్యాయి. చెస్టర్ క్రౌన్ కోర్టులో అతన్ని బంధించారు. అసభ్యకర చిత్రాలు పంపడం, బ్లాక్‌మెయిలింగ్ చేయడం, చిన్నారులను లైంగికంగా రెచ్చగొట్టినట్లు ఖాజీపై ఆరోపణలు ఉన్నాయి.
ఓ బాధితురాలు 2021 డిసెంబర్లో డెర్బిషైర్ పోలీసుల్ని ఆశ్రయించడంతో ఖాళీ బాగోతం బయటపడింది. ఖాజీతో స్నాప్‌చాట్‌లో మాట్లాడేదాన్ని అని ఓ 13 ఏళ్ల అమ్మాయి ఫిర్యాదు చేసింది. అయితే నిందితుడు ఖాజీ తాను కూడా 14 ఏళ్ల వ్యక్తినే అని చెప్పుకుంటూ ఆ వయసున్న అమ్మాయిలను ట్రాప్ చేశాడు. పరిచయం కాగానే, సెక్సువల్ సంభాషణ చేయడం, ఆ తర్వాత అసంబద్ధమైన ప్రశ్నలు వేసి, అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసేవాడని తెలిసింది. అయితే తనకు షేరింగ్ చేసిన ఫోటోలు, వీడియోలను సర్క్యూలేట్ చేస్తానని బెదిరించేవాడని ఓ అమ్మాయి తన ఫిర్యాదులో చెప్పింది.
ఖాజీ బాధితుల్లో 180 మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతని వద్ద ఉన్న డివైస్ నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. బాధితుల్లో 11 నుంచి 17 ఏళ్ల వయసున్న అమ్మాయిలు సుమారు 70 మంది ఉంటారని అధికారులు చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bilal Kazi: 70 మంది అమ్మాయిలకు వేధింపులు.. బ్రిటన్‌లో భారతీయుడికి 30 ఏళ్ల జైలుశిక్ష
Dhanush | ధనుష్ ‘ఓఎం’ ట్రైలర్లో ‘ధురంధర్’, ‘అవతార్’ ఛాయలు.. కథపై ఆసక్తికర చర్చ!
Megaverse | మెగాస్టార్ చిరంజీవి ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్.. ‘మెగావర్స్’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
US Flight Shutdown | సైబర్ దాడి భయమా?.. మైక్రోసాఫ్ట్ అంతరాయంతో సంబంధమా? అమెరికాలో విమానాల నిలిపివేతకు అసలు కారణమేంటి?
Suicide: వీడియోకాల్‌లో గర్ల్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతూ బాయ్‌ఫ్రెండ్ సూసైడ్.. ఆ తర్వాత ఆమె కూడా
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

