Lung Inflammation | ఊపిరితిత్తులు శ్వాస వ్యవస్థలోని ప్రధాన అవయవం. గుండెకు ఇరువైపులా అమరి ఉండి పక్కటెముకల రక్షణలో ఉంటాయి. బయటి వాతావరణంలో నుంచి ఆక్సీజన్‌ను శరీరంలోకి పంపించడం, శరీరం నుంచి కార్బన్ డై ఆక్సైడ్‌ను బయటకు పంపుతుంది. కొన్నిరకాల ఇన్ఫెక్షన్లు ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయి. ఒక్కోసారి వాపులకు గురై ప్రాణాంతకం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఊపిరితిత్తుల వాపు సాధారణంగా విషపదార్తాలు, కాలుష్య కారకాలు, కలుషితాలు, అలెర్జీ కారకాలకు గురవ్వడం వల్ల వస్తుంటుంది. ఈ వాపు ఊపిరితిత్తులకు నెమ్మదిగా, శాశ్వతంగా హాని కలిగిస్తుందని గుర్తుంచుకోవాలి.
వైద్యపరంగా న్యుమోనియా, ఆక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ వలన తీవ్రమైన వాపు వస్తుంది. ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ కేసుల్లో కూడా దీర్ఘకాలిక మంట కనిపిస్తుంది. తరచుగా దగ్గు వస్తుండటం, గురక ఉండటంతో ఈ వాపు లక్షణాలను పట్టించుకోం. ఊపిరితిత్తుల సంబంధ వ్యాధులతో లక్షణాలు చాలా తేలికగా ఉంటాయి. ఊపిరితిత్తుల వాపు హెచ్చరిక సంకేతాలను గుర్తించడం ద్వారా ముందస్తుగా చికిత్స తీసుకోవచ్చు.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
తగినంత గాలి అందడం లేదనే ఫీలింగ్, గురక, దీర్ఘకాలిక దగ్గు, జ్వరం, దగ్గినప్పుడు రక్తం పడటం, ఛాతీలో దీర్ఘకాలిక నొప్పి, ఊపిరితిత్తుల అంటువ్యాధులు వంటి వాటి వల్ల కూడా ఊపిరితిత్తుల్లో వాపు కనిపిస్తుంది. జంతువులతో సహవాసం చేయడం వల్ల కూడా ఇన్ఫెక్షన్లు దరిచేరి వాపుకు కారణమవుతాయి. కొన్ని రకాల ఇన్ఫెక్షన్లను నివారించలేనప్పటికీ క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఉండకుండా చూసుకోవడం, సిగరెట్ స్మోకింగ్ చేయకుండా ఉండటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారాం తీసుకోవడం వంటి చిట్కాలతో ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
వాపు గుర్తింపు పరీక్షలు..
ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తాత్కాలికం, దీర్ఘకాలిక వ్యాధి కూడా కావచ్చు. ఫిజికల్ ఎగ్జామినేషన్, ఇమేజ్ టెస్టింగ్, ఊపిరితిత్తుల పనితీరు పరీక్ష వంటి పద్ధతులు వాపును నిర్ధారించేందుకు ఉపయోగిస్తారు. దీని చికిత్సకు కొన్ని సందర్భాల్లో మందులు వాడమని వైద్యులు సూచిస్తుంటారు. మరికొన్ని సందర్భాల్లో సర్జరీ అవసరం అవుతుంది. 60 కన్నా ఎక్కువ వయసున్న వ్యక్తులు, 5 కంటే తక్కువ వయసు పిల్లల్లో దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులు కనిపిస్తాయి. రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న వ్యక్తుల ఊపిరితిత్తులకు వాపు వచ్చినట్లు ఏవైనా లక్షణాలు కనిపించగానే వెంటనే వైద్య చికిత్స ప్రారంభించాలి.
కొన్ని రకాలు అంటు వ్యాధులు..
ఇన్ఫ్లుయెంజా, కొవిడ్-19ను వ్యాపింపజేసే వైరస్లు లేదా న్యుమోనియా, క్షయను వ్యాపించే బ్యాక్టీరియాల వల్ల అంటువ్యాధిగా ఉంటుంది. జన్యుపరమైన కారణాలు లేదా ఆటో ఇమ్యూన్ కారణంగా నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులు కలుగుతాయి. ఊపిరితిత్తుల వాపు అనేది వివిధ ఊపిరితిత్తుల ఆరోగ్య సమస్యల ప్రధాన లక్షణం. ఇది శ్వాసకోశ లక్షణాలకు కూడా కారణమవుతుంది. గాలిలో ఉండే విషపదార్థాలు న్యుమోనైటిస్కు దారితీస్తాయి. ఊపిరితిత్తుల వాపు ఇన్ఫెక్షన్స్, ఉబ్బసం లేదా బ్రాంకైటీస్ వంటి వ్యాధులకు గురవడం వల్ల కూడా సంభవిస్తుంది. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్న చిన్నారుల్లో న్యుమోనియా కారణంగా మరణిస్తుంటారు.