Vitamin D | మహిళల్లో విటమిన్ డి లోపం ఎక్కువ.. ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు..
ఇప్పటి కాలంలో చాలామంది నిరంతర అలసటతో బాధపడుతున్నారు. శరీరంలో శక్తి తగ్గడం, జుట్టు రాలడం, కండరాల నొప్పులు వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు రక్త పరీక్షలు చేయించుకోవడం మొదటి అడుగు.
Vitamin D | ఇప్పటి కాలంలో చాలామంది నిరంతర అలసటతో బాధపడుతున్నారు. శరీరంలో శక్తి తగ్గడం, జుట్టు రాలడం, కండరాల నొప్పులు వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు రక్త పరీక్షలు చేయించుకోవడం మొదటి అడుగు. అయితే చాలా సందర్భాల్లో రిపోర్టులు సాధారణంగానే వస్తాయి. అప్పుడు అసలు సమస్య ఏమిటో తెలియక గందరగోళం మొదలవుతుంది. వైద్యుల ప్రకారం ఈ అనూహ్య లక్షణాలకు ప్రధాన కారణాల్లో ఒకటి విటమిన్ డి లోపం అయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మహిళల్లో ఇది చాలా సాధారణంగా కనిపిస్తోంది. విటమిన్ డి స్థాయిలను పరీక్షించుకోవడాన్ని చాలా మంది మహిళలు నిర్లక్ష్యం చేస్తున్నారు.
మహిళల్లోనే ఎక్కువ..
విటమిన్ డి సాధారణ విటమిన్ మాత్రమే కాదు, ఇది శరీరంలో హార్మోన్లా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాల్షియం శోషణకు ఇది కీలకం. ఎముకల బలాన్ని కాపాడటంలో, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో, కండరాల పనితీరును నియంత్రించడంలో, శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో విటమిన్ డి ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే విటమిన్ డి స్థాయిలు తగ్గినప్పుడు శరీరం కొన్ని చిన్న సంకేతాలు ఇస్తుంది. నిరంతర అలసట, జుట్టు రాలడం, కండరాల నొప్పులు, మూడ్ మార్పులు, శక్తి లేమి వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన పరిస్థితుల్లో ఇది వంధ్యత్వ సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది. అలాగే భవిష్యత్తులో ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అంతేకాకుండా మహిళలు విటమిన్ డి లోపానికి ఎక్కువగా గురవుతారని వైద్యులు చెబుతున్నారు. పురుషులతో పోలిస్తే ఎముకల సాంద్రత తక్కువగా ఉండటం, జీవన దశల్లో హార్మోన్ల మార్పులు, గర్భధారణ, బాలింత దశలు ఇందుకు కారణాలు. అంతేకాకుండా ఆధునిక జీవనశైలి కూడా దీనిపై ప్రభావం చూపుతోంది. ఎక్కువ సమయం ఇంటి లోపల గడపడం, సూర్యకాంతి తక్కువగా పొందడం వంటి కారణాలు కూడా లోపాన్ని పెంచుతున్నాయి.
వైద్య పరీక్షలు అవసరం..
విటమిన్ డి స్థాయిలను తెలుసుకోవడానికి ప్రత్యేకంగా 25-హైడ్రోక్సీ విటమిన్ డి పరీక్ష చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పరీక్ష ద్వారా శరీరంలో విటమిన్ డి పరిమాణాన్ని కచ్చితంగా అంచనా వేయవచ్చు. సాధారణంగా ఈ స్థాయిలు 30 నుంచి 50 నానోగ్రామ్ల మధ్య ఉండటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. విటమిన్ డి స్థాయిలను సరిగా ఉంచుకోవడానికి కొన్ని సులభమైన మార్గాలను కూడా నిపుణులు సూచిస్తున్నారు. వైద్యుల సలహాతో సప్లిమెంట్లు తీసుకోవడం, రోజూ 15 నుంచి 20 నిమిషాలు సూర్యరశ్మిలో గడపడం, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహారంతో కలిసి విటమిన్ డి తీసుకోవడం ఉపయోగకరం. సాధారణంగా పెద్దలకు రోజుకు 800 నుంచి 1200 ఐయూ వరకు విటమిన్ డి అవసరం అవుతుందని సూచిస్తున్నారు. విటమిన్ డి లోపాన్ని చిన్న సమస్యగా తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఎముకల ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, హార్మోన్ సమతుల్యతపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది. కాబట్టి అవసరమైన పరీక్షలను సమయానికి చేయించుకోవడం ద్వారా భవిష్యత్తులో పెద్ద సమస్యలను నివారించవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- health tips
- Vitamin D
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

