ఆరోగ్య దశమి
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి. రావణాసురుడిపై రాముడి విజయం, మహిషాసురుడిపై అమ్మవారి విజయం మనకు అందించే సందేశం ఒకటే.. అడ్డంకులెన్ని ఎదురైనా మంచిని గెలిపించుకోవాలి. మరి మన జీవితంలోనూ విజయం సాధించాలంటే... అనారోగ్యపు అలవాట్లపై ఆరోగ్యకరమైన జీవనశైలి విజయం సాధించాలి. ఒత్తిడిపై ప్రశాంతత, బద్ధకంపై చురుకుదనం, అజాగ్రత్తపై ఆరోగ్య సృ్పహ గెలవాలి. పండుగనాడు కొత్త దుస్తులు ధరించినట్లే.. కొత్త ఆరోగ్య అలవాట్లనూ ఆహ్వానించాలి.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి. రావణాసురుడిపై రాముడి విజయం, మహిషాసురుడిపై అమ్మవారి విజయం మనకు అందించే సందేశం ఒకటే.. అడ్డంకులెన్ని ఎదురైనా మంచిని గెలిపించుకోవాలి. మరి మన జీవితంలోనూ విజయం సాధించాలంటే… అనారోగ్యపు అలవాట్లపై ఆరోగ్యకరమైన జీవనశైలి విజయం సాధించాలి. ఒత్తిడిపై ప్రశాంతత, బద్ధకంపై చురుకుదనం, అజాగ్రత్తపై ఆరోగ్య సృ్పహ గెలవాలి. పండుగనాడు కొత్త దుస్తులు ధరించినట్లే.. కొత్త ఆరోగ్య అలవాట్లనూ ఆహ్వానించాలి. ఆరోగ్యం అంటే జబ్బులు లేకపోవడమే కాదు.. ఉత్సాహంగా పనిచేయగలగడం, మనస్ఫూర్తిగా నవ్వగలగడం, కుటుంబంతో ఆనందంగా గడపగలగడం కూడా! ఈ విజయదశమికి మనకు మనం ఇచ్చుకునే విలువైన కానుక.. ఆరోగ్య విజయమే!
- ఆకలిని గౌరవించాలి
‘తిండి కలిగితే కండ కలదోయ్ ’ అని పెద్దలు చెప్పిన మాట శరీరానికి పౌష్టికాహారం అవసరమనే విషయాన్ని గుర్తుచేస్తుంది. ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, పండ్లు, తగిన మోతాదులో గింజలు ఆహారంలో భాగం కావాలి. ఉప్పు, చకెర, కొవ్వు పదార్థాలు తగ్గించాలి. ఇటీవల భారతీయ వైద్య పరిశోధనా మండలి ఆధ్వర్యంలోని జాతీయ పోషకాహార సంస్థ ఆహార మార్గదర్శకాలు కూడా వైవిధ్యభరితమైన, సమతుల ఆహారానికే ప్రాధాన్యమిచ్చాయి. - నడక నిత్యకృత్యం
వ్యాయామం కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించలేకపోతున్నామనే సాకు వద్దు. రోజువారీ నడకతో మొదలుపెట్టాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం, పెద్దలు వారానికి కనీసం 150- 300 నిమిషాలు మధ్యస్థ తీవ్రతతో శారీరక శ్రమ చేయాలి. సాధ్యమైనంత వరకు క్రమంగా ఈ అలవాటు పెంచుకోవాలి. నడక మన ఆరోగ్యాన్ని నడిపించే ఇంధనం అన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి. - నిద్రకు ప్రాధాన్యం
రాత్రంతా తెరల ముందు గడిపి, ఉదయం అలసటతో లేవడం ఆరోగ్యానికి మంచిది కాదు. పెద్దలకు సాధారణంగా ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర అవసరం. ఒకే సమయానికి పడుకోవడం, లేవడం, నిద్రకు ముందు ఫోన్‌కు దూరంగా ఉండటం మంచి అలవాట్లు. నిద్ర శరీరానికి విశ్రాంతినివ్వడమే కాదు… జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, భావోద్వేగ నియంత్రణలకు తోడ్పడుతుంది.
