Raw Coconut | పచ్చి కొబ్బరిని మనం తరచూ వంటల్లో వేస్తుంటాం. దీంతో ఉదయం టిఫిన్లోకి చట్నీ చేస్తారు. కూరల్లోనూ పచ్చి కొబ్బరి వేస్తారు. దీంతో వంటలకు చక్కని రుచి వస్తుంది. అయితే పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం పచ్చి కొబ్బరిలో అనేక పోషకాలు ఉంటాయి. పచ్చి కొబ్బరిని రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు. మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు పచ్చి కొబ్బరిలో ఉంటాయి. పచ్చి కొబ్బరిని తింటే పలు వ్యాధులు నయం కూడా అవుతాయని అంటున్నారు. పచ్చి కొబ్బరిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో మాంగనీస్, కాపర్, సెలీనియం, ఐరన్ వంటి మినరల్స్ అధికంగా ఉంటాయి.
పచ్చి కొబ్బరిలో ఉండే మాంగనీస్ ఎముకలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. మనం తినే ఆహారాల్లో ఉండే పిండి పదార్థాలు, ప్రోటీన్లను జీర్ణం చేయడంలో శరీరానికి సహాయం చేస్తుంది. పచ్చి కొబ్బరిలో మీడియం చెయిన్ ట్రై గ్లిజరైడ్స్ ఉంటాయి. వీటిని లివర్ నేరుగా గ్రహిస్తుంది. దీంతో శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. దీని వల్ల శరీరంలో శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. శారీరక శ్రమ చేసే వారికి, వ్యాయామం చేసేవారికి శక్తి వెంటనే లభిస్తుంది. కోల్పోయిన శక్తిని తిరిగి పొందుతారు. మళ్లీ ఉత్సాహంగా పని చేసేందుకు కావల్సిన శక్తి లభిస్తుంది. నీరసం, అలసట తగ్గుతాయి. ఈ కొబ్బరిని తింటే మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది.
పచ్చి కొబ్బరిలో ఉండే ఫైబర్ పేగుల్లో మలం కదలికలను సులభతరం చేస్తుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. ఈ కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు ప్రీ బయోటిక్ ఆహారంగా పనిచేస్తాయి. ఇవి జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేస్తాయి. దీంతో జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. పచ్చి కొబ్బరిలో లారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన ఫ్యాటీ యాసిడ్ల జాబితాకు చెందుతుంది. ఇది మన శరీరంలో మోనో లారిన్ అనే సమ్మేళనంగా మారుతుంది. మోనో లారిన్ యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది.
అధిక బరువును తగ్గించుకోవాలని చూస్తున్న వారు పచ్చి కొబ్బరిని ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి బరువు తగ్గేందుకు సహాయం చేస్తాయి. ఈ కొబ్బరిలో ఉండే ఫైబర్ వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. పచ్చి కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు థర్మో జెనెసిస్ అనే ప్రక్రియను వేగవంతం చేస్తాయి. దీంతో క్యాలరీలు సులభంగా ఖర్చయి కొవ్వు కరుగుతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. కనుక బరువు తగ్గాలని చూస్తున్న వారు పచ్చి కొబ్బరిని ఆహారంలో భాగం చేసుకోవాలి. దీన్ని తింటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. శిరోజాలు ఒత్తుగా పెరిగి దృఢంగా మారుతాయి. కాంతివంతంగా కనిపిస్తాయి. ఇలా పచ్చి కొబ్బరిని రోజూ తింటే అనేక లాభాలను పొందవచ్చు.