బుధవారం 20 జనవరి 2021
Health - Nov 23, 2020 , 22:37:46

వెన్నుముక సమస్యలు రావద్దంటే ఏం చేయాలి?

వెన్నుముక సమస్యలు రావద్దంటే ఏం చేయాలి?

ఒకప్పుడు యాభై ఏళ్లు పైబడితే గానీ ఎలాంటి అనారోగ్యం దరిచేరేది కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అలా లేదు. చిన్న వయసులో మోకాళ్ల నొప్పులు, వెన్నుముక సమస్యలు, మెడ నొప్పి లాంటివి వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా యువతలో.. నిజానికి యూత్ అంటే ఎంత ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉండాలి. కానీ ఈ మధ్య  యువతలో ప్రతి ఐదుగురిలో ఒకరికి వెన్నుముక సమస్యలు తలెత్తుతున్నాయి. దానికి కారణం మన డిజిటల్ లైఫ్ స్టైల్ కావచ్చు.. లేదా ఒకే చోట ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడం కావచ్చు. ప్రస్తుతం కోవిడ్ కారణంగా బయటకు కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉండి పనిచేయాల్సి వస్తుండటం కూడా కావచ్చు.

వెన్నుముక సమస్యలు ముఖ్య కారణాలు 

 • శారీరక శ్రమ (Suboptimal physical activity)
 • కూర్చునే భంగిమ, పడుకునే పద్ధతి సరిగా లేకపోవడం
 • హటాత్తుగా బరువులు మోసినప్పడు
 • ఎక్కువ వర్కౌట్స్ చేయడం
 • ఒబెసిటీ
 • చిన్నవయసులోనే గర్భవతి అవడం
 • ఆటలాడుండగా గాయపడటం

వీటిలో ఏం కారణం చేతైనా కావచ్చు .. కానీ దాదాపు నలుగురిలో ఒకరు వెన్నుముక నొప్పి, మెడ నొప్పులతో బాగా ఇబ్బంది పడుతున్నారు. 

అయితే యుక్త వయసులోనే ఇలాంటి ఒక సమస్యతో ఇబ్బంది పడటం యువతను చాలా బాధపడుతున్న విషయం.

దీనికి చాలా మంది కూర్చునే పొజిషన్ మార్చుకోవాలనీ.. ఎక్కువ సేపు అలాగే కూర్చోకుండా మధ్యమధ్యలో లేచి అటూ ఇటూ తిరుగుతూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. మరిన్ని నివారణ చర్యలు కూడా మనం తెలుసుకుందాం..

వెన్నుముక సమస్యలకు నివారణ ఏంటి

 • డ్యాన్స్ చేయడం
 • స్విమ్మింగ్
 • సైక్లింగ్
 • వాకింగ్
 • రన్నింగ్
 • యోగా

ఇలాంటివి చేసి పారాస్పైనల్ మజిల్స్ ను బలంగా తయారు చేసుకుంటే వెన్నుముక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇవన్నీ మీరు అరోబిక్ ఫిట్ నెస్ ని పెంపొందిస్తాయని వైద్యులు చెబుతున్నారు. వెన్నుముక సమస్య తీవ్రమైతే మాత్రం సర్జరీ చేయకతప్పదని కూడా చెబుతున్నారు. కాబట్టి సమస్య తీవ్రతరం కాకుండా ఉండేందుకు.. అసలు సమస్య రాకుండా ఉండేందుకు నిపుణులు చెబుతున్న నివారణ చర్యలు పాటిస్తే మేలు.


logo