మనసుకు విశ్రాంతి పని, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఆందోళనల మధ్య మనసును పట్టించుకోవడం మరిచిపోతుంటాం. రోజుకు పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చోవడం, నచ్చిన సంగీతం వినడం, ప్రకృతిలో గడపడం ఒత్తిడిని తగ్గించుకోవడానికి తోడ్పడతాయి. దీర్ఘకాలిక ఒత్తిడి నిద్రను, ప్రశాంతతను కూడా దెబ్బ తీస్తుంది. కాబట్టి దాన్ని తగ్గించుకునే దిశగా చర్యలు చేపట్టాలి. - తగినంత నీరు
దాహాన్ని పట్టించుకోకుండా పనిలో మునిగిపోవద్దు. వాతావరణం, శారీరక శ్రమ, ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా నీరు తాగాలి. చకెర పానీయాలకంటే సాధారణ నీటికే ప్రాధాన్యమివ్వాలి. శరీర ఉష్ణోగ్రత నియంత్రణ, పోషకాల రవాణా, వ్యర్థాల విసర్జనకు నీరు అవసరం. - చిన్నదైనా నిర్లక్ష్యం వద్దు
‘వచ్చిన రోగాన్ని ఆరంభంలోనే గుర్తించాలి’ అన్నది ఆరోగ్య పరిరక్షణలో కీలకమైన సూత్రం. రక్తపోటు, రక్తంలో చకెర స్థాయులు, అవసరమైన ఇతర పరీక్షలు వైద్యుల సూచన మేరకు చేయించుకోవాలి. - లక్షణాలు లేకపోయినా కొన్ని సమస్యలు
ఉండవచ్చు. స్వయంగా మందులు వాడటం కంటే వైద్య సలహా తీసుకోవడం మంచిది. - పరిశుభ్రతే తొలి రక్ష
భోజనానికి ముందు, కాలకృత్యాల వినియోగం తర్వాత చేతులు కడుకోవడం చాలా ముఖ్యమైన విషయం. శుభ్రమైన నీరు తాగడం, ఆహారాన్ని సురక్షితంగా నిల్వ చేయడంలాంటివీ చిన్న అలవాట్లే అయినా అనేక అనారోగ్య సమస్యలను నివారించడంలో తోడ్పడతాయి. పరిశుభ్రత పాటించడం వల్ల మనం అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందుతాం. - బంధాలు పదిలం
మనసులోని బాధను పంచుకోవడానికి ఒక మనిషి ఉండటం కూడా ఎంతో విలువైన విషయం. కుటుంబ సభ్యులతో మాట్లాడటం, స్నేహితులను పలకరించడం, అవసరమైనప్పుడు సహాయం అడగడం మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సామాజిక అనుబంధాలు మెరుగైన మానసిక, శారీరక ఆరోగ్యంతో సంబంధం కలిగి ఉన్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. - వ్యసనాలకు దూరంగా ఉండాలి!
పొగాకు, మద్యపానం వంటి హానికర వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఎకువసేపు కూర్చోవడం, రాత్రుళ్లు మేలొని ఉండటం, నిరంతరం తెరలను చూస్తూ గడపడం వంటి అలవాట్లనూ మార్చుకోవాలి. చిన్న మార్పులే దీర్ఘకాలంలో పెద్ద ప్రయోజనాలను అందిస్తాయి. - ఆరోగ్యం అలవాటుగా
ఒకరోజు వ్యాయామం చేసి, మరుసటి రోజు మానేయడం కంటే ప్రతిరోజూ కొద్దిసేపైనా క్రమం తప్పకుండా చేయడం ముఖ్యం. బరువు, వయసు, ఆరోగ్య పరిస్థితులను బట్టి లక్ష్యాలను నిర్ణయించుకోవాలి. ఇతరులతో పోల్చుకోకుండా నిన్నటి కంటే ఈరోజు ఆరోగ్యకరమైన నిర్ణయం తీసుకున్నామా లేదా అన్నది చూసుకోవాలి. ఆరోగ్యం అనేది ఒకరోజులో సాధించే విజయం కాదు. ప్రతిరోజూ తీసుకునే చిన్న చిన్న నిర్ణయాల సమాహారం. ఖరీదైన వస్తువులు, విలాసవంతమైన జీవితం మాత్రమే ఆనందాన్ని ఇవ్వవు. శరీరానికి ఆరోగ్యం.. మనసుకు ప్రశాంతత.. జీవితానికి సంతృప్తి… ఇవే అసలైన సంపదలు. అందుకే శరీరాన్ని ప్రేమిద్దాం.. మనసును గౌరవిద్దాం.. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. అదే మన జీవితంలో నిజమైన ‘ఆరోగ్య విజయం’!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

