HomeHealthWhat Are The Symptoms And Warning Signs Of Heart Attack How We Recognize Cardiac Arrest Earlier
Heart Attack | హార్ట్ఎటాక్ను ముందుగా ఎలా గుర్తించాలి?
ఛాతిలో అకస్మాత్తుగా వచ్చే నొప్పి ఛాతి మధ్య భాగంలో ఉంటుంది. మామూలుగా వచ్చే నొప్పులతో పోలిస్తే గుండె నొప్పి వందరెట్లు ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు ఎడమ చేయి లాగడం గుండెపోటు ముఖ్య లక్షణం.
2/8
ఎక్కువమందికి గుండె నొప్పి వచ్చినా దాన్ని గ్యాస్ నొప్పి అనుకొని ఏదో ట్యాబ్లెట్లు వాడుతుంటారు. ప్రమాదానికి గురవుతుంటారు. గుండె పనితీరుపై అవగాహన లేకనే చాలామంది ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. గుండెపోటు లక్షణాలు, నివారణ చర్యలు, గుండెపోటు వస్తే తక్షణం చేయాల్సిన పనులు ఏంటంటే..
3/8
జలుబు, ఫ్లూ జ్వరం తరచుగా వస్తున్నా.. అవి ఓ పట్టాన తగ్గకున్నా.. అనుమానించాల్సిందే. ఎందుకంటే అవి హార్ట్ఎటాక్ వస్తుందనడానికి సూచికలు. దీంతోపాటు దగ్గు కూడా ఎక్కువగా వస్తున్నా దాన్ని హార్ట్ ఎటాక్‌కు చిహ్నంగా అనుమానించాలి.
4/8
గుండెపోటుకు సంబంధించిన లక్షణాల్లో మరోటి శ్వాస ఆడకపోవడం. గాలి పీల్చుకోవడంలో తరచూ ఇబ్బందులు వస్తున్నా దాన్ని హార్ట్ ఎటాక్ లక్షణంగా అనుమానించాలి.
5/8
ఛాతిలో అసౌకర్యంగా ఉంటున్నా, ఏదో బరువుగా ఛాతిపై పెట్టినట్లు అనిపిస్తున్నా అది హార్ట్ ఎటాక్ సూచనే అవుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.
6/8
మత్తు మత్తుగా నిద్ర వచ్చినట్లు ఉంటున్నా. చెమటలు ఎక్కువగా వస్తున్నా అనుమానించాల్సిందే. విపరీతంగా అలసిపోవడం, ఒళ్లంతా నొప్పులుగా ఉండడం వంటి లక్షణాలు తరచూ కనిపిస్తుంటే వాటిని అశ్రద్ధ చేయకూడదు.