అల్లం రసాన్ని మనం రోజూ తీసుకోవాల్సిందే.. ఎందుకో తెలుసా..?

మనం చేసుకునే వంటల్లో అల్లంను వేయడం వల్ల వాటికి చక్కని రుచి వస్తుంది. అయితే కేవలం రుచికే కాదు, ఔషధ గుణాలను కలిగి ఉండడంలోనూ అల్లం పెట్టింది పేరు. ఎంతో కాలం నుంచి భారతీయులు అల్లంను పలు అనారోగ్య సమస్యలకు ఔషధంగా వాడుతున్నారు. ఈ క్రమంలోనే మనం నిత్యం అల్లంను ఎందుకు తీసుకోవాలో, దాంతో మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం లేవగానే కొందరికి వికారంగా, వాంతికి వచ్చినట్లుగా ఉంటుంది. అలాంటి వారు పరిగడుపునే అల్లం రసం తాగాలి. ఇలా రోజూ చేయడం వల్ల పైత్యం పోతుంది. వికారం సమస్య తగ్గుతుంది.
పీరియడ్స్ ప్రారంభం అయ్యే ముందు స్త్రీలు అల్లం రసం సేవిస్తుంటే రుతు సమయంలో వచ్చే నొప్పి కొంత వరకు తగ్గుతుంది.
ఆర్థరైటిస్ వల్ల కలిగే నొప్పి, వాపులను తగ్గించడంలో అల్లం సమర్థవంతంగా పనిచేస్తుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 3 నుంచి 30 నెలల పాటు 56 మంది పేషెంట్లకు నిత్యం అల్లం రసం ఇచ్చి వారిలో ఉన్న ఆర్థరైటిస్ లక్షణాలను పరిశీలించగా.. కొద్ది వారాల అనంతరమే చాలా మందిలో నొప్పులు, వాపులు తగ్గినట్లు సైంటిస్టులు గుర్తించారు. అందువల్ల నిత్యం అల్లంను తీసుకుంటే ఆర్థరైటిస్ నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం పొందవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.
రక్తాన్ని పలుచగా చేయడంలోనూ అల్లం బాగా పనిచేస్తుంది. ఇది గుండెపోటు వచ్చే వారికి, వస్తుందనుకున్న వారికి ఉపయోగపడే విషయం. వారు అల్లం రసాన్ని నిత్యం సేవిస్తే రక్త సరఫరా మెరుగు పడుతుంది. రక్తనాళాల్లో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి.
టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు నిత్యం అల్లం రసం సేవిస్తుంటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. దీంతో శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా గ్రహిస్తుంది. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి.
జీర్ణసమస్యలు ఉన్నవారు నిత్యం అల్లం రసం సేవిస్తే ఫలితం ఉంటుంది. అల్లం రసం మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. గ్యాస్, అసిడిటీ రాకుండా చూస్తుంది. మలబద్దకం ఉండదు.
తలనొప్పి, దగ్గు, జలుబు వంటి సాధారణ అనారోగ్య సమస్యలకు కూడా అల్లం అమోఘంగా పనిచేస్తుంది. అల్లం రసం లేదా అల్లం కషాయం సేవిస్తే ఆయా సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఇవి కూడా చదవండి..
గొంతునొప్పి తగ్గాలా..అయితే వీటిని తీసుకోండి..!
రోగనిరోధక శక్తి పెరగాలంటే.. పసుపు పాలు తాగాల్సిందే
కీరదోస తింటే 7 రోజుల్లో 7 కిలోల బరువు తగ్గుతారా?
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Parliament: ప్రోరోగ్ కాకుండా 88 రోజులుగా వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్లో కొత్త రికార్డు
OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. రణబాలి నుంచి జైలర్ 2 వరకు..!
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

