విటమిన్ బి12 మన శరీరంలో సాధారణంగానే వృద్ధి చెందుతుంది. ఇందులో లోపం తలెత్తినప్పుడు.. శరీర అవయవాలకు రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. దాంతో.. శరీరం క్రమంగా బలహీనపడుతుంది. కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు వస్తాయి. కొందరిలో రుచి, వాసనతోపాటు జ్ఞాపకశక్తి, ఆలోచనా శక్తి కూడా తగ్గిపోతుంది. ఇక మహిళల్లో రక్తహీనత సమస్య ఏర్పడుతుంది.
ఇవి తింటే చాలు..
విటమిన్ బి12 లోపాన్ని.. ఎలాంటి మందుల అవసరం లేకుండానే అధిగమించవచ్చు. మాంసాహారం, సీఫుడ్, గుడ్డులో విటమిన్ బి12 ఎక్కువగా లభిస్తుంది. రోజూవారి ఆహారంలో వీటిని భాగం చేసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్ బి12ను అందించవచ్చు. శాకాహారులైతే.. ఆకుకూరలు, పుట్టగొడుగులు తీసుకోవాలి. పాలు, పెరుగు, జున్ను, పులిసిన మజ్జిగలోనూ బి12 పుష్కలంగా ఉంటుంది. బాదం, పిస్తాలాంటి డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా.. సమస్య దూరమవుతుంది. అన్నిటికీమించి.. మంచినీటిలోనూ బి12 లభిస్తుంది. తగిన మోతాదులో నీటిని తాగడం వల్ల పై సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి.
కొందరిలో చీటికీమాటికీ కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు వస్తుంటాయి. తల తిరగడం, తూలడం వంటి సమస్యలూ కనిపిస్తుంటాయి. దీనికి ప్రధాన కారణం.. మెదడుకు రక్త సరఫరా సక్రమంగా జరగకపోవడమే! ముఖ్యంగా విటమిన్ బి12 లోపిస్తే.. తిమ్మిర్లు అధికంగా ఇబ్బంది పెడుతుంటాయి. ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా.. ఈ సమస్యను అధిగమించ వచ్చని ఆహార నిపుణులు చెబుతున్నారు.