HomeHealthWalking Exercise Provides Many Health Benefits
పదండి ముందుకు..
చాలామంది నడకకు ముందు వార్మప్ ఎక్సర్సైజులు చేస్తుంటారు. ఆ అవసరం లేదు. నడక.. కష్టమైన కసరత్తుల జాబితాలోకి రాదు.
నడక ఆరోగ్యాన్ని, ఆకృతిని మెరుగు పరుస్తుంది. కానీ, అడుగులు సరిగా పడకపోతే.. ఆ ప్రయత్నమంతా వృథా. కాబట్టి, వాకింగ్‌లో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.
1 వార్మప్ వద్దు
చాలామంది నడకకు ముందు వార్మప్ ఎక్సర్సైజులు చేస్తుంటారు. ఆ అవసరం లేదు. నడక.. కష్టమైన కసరత్తుల జాబితాలోకి రాదు. కాబట్టి కండరాలను సిద్ధం చేయాల్సిన అవసరమే లేదు.
2 పాదరక్షల ఎంపిక
పాదాలకు సౌకర్యవంతంగా ఉండే షూస్ ఎంచుకోవాలి. నడుస్తున్నప్పుడు గట్టిగా ఒత్తుకు
పోతున్నా, అసౌకర్యంగా అనిపించినా మార్చేయాలి. గాలిసోకే పాదరక్షలే మేలు.
3 దుస్తులు
వదులుగా ఉండాలి. శరీరానికి గాలి సోకాలి. చెమటను పీల్చుకునేలా ఉండాలి. మరీ బిగుతుగా ఉంటే నడకపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
4 ఒకే దారిలో వద్దే వద్దు
నడక వల్ల మేలు జరగాలంటే రోజుకో మార్గంలో నడవాలి. ఒకే దారిలో నడిస్తే ఉల్లాసం ఉండదు. రొటీన్‌గా అనిపిస్తుంది.
5 దూరం దూరం
శరీర భాషను అర్థం చేసుకోవాలి. తీవ్ర అలసట కలిగించనంత దూరమే నడవండి. రోజూ కొంతకొంత దూరాన్ని పెంచుకుంటూ వెళ్లాలి.
6 నిటారుగా
నడక సమయంలో నిటారుగా ఉండాలి. లేకపోతే, అనుకున్న ప్రయోజనాలు నెరవేరవు.